భారత మార్కెట్లో కొత్త స్కోడా ర్యాపిడ్ రైడర్ విడుదల

చాలా రోజుల తరువాత స్కోడా మార్కెట్లోకి కొత్త సెడాన్ ను విడుదల చేసింది. దీనిని ర్యాపిడ్ రైడర్ అనే పేరుతో లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ గా భారత మార్కెట్లో విడుదల చేసింది, మరి దీని గురించి వివరంగా తెలుసుకొందాం రండి..

భారత మార్కెట్లో కొత్త స్కోడా ర్యాపిడ్ రైడర్ విడుదల

స్కోడా ఇండియా తన ర్యాపిడ్ సెడాన్ లో లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ లో స్పోర్టీ కాస్మోటిక్ అప్ డేట్ లు మరియు కొత్త ఫీచర్లు మరియు ఎక్విప్ మెంట్ లతో వచ్చింది. ఇది కేవలం రెండు రంగులలో లభ్యమవుతుంది అవి క్యాండీ వైట్ మరియు కార్బన్ స్టీల్.

భారత మార్కెట్లో కొత్త స్కోడా ర్యాపిడ్ రైడర్ విడుదల

కొత్త రాపిడ్ రైడర్ ఎడిషన్ లో కాస్మెటిక్ మార్పులు మరియు అదనపు ఫీచర్లు విషయానికి వస్తే ఒక బ్లాక్డ్-అవుట్ ఫ్రంట్ గ్రిల్, బ్లాక్-సైడ్ ఫాయిల్స్, బ్లాక్డ్-అవుట్ పిల్లర్ లు మరియు ట్రంక్ లిప్ గార్నిష్ లు బ్లాక్ లో పూర్తి చేయబడ్డాయి.

భారత మార్కెట్లో కొత్త స్కోడా ర్యాపిడ్ రైడర్ విడుదల

స్కోడా కూడా ఐవరీ స్లేట్ సీట్ల తో డ్యూయల్ టోన్ నలుపు ఇంటీరియర్స్ తో రాపిడ్ రైడర్ సెడాన్ ను అందిస్తోంది. ఈ సెడాన్ కూడా స్యుఫ్ ప్లేట్ ల మీద ' ర్యాపిడ్ ' అని ఉంటుంది. ఇందులో ఫీచర్ లు మరియు పరికరాల పరంగా కూడా అనేక నవీకరణలను స్కొడా జోడించింది.

భారత మార్కెట్లో కొత్త స్కోడా ర్యాపిడ్ రైడర్ విడుదల

వాటిలో స్కొడా ర్యాపిడ్ రైడర్ డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటీ గ్లేర్ ఐఆర్ వీఎం, హైట్ అడ్జస్టబుల్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రఫ్ రోడ్ ప్యాకేజ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఫ్లోటింగ్ కోడ్ సిస్టం మరియు రియర్ విండ్ స్క్రీన్ డెగోగర్ విత్ టైమర్ వంటి కొత్త ఫీచర్లను జోడించింది.

భారత మార్కెట్లో కొత్త స్కోడా ర్యాపిడ్ రైడర్ విడుదల

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ఈ సందర్భంగా, జాక్ హాల్లీస్( డైరెక్టర్-సేల్స్, సర్వీస్ & మార్కెటింగ్, స్కోడా ఆటో ఇండియా) ఇలా పేర్కొన్నారు, "వేగవంతమైన రైడర్ బ్రాండ్ యొక్క ఎమోటివ్ డిజైన్, అద్భుతమైన ఇంటీరియర్స్ మరియు క్లాస్-లీడింగ్ సేఫ్టీ ఫీచర్ల కలయికగా అందిస్తుంది, ఇది చాలా పోటీ కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త స్కోడా ర్యాపిడ్ రైడర్ విడుదల

ఇది దాని సెగ్మెంట్ లో ఫంక్షనాలిటీ, ప్రాక్టికాలిటీ భాగంలో ఒక బెస్ట్ సెల్లర్ గా నిలుస్తుంది." అని అన్నారు. కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్కొడా ర్యాపిడ్ రైడర్ సెడాన్ సింగిల్ ఇంజన్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది.

భారత మార్కెట్లో కొత్త స్కోడా ర్యాపిడ్ రైడర్ విడుదల

ఇందులో 1.6-లీటర్ ఎమ్ పిఐ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 105 బిహెచ్ పి మరియు 153 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, దీనికి ఆరు-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ లను జోడించారు.

భారత మార్కెట్లో కొత్త స్కోడా ర్యాపిడ్ రైడర్ విడుదల

స్కొడా ర్యాపిడ్ రైడర్ బ్రాండ్ యొక్క ' స్కోడా షీల్డ్ ప్లస్ ' ని కూడా అందుకోనుంది, ఇది 6 సంవత్సరాల ప్యాకేజీలో 24x7 పొడిగించబడ్డ వారెంటీ ఉంటాయి. కొత్త స్కొడా ర్యాపిడ్ రైడర్ రూ. 6.99 లక్షలు, ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ధర కలిగి ఉంది.

భారత మార్కెట్లో కొత్త స్కోడా ర్యాపిడ్ రైడర్ విడుదల

స్కొడా ర్యాపిడ్ రైడర్ కొన్ని అదనపు ఫీచర్లతో పాటు, అనేక సూక్ష్మ సౌందర్య నవీనాలతో కూడిన పరిమిత-ఎడిషన్ మోడల్. స్కొడా ర్యాపిడ్ అనేది భారతదేశంలో బ్రాండ్ నుంచి పాపులర్ ల్లో ఒకటి, ఇది కంపెనీకి ఎక్కువ అమ్మకాలను తీసుకురానుంది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు వోక్స్ వ్యాగన్ వెంటో తో స్కొడా ర్యాపిడ్ పోటీగా నిలువనుంది.

Most Read Articles

English summary
New Skoda Rapid Rider Launched In India. Read in Telugu.
Story first published: Wednesday, July 17, 2019, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X