విపణిలోకి స్కోడా కరోక్ ఎస్‌యూవీ.. విడుదల ఎప్పుడంటే?

స్కోడా ఆటో ఇండియా విభాగం దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీని అతి త్వరలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2020 నాటి కల్లా ఇండియన్ మార్కెట్లో విక్రయాలకు సిద్దంగా రిలీజ్ చేయనున్నట్లు స్కోడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్ మరియు మార్కెటింగ్ డైరక్టర్ జాక్ హోలిస్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

విపణిలోకి స్కోడా కరోక్ ఎస్‌యూవీ.. విడుదల ఎప్పుడంటే?

సరికొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీని తొలుత పూర్తి స్థాయిలో తయారైన మోడల్‌గా కంప్లిట్లీ బిల్ట్ యూనిట్ (CBU) తరహాలో దిగుమతి చేసుకుని ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తామని తెలిపారు. స్కోడా కరోక్ విడుదలప్పుడు ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తున్నట్లు జాక్ హోలిస్ పేర్కొన్నారు.

విపణిలోకి స్కోడా కరోక్ ఎస్‌యూవీ.. విడుదల ఎప్పుడంటే?

ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇప్పటికే ఎన్నో కార్ల కంపెనీలు అందిస్తున్న ఎస్‌యూవీల తరహాలేనే కండలు తిరిగిన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో రానుంది. స్కోడా కరోక్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే అతి పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆల్ బ్లాక్ లేదా బ్లాక్/బీజీ కలర్ క్యాబిన్ ఆప్షన్లతో లెథర్ సీట్లు ఉన్నాయి.

విపణిలోకి స్కోడా కరోక్ ఎస్‌యూవీ.. విడుదల ఎప్పుడంటే?

స్కోడా కరోక్ ఎస్‌యూవీలో రాబోయే ఇంజన్ మరియు మరే ఇతర సాంకేతిక వివరాలను వెల్లడించలేదు. అయితే ఇది 113బిహెచ్‌పి పవర్ మరియు 175ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.0-లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్ అదే విధంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్‌నిచ్చే 1.5-లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది.

విపణిలోకి స్కోడా కరోక్ ఎస్‌యూవీ.. విడుదల ఎప్పుడంటే?

ప్రస్తుతానికి స్కోడా కరోక్ ఇంజన్ గురించి కంపెనీ కూడా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. వీలైనంత వరకు కరోక్ అన్ని వేరియంట్లు పెట్రోల్ ఇంజన్‌లలో మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఉన్న వివిధ మార్కెట్లు, వాటి డిమాండును బట్టి భవిష్యత్తులో డీజల్ ఇంజన్ కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

విపణిలోకి స్కోడా కరోక్ ఎస్‌యూవీ.. విడుదల ఎప్పుడంటే?

స్కోడా కరోక్ ఎస్‌యూవీని కంపెనీకి చెందిన ఎమ్‌క్యూబీ (MQB) ఫ్లాట్ మీద నిర్మించారు. స్కోడా కరోక్ విడుదలైతే విపణిలో ఉన్న ఎంజీ హెక్టార్, జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ టుసాన్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

విపణిలోకి స్కోడా కరోక్ ఎస్‌యూవీ.. విడుదల ఎప్పుడంటే?

స్కోడా ఇండియా ఈ కరోక్ ఎస్‌యూవీని ఢిల్లీలో జరగబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనుంది. దీనితో పాటు సరికొత్త ఆక్టావియా ఆర్ఎస్ 245 మోడల్‌ను కూడా ఆవిష్కరిస్తున్నారు. స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245 కారును దేశీయంగా కేవలం 200 యూనిట్ల మాత్రమే విక్రయిస్తారు. వీటి బుకింగ్స్ కూడా ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ప్రారంభం అవుతాయి.

విపణిలోకి స్కోడా కరోక్ ఎస్‌యూవీ.. విడుదల ఎప్పుడంటే?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకు స్కోడా ఆటో ఇండియా తీవ్రంగానే శ్రమిస్తోంది. వీలైనంత వరకు అధిక సేల్స్ సాధించే మోడళ్ల మీద స్కోడా దృష్టి సారిస్తోంది. అందులో భాగంగానే స్కోడా కరోక్ ఎస్‌యూవీని సిద్దం చేస్తున్నారు. అత్యధిక ఇంటీరియర్ ఫీచర్లతో సరసమైన ధరలో విడుదల చేస్తే స్కోడా పంట పండటం ఖాయం.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda Karoq India Launch Confirmed For April 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X