టాటా అల్ట్రోజ్ ప్రొడక్షన్ వెర్షన్ ఇదే.. రిలీజ్ డేట్ ఫిక్స్!

టాటా నుండి విడుదలకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టాటా ఆల్ట్రోజ్ ప్రొడక్షన్ వెర్షన్ కారును ఎట్టకేలకు రివీల్ చేసింది. టాటా మోటార్స్ విపణిలోకి తీసుకొస్తున్న మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ "టాటా ఆల్ట్రోజ్‌" కారును జనవరి 2020లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

టాటా అల్ట్రోజ్ ప్రొడక్షన్ వెర్షన్ ఇదే.. రిలీజ్ డేట్ ఫిక్స్!

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా వారి సరికొత్త ఆల్ఫా (ALFA) ఫ్లాట్‌ఫామ్ మీద వచ్చిన ఫస్ట్ కారు కూడా ఇదే. ఇండియన్ మార్కెట్ కోసం చిన్న కార్లను అభివృద్ది చేసేందుకు టాటా ఈ ఆల్ఫా ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోనుంది. టాటా ఆల్ట్రోజ్‌ను తొలిసారి 2019 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించారు.

టాటా అల్ట్రోజ్ ప్రొడక్షన్ వెర్షన్ ఇదే.. రిలీజ్ డేట్ ఫిక్స్!

టాటా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 2.0 డిజైన్ లాంగ్వేజీలో టాటా హ్యారీయర్ తర్వాత వచ్చిన రెండవ మోడల్ టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌‌లో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు వస్తున్నాయి.

టాటా అల్ట్రోజ్ ప్రొడక్షన్ వెర్షన్ ఇదే.. రిలీజ్ డేట్ ఫిక్స్!

టాటా ఆల్ట్రోజ్ కారులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేసే విశాలమైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్తగా డిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డులో సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌తో పాటు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

టాటా అల్ట్రోజ్ ప్రొడక్షన్ వెర్షన్ ఇదే.. రిలీజ్ డేట్ ఫిక్స్!

టాటా ఆల్ట్రోజ్ బుకింగ్స్ అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, టాటా డీలర్లు డిసెంబర్ 4 నుండే ఆల్ట్రోజ్ మీద ముందస్తు బుకింగ్స్ ప్రారంభించినట్లు తెలిసింది. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బుకింగ్ ధర రూ. 21,000 లుగా ఉన్నట్లు సమాచారం.

టాటా అల్ట్రోజ్ ప్రొడక్షన్ వెర్షన్ ఇదే.. రిలీజ్ డేట్ ఫిక్స్!

పూనేలో ఉన్న టాటా మోటార్స్ చకన్ ప్రొడక్షన్ ప్లాంటులో ఆల్ట్రోజ్ కార్ల ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లు ఇది వరకే ఓ ప్రకటనలో ప్రకటించారు. గోల్డ్-కలర్ ఫినిషింగ్‌లో ఉన్న ఫస్ట్ బ్యాచ్ టాటా ఆల్ట్రోజ్ కార్లను ఇప్పటికే ఉత్పత్తి చేశారు. టాటా ఆల్ట్రోజ్ లాంచ్ కలర్ కూడా ఇదే.

టాటా అల్ట్రోజ్ ప్రొడక్షన్ వెర్షన్ ఇదే.. రిలీజ్ డేట్ ఫిక్స్!

జనవరి 2020 నుండి అమ్మకాలు అధికారికంగా షురూ కానున్నాయి. టాటా ఆల్ట్రోజ్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజల్ ఇంజన్ ఆప్షన్లో లభించనుంది. అవి, 1.2-లీటర్ పెట్రోల్ 85బిహెచ్‌పి, 1.2-లీటర్ టుర్భో-పెట్రోల్ 102బిహెచ్‌పి మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 90బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి.

టాటా అల్ట్రోజ్ ప్రొడక్షన్ వెర్షన్ ఇదే.. రిలీజ్ డేట్ ఫిక్స్!

టాటా ఆల్ట్రోజ్ లోని మూడు ఇంజన్ వేరియంట్లను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. డిమాండును బట్టి తర్వాత దశలో ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఈ మూడు ఇంజన్లు కూడా ఏప్రిల్ 2020 నుండి అమల్లోకి రానున్న బిఎస్-6 ప్రమాణాలను పాటిస్తున్నాయి.

టాటా అల్ట్రోజ్ ప్రొడక్షన్ వెర్షన్ ఇదే.. రిలీజ్ డేట్ ఫిక్స్!

టాటా ఆల్ట్రోజ్ కారును డ్రైవ్ చేసి దీనిని విశిష్టతలను పాఠకులతో పంచుకునేందుకు టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఇప్పటికే డ్రైవ్‌స్పార్క్ బృందాన్ని ఆహ్వానించింది. టాటా ఆల్ట్రోజ్ గురించి పూర్తి వివరాలతో కూడిన కంప్లీట్ రివ్యూను తెలుగులో త్వరలో పబ్లిష్ చేస్తాము.

టాటా అల్ట్రోజ్ ప్రొడక్షన్ వెర్షన్ ఇదే.. రిలీజ్ డేట్ ఫిక్స్!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోనే కాస్త ఖరీదైన స్టైలిష్ మోడళ్లను కోరుకునే కస్టమర్ల కోసం పుట్టుకొచ్చిందే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్. మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా మరియు వోక్స్‌వ్యాగన్ పోలో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ మోడళ్లు కూడా ఈ కెటగిరీకి చెందినవే. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సమరంలోకి జనవరి 2020 టాటా ఆల్ట్రోజ్ కూడా వచ్చి చేరనుంది.

Most Read Articles

English summary
Tata Altroz Production-Spec Revealed: India Launch Scheduled For January 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X