Just In
- 18 min ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 45 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 2 hrs ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 3 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
Don't Miss
- News
జగన్ సర్కారుకు షాక్- గుంటూరులో నామినేషన్లు ప్రారంభం- మిగతాచోట్ల టీడీపీ, జనసేన ధర్నాలు
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా మోటార్స్ సెన్సేషనల్ ప్లాన్: దిగ్గజాలకు దిమ్మతిరగాల్సిందే!!
భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మరో మాస్టర్ ప్లాన్ వేసింది. వచ్చే ఏడాది ఏకంగా మూడు కొత్త కార్లను మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సిద్దమయ్యింది. అందులో భాగంగానే ఆల్టోజ్, హ్యారీయర్ 5 మరియు 7-సీటర్ మోడళ్లను ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తూ పట్టుబడింది. టాటా కారు కొనే ముందు వీటి గురించి తెలుసుకుందాం రండి...

Rushlane సేకరించిన రహస్య ఫోటోలను పరిశీలిస్తే, డిజైన్ మరియు ఫీచర్లను ఏ మాత్రం గుర్తించడానికి వీల్లేకుండా టాటా తమ మూడు కార్లను నలుపు-తెలుపు రంగు చారలున్న ప్లాస్టిక్ కవర్‌తో కప్పేసి పరీక్షిస్తోంది. మూడింటిని జాతీయ రహదారి పక్కన పార్క్ చేసి ఉండగా తీసిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.

టాటా పరీక్షిస్తున్న మూడు మోడళ్లలో టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఒకటి. డిసెంబర్ 2019లో ఈ కారును అధికారికంగా ఆవిష్కరిస్తున్నట్లు ఇది వరకే ప్రకటించింది మరియు ఆల్ట్రోజ్ రిలీజ్ కార్యక్రమానికి డ్రైవ్‌స్పార్క్ బృందాన్ని కూడా ఆహ్వానించింది. జనవరి కల్లా పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ కంపెనీ యొక్క బిఎస్-6 ఇంజన్ లైనప్‌లో తొలి మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది. టాటా ఆల్ట్రోజ్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది.. అయితే వచ్చే ఏడాది నుండి బిఎస్-6 ఇంజన్ తప్పనిసరి కావడంతో ఆల్ట్రోజ్ కారులో బిఎస్-6 ఇంజన్ అందించే విషయమైన ఆలస్యం అవుతున్నట్లు తెలిసింది.

టాటా సిద్దం చేస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ "ఆల్ట్రోజ్" కారును కంపెనీ యొక్క ఆల్ఫా ఫ్లాట్‌ఫామ్ మీద టాటా ఇంపాక్ట్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డెవలప్ చేశారు. పగటి పూట వెలిగే ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, విభిన్నమైన అల్లాయ్ వీల్స్ మరియు పదునైన డిజైన్ లక్షణాలతో వస్తోంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే టాటా ఆల్ట్రోజ్ కారులో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు రానున్నాయి. ప్రత్యేకించి ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఇంకా ఎన్నో ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.

టాటా అతి త్వరలో తీసుకురానున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సేఫ్టీ పరంగా అత్యంత సురక్షితమైన మోడల్ అని చెప్పుకోవచ్చు. ప్యాసింజర్ల సేఫ్టీ దృష్ట్యా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రియర్ కెమెరా మరియు పార్కింగ్ సెన్సార్లతో పాటు మరెన్నో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరిగా రానున్నాయి.

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులో సాంకేతికంగా బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే 1.2-లీటర్ పెట్రోల్ (86 బిహెచ్‌పి పవర్), 1.2-లీటర్ టుర్భో-పెట్రోల్ (102 బిహెచ్‌పి పవర్) మరియు 1.5-లీటర్ డీజల్ (90 బిహెచ్‌పి పవర్) ఇంజన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది.

గేర్‌బాక్స్ విషయానికి వస్తే.. మూడు ఇంజన్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తప్పనిసరిగా రానుంది. టాటా వారి అత్యాధునిక జిప్‌ట్రాన్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వెర్షన్ ఆల్ట్రోజ్ కారును పరిచయం చేసే అవకాశం ఉంది.

ఆల్ట్రోజ్ కారుతో పాటు మరోపక్క టాటా హ్యారీయర్ 5 మరియు 7-సీటర్ ఎస్‌యూవీలను కూడా పరీక్షించింది. టాటా హ్యారీయర్ 5-సీటర్ ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ బిఎస్-6 ఇంజన్ అప్‌గ్రేడ్ అందిస్తోంది, అదే విధంగా దీనికి కొనసాగింపుగా 7-సీటర్ హ్యారీయర్‌ను కూడా సిద్దం చేస్తోంది.

ప్రస్తుతానికి బజార్డ్ పేరుతో పిలువబడుతున్న హ్యారీయర్ 7-సీటర్ వెర్షన్‌లో సాంకేతికంగా ఎక్కువ కెపాసిటీ గల ఇంజన్ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. 5-సీటర్ హ్యారీయర్ ప్రస్తుతం 2.0-లీటర్ డీజల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఏప్రిల్ 01, 2020 నాటి నుండి మార్కెట్లో విక్రయించే ప్రతి కారులో కూడా బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే ఇంజన్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నూతన కఠినమైన ప్రమాణాల అమలుతో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌ల ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సంస్థలు తమ ఇంజన్‌లను బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. టాటా మోటార్స్ అయితే, ఏకకాలంలో మూడు ప్యాసింజర్ కార్లను బిఎస్-6 ఇంజన్ రేంజ్‌లో విపణిలోకి లాంచ్ చేసేందుకు సిద్దమైంది. వచ్చే ఏడాది ఢిల్లీ వేదికగా జరిగే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో నూతన వాహనాలను ఆవిష్కరించనుంది.