మారుతి నుండి మరో 5 కొత్త కార్లు: విడుదల మరియు ధరల వివరాల కోసం

భారతదేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి త్వరలో 5 కొత్త కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా దేశీయ మార్కెట్లో అతి పెద్ద దిగ్గజ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన మారుతి మరో సంచలనానికి తెరదించింది. అవును మీరు విన్నది నిజమే... 2019-20 సంవత్సర కాలంలో 5 కొత్త మోడళ్లను లాంచ్ చేయనుంది. ఇప్పటికే విడుదలైన కొన్ని మోడళ్లను ఫేస్‌లిఫ్ట్ రూపంలో రీలాంచ్ చేస్తుండగా.. మరిన్ని కొత్త మోడళ్లను తొలిసారిగా పరిచయం చేస్తోంది.

మారుతి నుండి మరో 5 కొత్త కార్లు: విడుదల మరియు ధరల వివరాల కోసం

5. మారుతి సుజుకి విటారా

మారుతి సుజుకి విటారా ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తుండగా తొలిసారి మీడియాకు పట్టుబడింది. ఇది విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు టాటా హ్యారీయర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది. విటారా ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో లాంచ్ చేస్తే, మారుతి సుజుకి ఇండియా యొక్క ఖరీదైన మోడల్‌గా మార్కెట్లో నిలవనుంది. మారుతి విటారా ఎస్‌యూవీలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది.

విడుదల అంచనా: 2020 ప్రారంభం నాటికి

మారుతి నుండి మరో 5 కొత్త కార్లు: విడుదల మరియు ధరల వివరాల కోసం

4. మారుతి సుజుకి ఎర్టిగా క్రాస్

మారుతి సుజుకి తమ ఎర్టిగా ఎంపీవీని ప్రీమియం వెర్షన్‌లో ఎర్టిగా క్రాస్ పేరుతో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదలైన కొత్త తరం ఎర్టిగా ఆధారంగానే ఎర్టిగా క్రాస్ మోడల్‌ను సిద్దం చేస్తున్నారు. సీఎన్‌జీ మరియు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ జోడింపు గల 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఇతర ఎర్టిగా మోడళ్ల కంటే అత్యుత్తమ మైలేజ్‌నిస్తుంది.

విడుదల అంచనా: ఆగష్టు 2019

మారుతి నుండి మరో 5 కొత్త కార్లు: విడుదల మరియు ధరల వివరాల కోసం

3. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

మారుతి సరికొత్త ఎస్-ప్రెస్సో కారును విడుదలకు సిద్దం చేసింది. మారుతి ఎస్-ప్రెస్సో కారు ఎస్‌యూవీ డిజైన్ శైలిలో వచ్చిన హ్యాచ్‌బ్యాక్ మోడల్. 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన ఫ్యూచర్-ఎస్ కాన్సెప్ట్ మోడల్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ ఎస్-ప్రెస్సో. బిఎస్-6 ఉద్గార నియమాలను పాటించే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ గల మారుతి ఎస్-ప్రెస్సో దేశవ్యాప్తంగా ఉన్న మారుతి అరేనా షోరూమ్‌ల ద్వారా విక్రయించనున్నారు.

విడుదల అంచనా: అక్టోబర్ 2019

మారుతి నుండి మరో 5 కొత్త కార్లు: విడుదల మరియు ధరల వివరాల కోసం

2. మారుతి విటారా బ్రిజా

మారుతి సుజుకి విటారా బ్రిజా భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. విడుదలైన అనతి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందింది. కానీ, వచ్చే ఏడాది నుండి బిఎస్-6 ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో డీజల్ ఇంజన్‌ ప్రొడక్షన్ నిలిపివేసి వీటి స్థానంలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందివ్వడానికి సిద్దమవుతోంది. అంతే కాకుండా వీటిలో అత్యుత్తమ మైలేజ్ ఇచ్చేందుకు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని జోడింపుగా అందిస్తోంది.

విడుదల అంచనా: నవంబర్ 2019

మారుతి నుండి మరో 5 కొత్త కార్లు: విడుదల మరియు ధరల వివరాల కోసం

1. మారుతి ఎస్-క్రాస్ పెట్రోల్

మారుతి సుజుకి ప్రీమియం వెర్షన్ ఎస్-క్రాస్ క్రాసోవర్ మోడల్‌ను విడుదల చేయనుంది. ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌లో పలు మార్పులు జరిగాయి. ఇందులో కూడా డీజల్ ఇంజన్‌లను తొలగించి కేవలం పెట్రోల్ వేరియంట్లను మాత్రమే అందించాలని భావిస్తోంది. అంతే కాకుండా మరెన్నో కొత్త ఫీచర్లు ఇంటీరియర్‌లో రానున్నాయి.

విడుదల అంచనా: 2019 చివరి నాటికి

Most Read Articles

English summary
New Upcoming Maruti Cars In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X