ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో

ఎంట్రీలెవల్ మల్టీ పర్పస్ వెహికల్ (MPV) సెగ్మెంట్లో భారీ సక్సెస్ సాధించిన రెనో ట్రైబర్ ఎంపీవీ కారు ప్రస్తుతానికి సింగల్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభ్యమవుతోంది. అయితే రెనో వీలైనంత త్వరలో తమ ట్రైబర్ కారులో శక్తివంతమైన టర్భో పెట్రోల్ ఇంజన్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో

ఈ ఏడాది ఆగష్టు 28న ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన రెనో ట్రైబర్ కారు కేవలం 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభ్యమవుతోంది. ఎక్కువ పవర్ ఇచ్చే పర్ఫామెన్స్ ఇంజన్ కోసం కస్టమర్లు ఎక్కువగా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల కోరిక మేరకు, రెనో సరికొత్త ఇంజన్‌ను తీసుకొస్తోంది.

ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో

2020 మార్చి తర్వాత ట్రైబర్ ఎంపీవీ కారులో పరిచయం చేయనున్న ఈ టర్భో పెట్రోల్ ఇంజన్‌ను రెనో ఇండియా భవిష్యత్తులో తీసుకొచ్చే కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా అందివ్వనున్నట్లు తెలిసింది.

ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెనో ట్రైబర్ కారులో 1.0-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు, 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ 71బిహెచ్‌పి పవర్ మరియు 96ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో

రెనో ట్రైబర్ ఎంపీవీ ప్రారంభ ధర రూ. 4.95 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 6.49 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుుకునేలా అత్యంత సరసమైన ధరలో 4-మీటర్ల పొడువుతోనే 7-మంది ప్రయాణించే సౌలభ్యంతో దీనిని నిర్మించారు.

ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో

సరిగ్గా మూడు నెలల క్రితం మార్కెట్లోకి విడుదలైన రెనో ట్రైబర్ భారీ విజయాన్ని అందుకొంది. అంతకు ముందు వరకు రెనో బెస్ట్ సెల్లింగ్ కారుగా క్విడ్ మొదటి స్థానంలో ఉండేది, కానీ ట్రైబర్ రాకతో క్విడ్ రెండో స్థానానికి పరిమితమైపోయింది. క్విడ్ కంటే తక్కువ ధరలో 7-మంది ప్రయాణించే కారు ఉండటంతో కస్టమర్లంతా రెనో ట్రైబర్‌కే మొగ్గు చూపుతున్నారు.

ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో

సరికొత్త రెనో ట్రైబర్ ఎంపీవీలో ఎన్నో అత్యాధునిక ఫీచర్లున్నాయి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, పవర్ విండో, కీ లెస్ ఎంట్రీ, మూడు వరుసలకూ ఏసీ వెంట్స్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సాకెట్ మరియు రియర్ వాష్ వైపర్ వంటి ఎన్నో ప్రీమియం ఫీచర్లు వచ్చాయి.

Read More:ఇండియన్ ఎఫ్‌టిఆర్ 1200 ఆధారిత అడ్వెంచర్ టూరర్ ఇక వచ్చే ఏడాదికి

ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో

రెనో ట్రైబర్ లోపలి వైపున డ్యూయల్-టోన్ ఇంటీరియర్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. డాష్ బోర్డు మీద సిల్వర్ ట్రిమ్ డిజైన్ ఎలిమెంట్స్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 2.5-అంగుళాల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ల్పే మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే 8-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

Read Moreహోండా సిటీ బిఎస్6 వెర్షన్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు!

ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో

15-అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, మ్యాట్ బ్లాక్ క్లాడింగ్, వీల్ ఆర్చెస్ మరియు ఆకర్షణీయమైన టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌తో పాటు రెనో ట్రైబర్ ఐదు విభిన్న రంగుల్లో లభిస్తోంది అవి, ఐస్ కూల్ వైట్, మూన్ లైట్ సిల్వర్, ఎలక్ట్రిక్ బ్లూ, ఫైరీ రెడ్ మరియు ఆరేంజ్.

Read More:గురుగ్రామ్ పోలీస్ స్క్వాడ్‌లో 10 సుజుకి జిక్సెర్ ఎస్ఎఫ్ 250 మోటార్‌సైకిల్స్

ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో

సేఫ్టీ పరంగా రెనో ట్రైబర్ ఎంపీవీ కారులో నాలుగు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ వార్నింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరిగా వచ్చాయి.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Triber to get more powerful: Same engine to be used in the upcoming Compact SUV-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X