డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో

భారతదేశపు మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ డస్టర్ మీద రెనో కంపెనీ ఏకంగా రూ. 1.50 లక్షలు తగ్గింపు ప్రకటించింది. ఈ ఏడాది జూలైలో విడుదలైన డస్టర్ ఫేస్‌లిఫ్ట్ మీద భారీగా ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించింది.

డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో

రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్ డీజల్ RxS 110hp మిడ్ వేరియంట్ ఇప్పుడు రూ. 9.99 లక్షల ధరకే లభ్యమవుతోంది. దీని మీద సుమారుగా రూ. 1.2 లక్షలు ధర తగ్గింది. అంటే 85ps పవర్‌తో లభించే డస్టర్ కంటే 110ps పవర్‌‌నిచ్చే వేరియంట్ ధరే తక్కువగా ఉంది.

డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో

రెనో ఇండియా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేసిన డస్టర్ ఎస్‌యూవీ రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అయితే, అతి త్వరలో అమల్లోకి రానున్న బిఎస్-6 ప్రమాణాలను పాటించనటువంటి అన్ని డీజల్ ఇంజన్‌లకు కార్ల కంపెనీలు గుడ్‌బై చెప్పేస్తున్నాయి.

డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో

రెనో ఇండియా తమ 1.5-లీటర్ K9K డీజల్ ఇంజన్‌ను పరీక్షించి ప్రయత్నించి బిఎస్-6 ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైంది. దీనికి తోడు ఈ వేరియంట్ సేల్స్ తక్కువగా ఉండటంతో దీని అభివృద్ది మీద అయ్యే ఖర్చును భారంగా భావిస్తూ ఈ ఇంజన్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది.

డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో

ఏప్రిల్ 01, 2020 తర్వాత రెనో డస్టర్ కేవలం సింగల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభించనుంది. 1.5-లీటర్ బిఎస్-6 పెట్రోల్ ఇంజన్‌ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో

ధృడమైన పనితీరు మరియు కఠినమైన స్వభావానికి రెనో డస్టర్ పెట్టింది పేరు, ఇందుకు ప్రధాన కారణం ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్. మరి డీజల్ ఇంజన్ లేని లోటును పెట్రోల్ ఇంజన్ తీరుస్తుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడక తప్పుదు. రెనో డస్టర్ సేల్స్ కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. రెనో తాజాగా ప్రకటించిన ఆఫర్లతో అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది.

డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో

రెనో తమ డస్టర్ మీద ఏకంగా లక్షన్నర రూపాయల మేర ధర తగ్గించడంతో ఇప్పుడు ధరకు తగ్గ విలువలున్న మోడల్‌గా చెప్పవచ్చు. టాటా నెక్సాన్ (7.59-10.39 లక్షలు), మహీంద్రా ఎక్స్‌యూవీ300 (8.69-12.14 లక్షలు), ఫోర్డ్ ఇకోస్పోర్ట్ (8.31-11.35 లక్షలు), మారుతి బ్రిజా (రూ. 7.62-10.03 లక్షలు) మరియు హ్యుందాయ్ వెన్యూ (రూ. 7.75-10.84 లక్షల) ధరలో శ్రేణిలో లభ్యమవుతున్నాయి.

డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో

చాలా మంది డీలర్ల వద్ద రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కంటే పాత మోడళ్ల ఇప్పటికీ స్టాక్ ఉన్నాయి. వీటి మీద కూడా రూ. 1.25 లక్షల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. కస్టమర్లు ఇప్పుడు రెనో డస్టర్ RxS AMT డీజల్ మిడ్ వేరియంట్‌ను రూ. 9.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఎంచుకోవచ్చు.

డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

10 లక్షల బడ్జెట్ రేంజ్‌లో శక్తివంతమైన మరియు గుడ్ లుకింగ్ ఎస్‌యూవీ కోరుకునే కస్టమర్లకు బెస్ట్ ఛాయిస్ రెనో డస్టర్ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఫీచర్లు మరియు ధరల రేసులో పడి కస్టమర్లు కొత్తగా వచ్చిన మోడళ్ల వైపు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ డస్టర్ మీద భారీగా ధర తగ్గించడంతో సేల్స్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఎస్‌యూవీ కొనే ఆలోచనలో ఉంటే రెనో డస్టర్ అత్యుత్తమ ఎంపిక అనేది మా అభిప్రాయం.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Offering Upto Rs 1.50 Lakh Discount On Duster. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X