టయోటా గ్లాంజా చీపెస్ట్ వేరియంట్ విడుదల: నమ్మశక్యంగాని ధరతో మార్కెట్లోకి

టయోటా మోటార్స్ తమ గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును అత్యంత సరసమైన ధరలో బేస్ వేరియంట్‌ లాంచ్ చేసింది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో గ్లాంజా కారును "G" వేరియంట్లో రిలీజ్ చేశారు. సరికొత్త టయోటా గ్లాంజా G వేరియంట్ ధర రూ. 6.97 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

టయోటా గ్లాంజా చీపెస్ట్ వేరియంట్ విడుదల: నమ్మశక్యంగాని ధరతో మార్కెట్లోకి

టయోటా గ్లాంజా ప్రస్తుతం G మరియు V అనే డిఫరెంట్ వేరియంట్లలో లభ్యమవుతోంది. రెండింటిలో కూడా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది.

టయోటా గ్లాంజా చీపెస్ట్ వేరియంట్ విడుదల: నమ్మశక్యంగాని ధరతో మార్కెట్లోకి

టయోటా గ్లాంజా G MT వేరియంట్ ఇప్పుడు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా లభ్యమవుతోంది. దీని ధర రూ. 7.21 లక్షలుగా ఖరారు చేశారు. ఇదే వేరియంట్‌ను స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ లేకుండా రూ. 24,000 తక్కువ ధరతో చీపెస్ట్ వేరియంట్‌గా మరో వెర్షన్ అందుబాటులో ఉంచారు.

టయోటా గ్లాంజా చీపెస్ట్ వేరియంట్ విడుదల: నమ్మశక్యంగాని ధరతో మార్కెట్లోకి

గ్లాంజా G MT చీపెస్ట్ వేరియంట్లో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ రాకపోవడం మినహాయిస్తే ఫీచర్ల పరంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. మిగతా వేరియంట్ల తరహాలోనే అన్ని ఫీచర్లు ఇందులో కూడా యథవిధిగా లభిస్తాయి.

టయోటా గ్లాంజా చీపెస్ట్ వేరియంట్ విడుదల: నమ్మశక్యంగాని ధరతో మార్కెట్లోకి

ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిట్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ల్పే, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫాలో-మి-హోమ్ హెడ్‌ల్యాంప్స్ ఇంకా ఎన్నో ఫీచర్లు వచ్చాయి.

టయోటా గ్లాంజా చీపెస్ట్ వేరియంట్ విడుదల: నమ్మశక్యంగాని ధరతో మార్కెట్లోకి

టయోటా గ్లాంజా మారుతి సుజుకి బాలెనో యొక్క రీబ్యాడ్జ్‌ వెర్షన్. టయోటా-సుజుకి ఇండియా మధ్య కుదిరిన భాగస్వామ్యపు ఒప్పందం మేరకు రెండు కంపెనీలు కూడా తమ కార్లను కొత్త బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నాయి.

టయోటా గ్లాంజా చీపెస్ట్ వేరియంట్ విడుదల: నమ్మశక్యంగాని ధరతో మార్కెట్లోకి

టయోటా గ్లాంజా మోడల్ మారుతి సుజుకి బాలెనో యొక్క రీ-బ్యాడ్జ్‌డ్ వెర్షన్ అయినప్పటికీ ఇందులోని ఫీచర్లు పరంగా కస్టమర్లను బాగా ఆకట్టుకుంది. టయోటా గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో ఉన్న వోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ మోడళ్లను సేల్స్ పరంగా వెనక్కినెట్టేసింది.

టయోటా గ్లాంజా చీపెస్ట్ వేరియంట్ విడుదల: నమ్మశక్యంగాని ధరతో మార్కెట్లోకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా గ్లాంజా ఇప్పుడు చౌక వేరియంట్లో లభిస్తోంది. గతంతో పోలిస్తే గ్లాంజా బేస్ వేరియంట్ ధర ఇప్పుడు చాలా తక్కువ. అంటే మారుతి సుజుకి బాలెనో లైనప్‌లో ఉన్న జెటా వేరియంట్‌తో సమానం. గ్లాంజాలోని ఇతర వేరియంట్లపై కంపెనీ ఇదివరకే ధరలు పెంచింది. దీంతో గ్లాంజా బేస్ వేరియంట్ చీపెస్ట్ ధరకే లభ్యమవుతోంది.

Most Read Articles

English summary
Toyota Glanza Introduced With New Base Variant: Prices Now Start At Rs 6.97 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X