నెంబర్ ప్లేట్ లేదని 10 లక్షలు ఫైన్ వేస్తే.. 2 కోట్ల రూపాయల కారును వదిలేశాడు

వెండి రంగులో దగదగా మెరిసిపోతున్న ఈ కారు పోర్షే 911 స్పోర్ట్స్ కారు. దీని ధర కాస్త సుమారుగా రూ. 2.10 కోట్లుగా ఉంది. ఇంత ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసిన ఓనర్ దీనికి నంబర్ ప్లేట్ వేయించలేకపోయాడు. ఫలితంగా ఓనర్‌కు ఏకంగా రూ. 9.80 లక్షల జరిమానా విధించారు అహ్మదాబాద్ పోలీసులు.

నెంబర్ ప్లేట్ లేదని 10 లక్షలు ఫైన్ వేస్తే.. 2 కోట్ల రూపాయల కారును వదిలేశాడు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నవంబరు 27న ట్రాఫిక్ పోలీసులు నంబర్ ప్లేట్ లేకుండా వస్తున్న లగ్జరీ కారును గమనించారు. కారును ఆపి ఆ ఓనర్‌ను ఇన్సూరెన్స్ పత్రాలు చూపించమని అడిగారు.

నెంబర్ ప్లేట్ లేదని 10 లక్షలు ఫైన్ వేస్తే.. 2 కోట్ల రూపాయల కారును వదిలేశాడు

ఇన్సూరెన్స్‌తో పాటు ఆర్సీ, రోడ్ ట్యాక్స్, నంబర్ ప్లేట్ కారుకు సంభందించిన ఎలాంటి డాక్యుమెంట్స్ తన వద్ద లేవని సమాధానమిచ్చాడు. దీంతో కొత్త మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఓనర్ వద్ద లేని పత్రాలకు గాను ఏకంగా రూ. 9.80 లక్షలు ఫైన్ వేశారు.

నెంబర్ ప్లేట్ లేదని 10 లక్షలు ఫైన్ వేస్తే.. 2 కోట్ల రూపాయల కారును వదిలేశాడు

అప్పటికప్పుడు జరిమానా చెల్లిస్తే కారును తీసుకుపోవచ్చు. కానీ ఆ యాజమాని వద్ద అంత డబ్బులు లేకపోవడంతో ఆ కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అయితే, ట్రాఫిక్ పోలీసులు మాత్రం.. జరిమానా డబ్బులు ఆర్టీఓ ఆఫీసులో చెల్లించి దాని తాలుకు రశీదును చూపిస్తే కారు ఇస్తామని చెప్పి సీజ్ చేశారు.

నెంబర్ ప్లేట్ లేదని 10 లక్షలు ఫైన్ వేస్తే.. 2 కోట్ల రూపాయల కారును వదిలేశాడు

ఈ మొత్తం విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నంబర్ ప్లేట్ లేనటువంటి పోర్షే 911 క్యారెర్రా ఎస్ మోడల్ కారు ఫోటోలను కూడా ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు.

నెంబర్ ప్లేట్ లేదని 10 లక్షలు ఫైన్ వేస్తే.. 2 కోట్ల రూపాయల కారును వదిలేశాడు

కారు విషయానికి వస్తే.. ఫోటోలోని కారు మోడల్ పరిశీలిస్తే, ఇది పాత తరానికి చెందిన పోర్షే 911 క్యారెరా ఎస్ మోడల్. ఈ సూపర్ కారు యొక్క లేటెస్ట్ వెర్షన్ ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1.82 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

నెంబర్ ప్లేట్ లేదని 10 లక్షలు ఫైన్ వేస్తే.. 2 కోట్ల రూపాయల కారును వదిలేశాడు

పోర్షే 911 క్యారెరా ఎస్ కారులో సాంకేతికంగా 3.0-లీటర్ సామర్థ్యం గల ట్విన్-టుర్భోఛార్జ్‌డ్ ఫ్లాట్ 6-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 444బిహెచ్‌పి పవర్ మరియు 530ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

నెంబర్ ప్లేట్ లేదని 10 లక్షలు ఫైన్ వేస్తే.. 2 కోట్ల రూపాయల కారును వదిలేశాడు

పోర్షే క్యారెరా ఎస్ మోడల్ గరిష్టం వేగం గంటకు 307కిలోమీటర్లుగా ఉంది. 0 నుండి 100 కిమీల వేగాన్ని 3.7 సెకండ్లలో మరియు 200కిమీల వేగాన్ని కేవలం 12.4 సెకండ్ల వ్యవధిలోనే అందుకుంటుంది.

నెంబర్ ప్లేట్ లేదని 10 లక్షలు ఫైన్ వేస్తే.. 2 కోట్ల రూపాయల కారును వదిలేశాడు

పోర్షే 911 జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం పోర్షేకు చెందిన పాపులర్ మోడల్. లేటెస్ట్ వెర్షన్ పోర్షే 911 రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, క్యారెరా ఎస్ మరియు క్యారెరా క్యాబ్రియోలెట్. క్యాబ్రిలెట్ మోడల్ కన్వర్టిబుల్ (ఓపెన్ టాప్) వెర్షన్. దీని ధర సుమారుగా రూ. 2 కోట్ల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

నెంబర్ ప్లేట్ లేదని 10 లక్షలు ఫైన్ వేస్తే.. 2 కోట్ల రూపాయల కారును వదిలేశాడు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త మోటార్ వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రహదారి నియమాలను ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. అందుకు నిదర్శనం అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటన. కాబట్టి, సురక్షితమైన ప్రయాణం కోసం ట్రాఫిక్ నియమాలను పాటించండి మరియు భారీ జరిమానాలకు దూరంగా ఉండండి.

Most Read Articles

English summary
Porsche 911 Owner Fined Rs 9.8 Lakh By Ahmedabad Traffic Police: Here’s Why! Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X