విడుదల నేపథ్యంలో రోడ్డెక్కిన రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్: ఫోటోలు

రెనో ఇండియా బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా 2020 క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కారును అతి త్వరలో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో బిఎస్-6 రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను పూనే రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తోంది. తాజాగా లీక్ అయిన ఫోటోలు మరియు వీడియోలను గమనిస్తే, ఇది క్లింబర్ వేరియంట్ హ్యాచ్‌బ్యాక్ కారును తెలుస్తోంది.

విడుదల నేపథ్యంలో రోడ్డెక్కిన రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్: ఫోటోలు

రెనో రహస్యంగా పరీక్షిస్తున్న 2020 రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ ఫోటోలను పరిశీలిస్తే, కారులోని సరికొత్త బిఎస్-6 ఇంజన్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇది రెనో క్లింబర్ కారని తెలిసింది, ఇందులో ఉన్న 14-అంగుళాల వీల్స్ ఇందుకు నిదర్శనం.

విడుదల నేపథ్యంలో రోడ్డెక్కిన రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్: ఫోటోలు

2020 రెనో క్విడ్ కారును టెస్ట్ చేస్తున్న తీసిన ఫోటోలలో కారుకు వెనుక వైపున ఉద్గారాలను పరీక్షించే ఎమిషన్ టెస్టింగ్ మెషీన్‌ను చూడవచ్చు. కార్ల తయారీ సంస్థలు తమ కార్లు ఎంత మేరకు ఉద్గారాలను వెదజల్లుతున్నాయో అని తెలుసుకునేందుకు ఇలా టెస్టింగ్స్ నిర్వహిస్తాయి.

విడుదల నేపథ్యంలో రోడ్డెక్కిన రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్: ఫోటోలు

తాజాగా బయటికొచ్చిన వీడియో చూస్తే, 2020 రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కారులో బిఎస్-6 ప్రమాణాలను పాటించే 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. బిఎస్-4 వెర్షన్ అయితే 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, అయితే లేటెస్ట్ బిఎస్-6 ఇంజన్ పవర్ అవుట్‌పుట్‌కు సంభందించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

విడుదల నేపథ్యంలో రోడ్డెక్కిన రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్: ఫోటోలు

2020 రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కారులో రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా, సరికొత్త ఫ్రంట్ బంపర్, నూతన హెడ్ ల్యాంప్ సెటప్ మరియు ఎల్ఈడీ లైటింగ్ సెటప్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

విడుదల నేపథ్యంలో రోడ్డెక్కిన రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్: ఫోటోలు

రెనో ఇండియా తమ 2020 క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కారును వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరగబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో దీనిని అధికారికంగా ఆవిష్కరించే ఛాన్స్ ఉంది.

విడుదల నేపథ్యంలో రోడ్డెక్కిన రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్: ఫోటోలు

ప్రస్తుతం రెనో క్విడ్ 12 విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అన్ని వేరియంట్లలో పెట్రోల్ ఇంజన్‌లు ఉన్నాయి. రెనో క్విడ్‌ను ప్రస్తుతం 799సీసీ లేదా 1.0-లీటర్ ఇంజన్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు.

ప్రస్తుత తరానికి చెందిన రెనో క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ధరల శ్రేణి రూ. 2.83 లక్షల నుండి రూ. 4.92 లక్షలుగా ఉంది. అయితే అతి త్వరలో విడుదలయ్యే 2020 రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ సుమారుగా రూ. 3.25 లక్షల నుండి రూ. 5.55 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.

విడుదల నేపథ్యంలో రోడ్డెక్కిన రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్: ఫోటోలు

పరీక్షిస్తూ రహస్యంగా పట్టుబడిన 2020 రెనో క్విడ్ ఫోటోలలో డిజైన్‌కు సంభందించిన వివరాలు పూర్తిగా రివీల్ కాలేదు. కానీ, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇండియన్ మార్కెట్‌తో పాటు పలు విదేశీ మార్కెట్లోకి రెనో క్విడ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ మంచి సేల్స్ సాధించింది.

Source: Area of Interest

Most Read Articles

English summary
Renault Kwid Facelift BS-VI Spotted Testing Ahead Of India Launch: Spy Pics & Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X