హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

ఫ్రెంచ్‌ ఫ్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో ఇండియన్ మార్కెట్లో క్విడ్ మోడల్ తరహాలో మరో భారీ విజయాన్ని సాధించింది. సరిగ్గా విడుదలైన 15 రోజుల్లోనే అద్భుతమైన ఊహించని ఫలితాన్ని కనబరిచింది. గత మూడేళ్లుగా రెనో ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న రెనో క్విడ్ కారును సేల్స్ పరంగా వెనక్కి నెట్టేసింది.

అవును మీరు చదివింది నిజమే.. రెనో క్విడ్ కంటే అత్యుత్తమ ఫలితాలు కనబరించింది. కేవలం 5 లక్షల ధరతోనే విడుదైన 7-సీటర్ ఎంపీవీ ఎందుకు సక్సెస్ అయ్యిందో చూద్దాం రండి...

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

రెనో క్విడ్ కంటే అత్యధికంగా అమ్ముడై బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిన ట్రైబర్ కారు కంపెనీ యొక్క చీపెస్ట్ ఎంపీవీ. తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, 2090 యూనిట్ల క్విడ్ కార్లను కస్టమర్లకు డెలివరీ ఇవ్వగా.. ఇదే సమయంలో 2,490 ట్రైబర్ కార్లను విక్రయించారు. క్విడ్ కంటే దాదాపు 400 యూనిట్లు అధికం.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

రెనో ఇండియా ట్రైబర్ ఎంపీవీ కారును ఆగష్టు 28, 2019 న మార్కెట్లోకి రిలీజ్ చేసింది. 7 మంది వరకు ప్రయాణించే ఎంపీవీ కారును ఏ సాధారణ హ్యాచ్‌బ్యాక్ కంటే తక్కువ ధరలో పరిచయం చేయడమే రెనో ట్రైబర్ విజయానికి కారణం అని చెప్పవచ్చు. అంతే కాదండోయ్ ఇండియాలో ప్రస్తుతం అత్యంత సరసమైన ధరతో లభించే చీపెస్ట్ ఎంపీవీ మోడల్ కూడా ఇదే.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

రెనో ఇండియా విభాగం దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ఆశించిన స్థాయిలో సేల్స్ సాధించలేకపోయింది. 2011 ఏడాదిలో "ఫ్లూయెన్స్" అనే సెడాన్ కారుతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. 2012 వరకు తీవ్రంగా నష్టపోయిన రెనో.. డస్టర్ ఎస్‌యూవీ విడుదలతో ఒక్కసారిగా పుంజుకుంది.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

డస్టర్ రాకతో రెనో సేల్స్ అమాంతం పెరిగిపోయాయి.. అనతి కాలంలోనే భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ కార్ల కంపెనీల జాబితాలో చోటు సంపాదించింది. నిజానికి ఇండియన్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను ప్రారంభించింది కూడా రెనో కంపెనీనే. అయితే సుమారు ఏడేళ్ల కాలంలో ఎన్నో కాంపాక్ట్ ఎస్‌యూవీలు విడుదలతో తీవ్ర పోటీ కారణంగా డస్టర్ సేల్స్ తగ్గముఖం పడుతూ వచ్చాయి.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

అయితే రెనో ఇండియా దశ తిరిగే మోడల్ సరికొత్త క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కారును 2015లో లాంచ్ చేసింది. రెనో క్విడ్ కారు విడుదలైనప్పటి నుండి మార్కెట్లో ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. సేల్స్ పరంగా స్మాల్ హ్యాచ్‍బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న ఎన్నో మోడళ్లకు గట్టి పోటీనిచ్చింది. సుమారుగా మూడేళ్ల పాటు రెనో "ఇండియా బెస్ట్-సెల్లింగ్-కారు" టైటిల్‌ సొంతం చేసుకుంది. అయితే.. రెండు వారాల క్రితం విడుదలైన రెనో ట్రైబర్ కారు పరిస్థితిని తారుమారు చేసింది. నేడు కంపెనీ యొక్క టాప్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. క్విడ్ కంటే ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ ఈ భారీ సక్సెస్ వెనక 3 ప్రధాన కారణాలున్నాయి.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

మొదటి కారణం:

ఆటోమొబైల్ పరిశ్రమలో మాంద్యం నెలకొనడం. దాదాపు అన్ని వాహన తయారీ సంస్థల విక్రయాలు దారుణంగా పడిపోయాయి మరియు టర్నోవర్ కూడా భారీగా తగ్గిపోయింది. కొన్ని సంస్థలైతే తయారీ ప్లాంట్లను తాత్కాలికంగా మూసేశారు. మరికొన్ని సంస్థలు ఉద్యోగులను తొలిగించాయి. ఈ నేపథ్యంలో రెనో క్విడ్ సేల్స్ కూడా దారుణంగా తగ్గిపోయాయి.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

రెండో కారణం:

రెనో క్విడ్ విడుదలయ్యి ఇప్పటికి మూడేళ్లయ్యింది. ఈ మధ్య కాలంలో ఎన్నో కొత్త మోడళ్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి.. దాంతో రెనో క్విడ్ కాస్త పాతదయ్యింది. చాన్నాళ్ల క్రితం కొన్ని ఫీచర్లను అప్‌డేట్ చేసి రీలాంచ్ చేసింది. అంతే కాకుండా త్వరలో మరిన్ని క్విడ్ ఆధారిత ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను లాంచే చేయాలని భావిస్తోంది. అయినా కూడా క్విడ్ బ్రాండ్ పేరు కాత పాతబడింది.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

