Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పోర్షే కయీన్ కూపే విడుదల.. ధర రూ. 2 కోట్లు
దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం పోర్షే ఇండియన్ మార్కెట్లోకి మరో అత్యంత ఖరీదైన "పోర్షే కయీన్ కూపే" కారును లాంచ్ చేసింది. సరికొత్త పోర్షే కయీన్ కూపే ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.31 కోట్లు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 1.97 కోట్లు, ఎక్స్-షోరూమ్(ఇండియా).

పోర్షే గతంలో విడుదల చేసిన కయీన్ ఎస్యూవీ ఆధారంగా కయీన్ కూపే వెర్షన్ ప్రవేశపెట్టింది. చూడటానికి ఎస్యూవీ మాదిరిగానే ఉన్నప్పటికీ టాప్ వెనుక వైపున వాలుగా ఉన్న రూపాన్ని చూడవచ్చు. ఈ వాలు రూఫ్ టాప్‌తో పాటు కయీన్ కూపే రియర్ డిజైన్ మొత్తాన్ని పోర్షే మార్చేసింది.

పోర్షే కయీన్ కూపే కారును కంబ్లీట్లీ బిల్ట్ యూనిట్ (పూర్తి స్థాయిలో తయారైన కార్లు) తరహాలో ఇండియన్ మార్కెట్లోకి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. యూరోపియన్ వెర్షన్ కారునే ఇక్కడ విక్రయిస్తున్నారు. సరికొత్త పోర్షే కయీన్ కూపేలో అడాప్టివ్ రియర్ స్పాయిలర్, పానరమిక్ సన్‌రూఫ్, వెనుక వైపున వ్యక్తిగత సీట్లు, మరియు ఎన్నో సాంకేతిక ఫీచర్లున్నాయి.

పోర్షే కయీన్ కూపే ఎక్ట్సీరియర్‌లో వెనుక వైపున రూఫ్ ఫ్రంట్ రూఫ్ కంటే 20మిమీలు క్రిందకు ఉంటుంది, ఇందు కోసం ఫ్రంట్ A-పిల్లర్లను సన్నగా కాస్త వాలుగా డిజైన్ చేశారు. కూపే రియర్ డిజైన్‌ను పూర్తిగా మార్చేశారు. వెనుక డోర్లు, డిక్కీ డోరు మరియు రూఫ్ స్పాయిలర్ పూర్తిగా మారిపోయాయి.

పోర్షే కయీన్ కూలో సరికొత్త అడారప్టివ్ రియర్ స్పాయిలర్ అందించింది. పోర్షే బ్రాండ్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన పోర్షే ఆక్టివ్ ఏరోడైనమిక్స్ (PPA)లో భాగంగా తీసుకొచ్చారు. ఈ స్పాయిలర్ కారు 90కిమీల స్పీడులో ఉన్నపుడు కూడా 135మిమీల వరకు పొడగించబడుతుంది.

జర్మన్ దిగ్గజం పోర్షే కయీన్ కూపేలో అధునాతన కార్బన్-ఫైబర్ ప్యాకేజీని పరిచయం చేసింది. కూపే కారులోనే వివిధ రకాల భాగాల్లో కార్బన్-ఫైబర్ పార్ట్స్ అందివ్వడం జరిగింది, అందులో రూఫ్, సీట్లు, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో ఎన్నో ప్రదేశాల్లో ఈ ఫైబర్ పార్ట్స్ వచ్చాయి. దీనికి 22-ఇంచుల లైట్‌వెయిట్ జీటీ డిజైన్ అల్లాయ్ వీల్స్ జోడించారు.

పోర్షే కయీన్ కూపే ఇంటీరియర్ కూడా చూడటానికి అచ్చం కయీన్ ఎస్యూవీలానే ఉంది. అతి పెద్ద డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెట్రల్ కన్సోల్, ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియం లెథర్ సీట్లు మరియు డ్యాష్ బోర్డు మీద సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌తో పాటు మరెన్నో విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి.

పోర్షే కయీన్ కూపేలోని వెనుక వరుస సీట్ల ఎత్తును 30మిమీల తగ్గించింది. వెనుక సీట్లలో కూర్చునే వారి హెడ్ రూమ్ మరియు లెగ్ రూమ్ పెంచేందుకు ఇలా మార్పులు చేశారు. పోర్షే కయీన్ కూపే లగేజీ స్పేస్ 645-లీటర్లుగా ఉంది. వెనుక వరుస సీట్లను పూర్తిగా మడిపేస్తే లగేజీ స్పేస్‌ను 1,540-లీటర్లకు పెంచుకోవచ్చు.

సరికొత్త పోర్షే కయీన్ కూపే రెండు పెట్రోల్ ఇంజన్లతో లభిస్తోంది. అవి, V6 మరియు V8. వీటిలోని 3.0-లీటర్ V6 ఇంజన్ 335బిహెచ్పి పవర్ మరియు 450ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా V6 4.0-లీటర్ ట్విన్-టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 542బిహెచ్పి పవర్ మరియు 770ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్ వేరియంట్లను స్టాండర్డ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
జర్మన్ దిగ్గజం పోర్షే లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీకి ప్రత్యేకం. ఎస్‌యూవీల్లో లగ్జరీ కార్లను కోరుకునే కస్టమర్ల కోసం గతంలో కయీన్ ఎస్‌యూవీని తీసుకొచ్చిన పోర్షే దానికి కొనసాగింపుగా కయీన్ కూపే ఎస్‌యూవీని తీసుకొచ్చింది. ఇది మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఇ కూపే, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 మరియు ల్యాంబోర్ఘిని ఉరస్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.