స్కోడా ఆక్టావియా ఒనిక్స్ విడుదల: ప్రత్యేకతలేంటి?

స్కోడా కంపెనీ దేశీయ విపణిలోకి సరికొత్త ఆక్టావియా ఒనిక్స్ (Octavia Onyx) సెడాన్ కారును రిలీజ్ చేసింది. సరికొత్త స్కోడా ఆక్టావియా ఒనిక్స్ సెడాన్ రెండు విభిన్న వేరియంట్లలో విడుదలయ్యింది. మరియు దీని ప్రారంభ ధర రూ. 19.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు.

స్కోడా ఆక్టావియా ఒనిక్స్ విడుదల: ప్రత్యేకతలేంటి?

సరికొత్త ఆక్టావియా ఒనిక్స్ సెడాన్ కారు ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో ఎన్నో రకాల కాస్మొటిక్ అప్‌డేట్స్ జరిగాయి. స్కోడా ఆక్టావియా ఒనిక్స్ సెడాన్ మీద బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, అతి త్వరలో డెలివరీ ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఆక్టావియా ఒనిక్స్ సెడాన్ రెండో వేరియంట్ ధర రూ. 22 లక్షలుగా ఖరారు చేశారు.

రెండు వేరియంట్లలో కూడా అత్యద్భుతమైన కాస్మొటిక్ మార్పులు చోటు చేసుకున్నాయి. క్రోమ్ ఫినిషింగ్ గల అప్‌డేటెడ్ బటర్‌ఫ్లై ఫ్రంట్ గ్రిల్, క్రిస్టల్ గ్లో ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్ గల అప్డేటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్, టర్న్ ఇండికేటర్లున్న సైడ్ మిర్రర్లు, వెనుక వైపు డిక్కీ మీద ఉన్న గ్లోజీ-బ్లాక్ కలర్ రియర్ స్పాయిలర్, కార్బన్ బ్లాక్ డోర్ పట్టీలు మరియు సరికొత్తగా డిజైన్ చేయబడిన 16-అంగుళాల ప్రీమియా అల్లాయ్ వీల్స్ వంటివి వచ్చాయి.

స్కోడా ఆక్టావియా ఒనిక్స్ విడుదల: ప్రత్యేకతలేంటి?

స్కోడా ఆక్టావియా ఒనిక్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఎన్నో చోట్ల ఆక్టావియా లోగో గల అల్యూమినియం స్కఫ్ ప్లేట్లు దర్శనమిస్తాయి. స్మార్ట్ లింక్ టెక్నాలజీ, మిర్రర్ లింక్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 8.0-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ సిస్టమ్ ప్రధాన హైలెట్‌గా చెప్పుకోవచ్చు. వీటితో పాటు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12-దిశలలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీటు, ప్రీమియం బ్లాక్-లెథర్ అప్‌హోల్‌స్ట్రే మరియు ఫ్లాట్-బాట్ స్టీరింగ్ వీల్ కలదు.

స్కోడా ఆక్టావియా ఒనిక్స్ విడుదల: ప్రత్యేకతలేంటి?

స్కోడా ఆక్టావియా ఒనిక్స్ సెడాన్ కారులో సేఫ్టీకి కూడా పెద్దపీఠ వేశారు. రెండు వేరియంట్లలో కూడా ఆరు ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, హైస్పీడ్ వార్నింగ్, సీట్ బెల్ట్ రిమైండర్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్-బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

స్కోడా ఆక్టావియా ఒనిక్స్ విడుదల: ప్రత్యేకతలేంటి?

సరికొత్త స్కోడా ఆక్టావియా ఒనిక్స్ కారులో 590-లీటర్ల స్టోరేజీ సామర్థ్యం కలదు,వెనుక సీట్లను 60:40 నిష్పత్తిలో చుట్టేయగలిగితే లగేజీ స్పేస్ సామర్థ్యాన్ని 1580-లీటర్లకు పెంచుకోవచ్చు.

స్కోడా ఆక్టావియా ఒనిక్స్ విడుదల: ప్రత్యేకతలేంటి?

సాంకేతికంగా స్కోడా ఆక్టావియా ఒనిక్స్ సెడాన్‌లో 1.8-లీటర్ కెపాసిటీ గల టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 180బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఈ కారు 2.0-లీటర్ టీడీఐ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభ్యమవుతోంది. ఇది సుమారు 143బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లు కూడా కేవలం 7-స్పీడ్ డీఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమవుతున్నాయి. మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేకపోవడం గమనార్హం.

సరికొత్త స్కోడా ఆక్టావియా లగ్జరీ సెడాన్ మూడు విభిన్న కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అవి, క్యాండీ వైట్, రేస్ బ్లూ మరియు కొరిడా రెడ్.

స్కోడా ఆక్టావియా ఒనిక్స్ విడుదల: ప్రత్యేకతలేంటి?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్కోడా ఆక్టావియా ఒనిక్స్ సెడాన్ స్టాండర్డ్ వెర్షన్‌తో పోల్చుకుంటే ఎన్నో అత్యాధునిక ఫీచర్లు మరియు అప్‌డేట్స్‌తో వచ్చింది. కొత్త రకం స్పోర్టివ్ ఫీలింగ్ కల్పించింది. ఇప్పట్లో మార్కెట్లో స్పోర్టివ్ సెడాన్‌గా స్కోడా ఆక్టావియా రాణిస్తోంది. ఏదేమైనప్పటికీ స్కోడా ఆక్టావియా ఒనిక్స్ మోడల్ విపణిలో ఉన్న టయోటా కరోలా ఆల్టిస్ మరియు హోండా సివిక్ మోడళ్లకు సరాసరి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Skoda Octavia Onyx Launched In India: Prices Start At Rs 20 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X