టాటా సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ ఇదే: ఇంజన్, పోటీ, ధర & పూర్తి వివరాలు

టాటా మోటార్స్ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న బజార్డ్ (కెసిని) ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తుండగా మీడియాకు పట్టుబడింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన 2019 జెనీవా మోటార్ షోలో దీనిని తొలిసారిగా ఆవిష్కరించింది. పండగ సీజన్ ప్రారంభమయ్యేనాటికి సరికొత్త టాటా బజార్డ్ 7-సీటర్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

టాటా 7-సీటర్ గురించి పూర్తి వివరాలు...

టాటా సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ ఇదే: ఇంజన్, పోటీ, ధర & పూర్తి వివరాలు

టాటా ప్రకటించిన బజార్డ్ అనే పేరు కేవలం జెనీవా మోటార్ షోకు మాత్రమే పరిమితం, ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే మోడల్‌కు 7-సీటర్ బజార్డ్ ఎస్‌యూవీని కెసినీ అనే పేరుతో విడుదల చేయనున్నట్లు తెలిసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా భాగస్వామ్యంతో అభివృద్ది చేసిన కెసినీ హ్యుజెన్స్ శాటిలైట్ నుండి సేకరించిన కెసినీ పేరును బజార్డ్ ఎస్‌యూవీకి నామకరణం చేశారు.

టాటా సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ ఇదే: ఇంజన్, పోటీ, ధర & పూర్తి వివరాలు

రహస్యంగా పరీక్షిస్తుండగా తీసిన టాటా బజార్డ్ (కెసినీ) ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడతున్నాయి. జీప్ కంపాస్ ఓనర్స్ అనే ఫేస్‌బుక్ పేజీలో శ్రీనివాసన్ జగదీశ్వరన్ అనే వ్యక్తి ఈ ఫోటోలను పోస్ట్ చేశారు. డిజైన్ అంశాలను గుర్తించడానికి ఏ మాత్రం వీల్లేకుండా బ్లాక్ అండ్ వైట్ కవర్‌తో కప్పేసిన టాటా బజార్డ్(కెసినీ) ఎస్‌యూవీని ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ వెర్షన్ 2.0 ఆధారంగా డెవలప్ చేశారు.

టాటా సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ ఇదే: ఇంజన్, పోటీ, ధర & పూర్తి వివరాలు

అంతే కాకుండా, టాటా హ్యారీయర్ ఎస్‌యూవీ యొక్క 7-సీటర్ వెర్షన్ ఈ బజార్డ్ ఎస్‌యూవీని నెటిజన్లు అంటున్నారు. ఇందులో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. డిజైన్ పరంగా నూతన మార్పులేవీ సంతరించుకోలేదు.. కానీ మూడవ వరుస సీటింగ్ కోసం క్యాబిన్‌ మరింత పొడవుగా మలిచారు.

టాటా సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ ఇదే: ఇంజన్, పోటీ, ధర & పూర్తి వివరాలు

టాటా బజార్డ్ (కెసినీ) 7-సీటర్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో లాంచ్ అయితే, విపణిలో ఉన్న జీప్ కంపాస్ మరియు అతి త్వరలో రానున్న ఎంజీ హెక్టర్ 7-సీటర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

టాటా సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ ఇదే: ఇంజన్, పోటీ, ధర & పూర్తి వివరాలు

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

టాటా బజార్డ్ (కెసినీ) ఎస్‌యూవీలో సాంకేతికంగా 2.0-లీటర్ కెపాసిటీ గల కైరోటెక్ 4-సిలిండర్ డీజల్ ఇంజన్ రానుంది. జీప్ కంపాస్ మరియు ఎంజీ హెక్టర్ ఎస్‌యూవీలలో ఉన్న ఈ ఇంజన్ 170బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ టాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో పాటు హ్యుందాయ్ నుండి సేకరించిన టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఇందులో అందివ్వనున్నట్లు సమాచారం.

టాటా సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ ఇదే: ఇంజన్, పోటీ, ధర & పూర్తి వివరాలు

టాటా బజార్డ్ ఎస్‌యూవీని కంపెనీ యొక్క ఆప్టిమల్ మోడ్యులర్ ఎఫీషియంట్ గ్లోబల్ అడ్వాన్స్‌డ్ ఫ్లాట్ ఫామ్(OMEGA) ఆధారంగా నిర్మించారు. టాటా హ్యారీయర్‌లో తరహాలో 8.8-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 7-అంగుళాల టీఎఫ్‌టి కలర్ ఇంస్ట్రుమెంట్ స్క్రీన్ రానున్నాయి.

టాటా సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ ఇదే: ఇంజన్, పోటీ, ధర & పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ విపణిలోకి టాటా బజార్డ్ 7-సీటర్ ఎస్‌యూవీ విడుదలతో దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టించనుంది. సెప్టెంబర్ లేదా ఆక్టోబర్ మాసాల్లో విడుదల కానున్న టాటా బజార్డ్ సుమారుగా రూ. 15 లక్షల ప్రారంభ ధరను కలిగి ఉండవచ్చు. ఇతర 7-సీటర్ ఎస్‌యూవీలకు ధర, ఫీచర్లు, డిజైన్, లగ్జరీ, సౌకర్యం, సేఫ్టీ ఇలా అన్ని అంశాల పరంగా సరాసరి పోటీనివ్వనుంది.

Source:Jeep Compass Owners (India)

Most Read Articles

English summary
Tata Buzzard (Cassini) Spied While Testing — Seven Seats Coming Soon! Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X