టాటా బ్లాక్‌బర్డ్: మధ్య తరగతి కోసం మరో సంచలనాత్మక మోడల్ తీసుకొస్తున్న టాటా

టాటా మోటార్స్ మరో కొత్త మోడల్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. టాటా బ్లాక్‌బర్డ్ అనే సరికొత్త ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తుండగా మీడియా కంటికి చిక్కింది. ఎంతో కాలంగా అత్యంత రహస్యంగా డెవలప్ చేస్తున్న టాటా బ్లాక్‌బర్డ్ కారు ఫోటోలు ఇటీవల ఇంటర్నెట్ వేదికగా చక్కర్లు కొట్టాయి.

టాటా బ్లాక్‌బర్డ్: మధ్య తరగతి కోసం మరో సంచలనాత్మక మోడల్ తీసుకొస్తున్న టాటా

దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ఎస్‌యూవీల మార్కెట్ అగ్రగామిగా రాణిస్తోంది. కస్టమర్లు పెరిగేకొద్దీ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కార్ల తయారీ కంపెనీలు కూడా రకరకాల ఆప్షన్‌లలో కొత్త కొత్త ఎస్‌యూవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

టాటా బ్లాక్‌బర్డ్: మధ్య తరగతి కోసం మరో సంచలనాత్మక మోడల్ తీసుకొస్తున్న టాటా

ఫుల్-సైజ్ ఎస్‌యూవీలు ఓ మోస్తారు ఫలితాలు సాధిస్తుంటే.. కాంపాక్ట్ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీలు మార్కెట్లో మంచి వృద్దిని సాధిస్తోంది. ఈ మధ్య కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమ ఆర్థిక మాంద్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నప్పటికీ.. కియా మోటార్స్ మరియు ఎంజీ మోటార్స్ విపణిలోకి ఎస్‌యూవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. ఈ రెండు మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఎదురవుతోంది.. అంతే కాకుండా బుకింగ్స్ కూడా భారీగా నమోదవుతున్నాయి.

టాటా బ్లాక్‌బర్డ్: మధ్య తరగతి కోసం మరో సంచలనాత్మక మోడల్ తీసుకొస్తున్న టాటా

టాటా మోటార్స్ కూడా టాటా నెక్సాన్ మరియు టాటా హ్యారీయర్ ఎస్‌యూవీలను లాంచ్ చేసిన తర్వాత విపణిలో ఉన్న ఇతర మోడళ్లకు గట్టిపోటీనిస్తూ.. కంపెనీకి మంచి సేల్స్ సాధించిపెడుతున్నాయి. దీంతో ఎస్‌యీవీలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇప్పుడు మరో కొత్త ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. అందులో భాగంగానే టాటా బ్లాక్‌బర్డ్ ఎస్‌యూవీని రహస్యంగా డెవలప్ చేస్తోంది.

టాటా బ్లాక్‌బర్డ్: మధ్య తరగతి కోసం మరో సంచలనాత్మక మోడల్ తీసుకొస్తున్న టాటా

టాటా బ్లాక్‌బర్డ్ ఎస్‌యూవీ కూడా మిడిల్-క్లాస్ కస్టమర్ల కోసం సరసమైన ధరలో ప్రవేశపెట్టేందుకు టాటా కసరత్తులు చేస్తోంది. ఇది టాటా ఇండియా లైనప్‌లో ఉన్న టాటా నెక్సాన్ మరియు టాటా హ్యారీయర్ మధ్య నిలుస్తుంది. వీలైనంత త్వరగా లాంచ్ చేయాలని యుద్దప్రాతిపదికన శరవేగంగా డెవలప్ చేస్తున్నట్లు సమాచారం.

టాటా బ్లాక్‌బర్డ్: మధ్య తరగతి కోసం మరో సంచలనాత్మక మోడల్ తీసుకొస్తున్న టాటా

టాటా మోటార్స్ ALFA అనే సరికొత్త మోడ్యులర్ ఫ్లాట్‌ఫామ్ ఆవిష్కరించింది. టాటా అతి త్వరలో విడుదల చేయనున్న టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తోంది. 3.7 నుండి 4.3-మీటర్ల పొడవున్న ఎస్‌యూవీలను ఈ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించనున్నారు. టాటా నెక్సాన్ 4 మీటర్లు మరియు టాటా హ్యారీయర్ 4.6-మీటర్ల పొడవు ఉన్నాయి. కాబట్టి టాటా బ్లాక్‌బర్డ్ 4.3-మీటర్ల పొడవు ఉండవచ్చు.

Most Read: బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా

టాటా బ్లాక్‌బర్డ్: మధ్య తరగతి కోసం మరో సంచలనాత్మక మోడల్ తీసుకొస్తున్న టాటా

రహస్యంగా పరీక్షిస్తూ పట్టుబడిన టాటా బ్లాక్‌బర్డ్ ఎస్‌యూవీ డిజైన్ మరియు ఎక్ట్సీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే ఫ్రంట్ డిజైన్‌లో టాటా నెక్సాన్ ఎస్‌యూవీని పోలి ఉండే డిజైన్ అంశాలు ఉన్నాయి. ఎల్ఈడీ డీఆర్ఎల్స్ పైభాగంలో ఉంటే.. హెడ్‌ల్యాంప్స్ బంపర్‌కు క్రింద భాగంలో అందించారు.

Most Read: భారత మార్కెట్లో లాంచ్ చేయనున్న మారుతీ సుజుకి స్మాల్ ఎస్‌యూవీ

టాటా బ్లాక్‌బర్డ్: మధ్య తరగతి కోసం మరో సంచలనాత్మక మోడల్ తీసుకొస్తున్న టాటా

సాంకేతికంగా టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో ఉండే ఇంజన్‌లే టాటా బ్లాక్‌బర్డ్ ఎస్‌యూవీలో కూడా రానున్నాయి. టాటా నెక్సాన్ ప్రస్తుతం 1.2-లీటర్ టుర్భో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది.

Most Read: దారుణంగా మోసపోయాం... జావా కంపెనీపై మండిపడుతున్న కస్టమర్లు

టాటా బ్లాక్‌బర్డ్: మధ్య తరగతి కోసం మరో సంచలనాత్మక మోడల్ తీసుకొస్తున్న టాటా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా బ్లాక్‌బర్డ్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో ఉన్న కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుతం రోడ్డెక్కిన బ్లాక్‌బర్డ్ ప్రొడక్షన్ వెర్షన్ అని తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఈ ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది.

Source: Rushlane

Most Read Articles

English summary
Tata Blackbird Spotted Ahead Of Launch: Spy Pics And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X