మూడో కారణం:

రెనో ట్రైబర్ క్విడ్ సేల్స్ తినేయడం. రెనో ట్రైబర్ 7-సీటర్ ఎంపీవీ కారు ధరల శ్రేణి రూ. 4.95 లక్షల నుండి రూ. 6.49 లక్షల మధ్య ఉంది. క్విడ్ ధరల శ్రేణి రూ. 2.76 లక్షల నుండి రూ. 4.76 లక్షల మధ్య ఉంది. క్విడ్ కొనాలనుకునే కస్టమర్లు ఇంకో రెండు లక్షలు చెల్లిస్తే 7-మంది ప్రయాణించే ట్రైబర్ కారు సొంతం చేసుకోవచ్చు అనే ఆలోచనతో రెనో బ్రాండ్‌లోనే అంతర్గతంగా పోటీ నెలకొంది.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

క్విడ్ మరియు ట్రైబర్ కార్ల ధరల మధ్య తేడా ఎక్కువగానే ఉన్నప్పటికీ ఫీచర్లు మరియు పరికరాల పరంగా రెనో ట్రైబర్ బెస్ట్ అని నిరూపించుకుంది. క్విడ్ కారును నిర్మించిన అదే CMF-A ఫ్లాట్‌ఫామ్ మీద ట్రైబర్ కారును అభివృద్ది చేశారు. కానీ నాలుగు మీటర్ల పొడవులోపే 7-మంది వరకు ప్రయాణించే అవకాశం కూడా ట్రైబర్ ఎంపీవీకి బాగా కలిసొచ్చింది.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

రెనో ట్రైబర్ డిజైన్ కూడా మార్కెట్లో ప్రీమియం కారు అనే ఫీలింగ్ తీసుకొచ్చింది. ఎంపీవీ సెగ్మెంట్లో కూడా ఇతర మోడళ్లకు ధీటైన పోటీనిస్తోంది. ముందువైపున ఆకర్షణీయమైన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ ఫినిషింగ్స్ గల విశాలమైన ఫ్రంట్ గ్రిల్, బంపర్‌లో డే టైం రన్నింగ్ ల్యాంప్స్, బంపర్ క్రింది వైపున సిల్వర్ ఫినిషింగ్ గల స్కఫ్ ప్లేట్ వంటివి స్టైలిష్ ఫీచర్లు ఉన్నాయి.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్ (బాడీ అంచుల వద్దనున్న పట్టీ), కారుకు ఇరువైపులా అంచుల వద్ద బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపున డిజైన్ ఎంతో సింపుల్‌గా ఉంది. మృదువైన టెయిల్ ల్యాంప్, సిల్వర్ ఫినిషింగ్ గల స్కఫ్ ప్లేట్లు మరియు రెనో ట్రైబర్ బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

రెనో ట్రైబర్ ఇంటీరియర్ విషయానికి వస్తే అత్యంత అట్రాక్టివ్‌గా లగ్జరీ లుక్‌‌లో ఉంది. దీనికి డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్ లేఔట్ మరో ప్రత్యేక హైలెట్‌గా చెప్పుకోవచ్చు. డ్యాష్‌బోర్డులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 8.0-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది. రెండవ మరియు మూడవ వరుస సీట్లకు ఏసీ వెంట్స్ ఉన్నాయి.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

రెనో ట్రైబర్ ఎంపీవీ కారులో అత్యంత సౌకర్యవంతమైన సీటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి మరియు ఇందులో 2,4,5,6 లేదా 7 మంది వరకు ప్రయాణించవచ్చు. రెండు మరియు మూడవ వరుస సీట్లను మడుపుకోవచ్చు లేదా పూర్తిగా తొలగించవచ్చు కూడా.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

ఇంజన్ విషయానికి వస్తే, రెనో ట్రైబర్ కారులో 1.0-లీటర్ 3-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 70బిహెచ్‌పి పవర్ మరియు 96ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2020 నాటికల్లా ట్రైబర్ కారును ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్‌తో కూడా లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న రెనో ట్రైబర్ కారు: ఎందుకంత డిమాండ్?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెనో ట్రైబర్ కారును ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే ఫ్రెంచ్ దిగ్గజం మరో సక్సెస్ స్టోరీని స్టార్ట్ చేసింది. డస్టర్ ఎస్‌యూవీతో మొదలు పెట్టి, క్విడ్ మరియు ట్రైబర్ కార్లతో ఇండియన్ మార్కెట్లో రెనో సంస్థ తనదైన ముద్ర వేసుకుంది. అన్ని రకాల వర్గాలకు అందుబాటులో అన్ని రకాల ధరల శ్రేణిలో అత్యంత విజయవంతమైన మోడళ్లను ప్రవేశపెట్టింది. ట్రైబర్ మరియు క్విడ్ కార్లు మంచి సక్సెస్ సాధించడంతో వీటిని ఆధారంగా చేసుకొన్ని మరిన్ని మోడళ్లను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Triber Overtakes Renault Kwid In Sales Numbers & Becomes Renault’s Bestseller. Read in Telugu.
Story first published: Saturday, September 21, 2019, 18:55 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X