Just In
Don't Miss
- Finance
డిసెంబర్ 31లోపు తప్పనిసరి: ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- News
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు
- Movies
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు.!
- Technology
గూగుల్ నుంచి ఎసెమ్మెస్ ఫీచర్, బిజినెస్ వ్యూహానికి పదును
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
మారుతి డిజైర్ లక్ష్యంగా రెనో నుండి కొత్త కాంపాక్ట్ సెడాన్
రెనో ప్యాసింజర్ కార్ల కంపెనీ ఇండియన్ మార్కెట్ కోసం సరికొత్త సబ్-4-మీటర్ కాంపాక్ట్ సెడాన్ కారును అభివృద్ది చేయాలని భావిస్తోంది. ఇండియాతో పాటు ఎన్నో అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ అధికంగా ఉన్న మరియు బెస్ట్ సేల్స్ సాధిస్తున్న కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి కొత్త మోడల్‌ను తీసుకొచ్చేందుకు రెనో సిద్దమవుతోంది.

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, ఇండియన్ మార్కెట్లో కాంపాక్ట్ సెడాన్ కార్లకు ఉన్న డిమాండ్ మరియు మార్కెట్ అవకాశాలను అధ్యయనం చేసేందుకు సిద్దమైనట్లు తెలిసింది. ఇండియన్ మార్కెట్ అవసరాలతో పాటు ఎగుమతులకు ఆస్కారం ఉండే పలు విదేశీ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని సరికొత్త సబ్-4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ కారును డెవలప్ చేయనున్నారు.

ఇండియన్ మార్కెట్లోకి పరిచయమై, భారీ విజయాన్ని అందుకున్న సబ్-4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ కారుకు ప్రధాన ఉదాహరణ.. మారుతి సుజుకి డిజైర్ కారు. ప్రత్యేకించి ఇండియన్ కస్టమర్ల కోసం అభివృద్ది చేసిన మారుతి డిజైర్ ఇండియాతో పాటు అమెరికా దేశాలు, దక్షిణాసియా మరియు ఆఫ్రికా దేశాలలో భారీ విజయాన్ని అందుకుంది. ఒక రకంంగా మారుతి డిజైర్ ఈ సెగ్మెంట్లో రారాజు అని చెప్పుకోవచ్చు.

రెనో ఇండియా తమ కాంపాక్ట్ సెడాన్ కారును 2021 నాటికి పరిచయం చేసే అవకాశం ఉంది. గతంలో రెనో కాంపాక్ట్ సెడాన్ కార్లను BO/MO ప్లాట్‌ఫామ్ మీద నిర్మించేది, అందులో "డాసియా లోగాన్" ఒకటి. అయితే, రెనో కొత్త కాంపాక్ట్ సెడాన్ కారును రెనో ట్రైబర్ ఎంపీవీని నిర్మించిన సరికొత్త CMF-A+ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా డెవలప్ చేయనుంది.

రెనో అతి త్వరలో తీసుకురానున్న HBS సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేశారు. రెనో క్విడ్ మరియు డాట్సన్ రెడి-గో కార్లను నిర్మించేందుకు వినియోగించిన CMF-A ఫ్లాట్‌ఫామ్‌కు కొనసాగింపుగా తీసుకొచ్చిన ఫ్లాట్‌ఫామ్ CMF-A+.

ట్రైబర్ ఎంపీవీని అభివృద్ది చేసిన ప్రాజెక్ట్ ద్వారా మార్కెట్ డిమాండ్, సేల్స్ మరియు నిర్వహణ వంటి అంశాల పరంగా రెనో ఇండియా ఎన్నో కొత్త మెళుకువలు నేర్చుకుంది. ఈ కొత్త మెళుకువల ద్వారా ప్రస్తుతం పశ్చిమ యూరోపియన్ మార్కెట్ కోసం డాసియా మోడళ్లను అభివృద్ది చేయడానికి మరియు ఇండియాలో కొత్త కార్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

2019 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 4.6 లక్షలకు పైగా కాంపాక్ట్ సెడాన్ కార్లు అమ్ముడయ్యి, ఈ సెగ్మెంట్ ఏకంగా 12 శాతం వృద్దిని నమోదు చేసింది. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకుని రెనో ఇండియా కొత్త కాంపాక్ట్ సెడాన్ అభివృద్ది చేయాలని చూస్తోంది.

ఇండియన్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో కస్టమర్లకు ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.. అందులో మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, ఫోర్డ్ ఆస్పైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, టాటా టిగోర్, టాటా ఇటియోస్ మరియు వోక్స్‌వ్యాగన్ అమియో. ఏదేమైనప్పటికీ సెగ్మెంట్లో సక్సెస్ సాధించాలంటే మారుతి డిజైర్ మరియు హోండా అమేజ్ కార్లకు గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
కాంపాక్ట్ ఎస్‌యూవీ తరువాత మార్కెట్లోకి మంచి డిమాండ్ ఉన్న సెగ్మెంట్ కాంపాక్ట్ సెడాన్. ఈ సెగ్మెంట్ కార్లను అద్దె కార్ల నిర్వహణ కంపెనీలు (ఉబర్ మరియు ఓలా) ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. దీనికి తోడు సొంత కారును ఎంచుకునే ఫ్యామిలీ టైప్ కస్టమర్లు కూడా కాంపాక్ట్ సెడాన్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్లో ఈ సెగ్మెంట్‌కు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. డిజైర్ కారును ఢీకొట్టే మోడల్ తీసుకొస్తే.. రెనో సక్సెస్ స్టోరీలో ఇదీ ఒక భాగమవుతుంది.