Just In
- 1 hr ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 2 hrs ago క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 6 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 7 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News వైసీపీ షాకయ్యే పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ.. ఈసీకి ఫిర్యాదు.. ఎందుకంటే..
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
టాటా సరికొత్త 7-సీటర్ ఎస్యూవీ ఇదే: ఇంజన్, పోటీ, ధర & పూర్తి వివరాలు
టాటా మోటార్స్ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న బజార్డ్ (కెసిని) ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తుండగా మీడియాకు పట్టుబడింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన 2019 జెనీవా మోటార్ షోలో దీనిని తొలిసారిగా ఆవిష్కరించింది. పండగ సీజన్ ప్రారంభమయ్యేనాటికి సరికొత్త టాటా బజార్డ్ 7-సీటర్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
టాటా 7-సీటర్ గురించి పూర్తి వివరాలు...
టాటా ప్రకటించిన బజార్డ్ అనే పేరు కేవలం జెనీవా మోటార్ షోకు మాత్రమే పరిమితం, ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే మోడల్‌కు 7-సీటర్ బజార్డ్ ఎస్‌యూవీని కెసినీ అనే పేరుతో విడుదల చేయనున్నట్లు తెలిసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా భాగస్వామ్యంతో అభివృద్ది చేసిన కెసినీ హ్యుజెన్స్ శాటిలైట్ నుండి సేకరించిన కెసినీ పేరును బజార్డ్ ఎస్‌యూవీకి నామకరణం చేశారు.
రహస్యంగా పరీక్షిస్తుండగా తీసిన టాటా బజార్డ్ (కెసినీ) ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడతున్నాయి. జీప్ కంపాస్ ఓనర్స్ అనే ఫేస్బుక్ పేజీలో శ్రీనివాసన్ జగదీశ్వరన్ అనే వ్యక్తి ఈ ఫోటోలను పోస్ట్ చేశారు. డిజైన్ అంశాలను గుర్తించడానికి ఏ మాత్రం వీల్లేకుండా బ్లాక్ అండ్ వైట్ కవర్‌తో కప్పేసిన టాటా బజార్డ్(కెసినీ) ఎస్‌యూవీని ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ వెర్షన్ 2.0 ఆధారంగా డెవలప్ చేశారు.
అంతే కాకుండా, టాటా హ్యారీయర్ ఎస్యూవీ యొక్క 7-సీటర్ వెర్షన్ ఈ బజార్డ్ ఎస్‌యూవీని నెటిజన్లు అంటున్నారు. ఇందులో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. డిజైన్ పరంగా నూతన మార్పులేవీ సంతరించుకోలేదు.. కానీ మూడవ వరుస సీటింగ్ కోసం క్యాబిన్ మరింత పొడవుగా మలిచారు.
టాటా బజార్డ్ (కెసినీ) 7-సీటర్ ఎస్యూవీ పూర్తి స్థాయిలో లాంచ్ అయితే, విపణిలో ఉన్న జీప్ కంపాస్ మరియు అతి త్వరలో రానున్న ఎంజీ హెక్టర్ 7-సీటర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు
టాటా బజార్డ్ (కెసినీ) ఎస్‌యూవీలో సాంకేతికంగా 2.0-లీటర్ కెపాసిటీ గల కైరోటెక్ 4-సిలిండర్ డీజల్ ఇంజన్ రానుంది. జీప్ కంపాస్ మరియు ఎంజీ హెక్టర్ ఎస్‌యూవీలలో ఉన్న ఈ ఇంజన్ 170బిహెచ్పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ టాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో పాటు హ్యుందాయ్ నుండి సేకరించిన టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఇందులో అందివ్వనున్నట్లు సమాచారం.
టాటా బజార్డ్ ఎస్‌యూవీని కంపెనీ యొక్క ఆప్టిమల్ మోడ్యులర్ ఎఫీషియంట్ గ్లోబల్ అడ్వాన్స్డ్ ఫ్లాట్ ఫామ్(OMEGA) ఆధారంగా నిర్మించారు. టాటా హ్యారీయర్‌లో తరహాలో 8.8-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు 7-అంగుళాల టీఎఫ్టి కలర్ ఇంస్ట్రుమెంట్ స్క్రీన్ రానున్నాయి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టాటా మోటార్స్ విపణిలోకి టాటా బజార్డ్ 7-సీటర్ ఎస్యూవీ విడుదలతో దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టించనుంది. సెప్టెంబర్ లేదా ఆక్టోబర్ మాసాల్లో విడుదల కానున్న టాటా బజార్డ్ సుమారుగా రూ. 15 లక్షల ప్రారంభ ధరను కలిగి ఉండవచ్చు. ఇతర 7-సీటర్ ఎస్‌యూవీలకు ధర, ఫీచర్లు, డిజైన్, లగ్జరీ, సౌకర్యం, సేఫ్టీ ఇలా అన్ని అంశాల పరంగా సరాసరి పోటీనివ్వనుంది.
Source:Jeep Compass Owners (India)