వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్: విడుదల ఖరారు

వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లోకి తమ పోలో జీటీ ప్రీమియం మరియు స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్ కారును ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. కీలక అప్‌డేట్స్‌తో రానున్న వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్ కారు గురించి పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకుందాం రండి...

వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్: విడుదల ఖరారు

వోక్స్‌వ్యాగన్ ఇండియా గత కొన్ని రోజుల నుండి పోలో జీటీ వేరియంట్ ఆధారిత మోడల్‌కు ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిశోధనా విభాగానికి చెందిన అంతర్గత నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్: విడుదల ఖరారు

తాజాగా ఉన్న సమాచారం మేరకు, పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్ కారును మరో మూడు లేదా నాలుగు నెలల్లో దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం విపణిలో లభిస్తున్న మోడల్‌తో పోల్చుకుంటే సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ భారీ మార్పులు జరగనున్నాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్: విడుదల ఖరారు

2019 వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్‌లో కాస్మొటిక్ సొబగులతో పాటు, సాంకేతికంగా ఎన్నో మార్పులు సంతరించుకోనున్నాయి. ఎక్ట్సీరియర్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్ల జోడింపు గల ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ముందు మరియు వెనుక వైపున బంపర్లు వచ్చాయి. జీటీఐ మోడల్ నుండి సేకరించిన ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఇందులో వచ్చాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్: విడుదల ఖరారు

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఇంటీరియర్ విషయానికి పలు రకాల మార్పులు జరగనున్నాయి. ప్రత్యేకించి, ఖరీదైన లగ్జరీ మరియు స్పోర్టివ్ ఫీల్ కలిగిస్తుంది. బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల ఇంటీరియర్ ఎలిమెంట్లు అధికంగా రానున్నాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్: విడుదల ఖరారు

సరికొత్త వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్ కారులో సాంకేతికంగా 1.0-లీటర్ కెపాసిటీ గల మూడు సిలిండర్ల టుర్బో-పెట్రోల్ ఇంజన్ రానుంది. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న 1.2-లీటర్ టీసీఐ ఇంజన్ స్థానాన్ని భర్తీ చేయనుంది.

Most Read: ఒక్క ఆటోలో 24 మంది (వీడియో): తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన నెటిజన్లు

వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్: విడుదల ఖరారు

ఈ 1.0-లీటర్ ఇంజన్ బిఎస్-6 ఉద్గార నియమాలను కూడా పాటిస్తుంది. ఈ టుర్బో-పెట్రోల్ ఇంజన్ గురించిన పవర్ మరియు టార్క్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ఇది వరకే లభిస్తున్నటువంటి డీఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో దీనిని ఎంచుకోవచ్చు.

Most Read: రైల్వే ట్రాక్‌ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!

వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్: విడుదల ఖరారు

అయితే, పెట్రోల్ ఇంజన్‌కు జోడింపుగా పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్ కారులో 1.5-లీటర్ టీడీఐ ఇంజన్ కూడా లభించే అంశాన్ని వోక్స్‌వ్యాగన్ ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం పోలో జీటీ కారులో కూడా ఈ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!

వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్: విడుదల ఖరారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మరో నాలుగు నెలల్లోపు వోక్స్‌వ్యాగన్ ఇండియా తమ పోలో జీటీ ఫేస్‌లిఫ్ట్ కారును పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ సుమారుగా ఐదేళ్ల క్రితమే దేశీయంగా విడుదలైంది. అప్పటి నుండి వరకు ఫన్ హ్యాచ్‌బ్యాక్ కారును ఎంచుకోవాలనుకునే కస్టమర్లకు ఇదొక బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది. ఇదే మోడల్‌ను పలు రకాల అప్‌డేట్స్‌తో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయడం ద్వారా మార్కెట్ షేర్‌తో పాటుు సేల్స్ పెంచుకోనుంది.

Most Read Articles

English summary
New Volkswagen Polo GT Facelift Coming To India Within The Next 4 Months. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X