ఆల్ట్రోజ్ కారు విడుదలతో టాటా మోటార్స్ దశ తిరగడం ఖాయం

టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ కారును విడుదల చేసేందుకు సర్వం సిద్దం చేసుకుంది. అందులో భాగంగా ఆల్ట్రోజ్ కోసం ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. టాటా ఆల్ట్రోజ్ గురించి కస్టమర్లు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అనువుగా ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా ఆల్ట్రోజ్ అఫీషియల్ వెబ్‌సైట్ విడుదల చేస్తామని ప్రకటించిన తర్వాత ఏకంగా 1,00,000 మంది ఈ సైట్‌ను సందర్శించారు.. అది కూడా కేవలం 23 గంటల్లోనే.

ఆల్ట్రోజ్ కారు విడుదలతో టాటా మోటార్స్ దశ తిరగడం ఖాయం

టాటా ఆల్ట్రోజ్ అధికారిక వెబ్‌సైట్ ప్రస్తుతం కొద్దిమేర సమాచారాన్ని మాత్రమే అందిస్తోంది. టాటా ఆల్ట్రోజ్ కారు పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైన తర్వాత మరింత సమాచారాన్ని అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. అఫీషియల్ వెబ్‌సైట్ ప్రకారం టాటా ఆల్ట్రోజ్ ప్రత్యేకతలేంటో చూద్దాం రండి...

ఆల్ట్రోజ్ కారు విడుదలతో టాటా మోటార్స్ దశ తిరగడం ఖాయం

డిజైన్ పరంగా టాటా ఆల్ట్రోజ్ ఓ అద్భుతమైన ఆవిష్కరణ అని చెప్పుకోవాలి. కారు చుట్టూ ఉన్నటువంటి బాడీ ప్యానల్స్ మీద లేజర్-కట్ క్రీజ్ లైన్స్ ఉంటాయి. లేజర్ కట్ అల్లాయ్ వీల్స్, ఆకర్షణీయైన బంపర్లు ఉన్నాయి. ఖరీదైన కారుగా చెప్పుకునేలా ప్రీమియం లుక్ అండ్ ఫీల్ కలిగించేందుకు కారు చుట్టూ పియానో బ్లాక్ కలర్ స్టైలింగ్ ఉండటాన్ని గమనించవచ్చు.

ఆల్ట్రోజ్ కారు విడుదలతో టాటా మోటార్స్ దశ తిరగడం ఖాయం

టాటా ఆల్ట్రోజ్ వెబ్‌సైట్లో పికాసో ఆర్టింగ్ ఇంటీరియర్ డిజైన్ కూడా చూడవచ్చు. ఫ్యూచర్ టెక్నాలజీ జోడింపుతో కూడిన టాటా ఆల్ట్రోజ్ ఇంటీరియర్‌ను క్లియర్‌గా చూడొచ్చు. కీలెస్ ఎంట్రీ, ఐదు మంది ప్రయాణికుల కోసం సౌకర్యవంతమైన క్యాబిన్ స్పేస్ మరియు అతి త్వరగా కూలింగ్ అందించే ఏసీ సిస్టమ్ ఇంకా ఎన్నో దీని సొంతం.

ఆల్ట్రోజ్ కారు విడుదలతో టాటా మోటార్స్ దశ తిరగడం ఖాయం

టాటా ఆల్ట్రోజ్ కారును నిర్మించిన సరికొత్త ఆల్ఫా (ALFA) ఆర్కిటెక్చర్ కూడా ఈ వెబ్‌సైట్ వివరించింది. టాటా వారి సరికొత్త డిజైనింగ్ ఫ్లాట్‌ఫామ్ ఆల్ఫా (ALFA) మీద డిజైన్ అండ్ డెవలప్ చేసిన మొట్టమొదటి మోడల్ టాటా ఆల్ట్రోజ్. ఈ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా భవిష్యత్తులో టాటా ఇంకా ఎన్నో మోడళ్లను అభివృద్ది చేయనుంది.

ఆల్ట్రోజ్ కారు విడుదలతో టాటా మోటార్స్ దశ తిరగడం ఖాయం

టాటా మోటార్స్ ఈ ఆల్ట్రోజ్ కారును మొట్టమొదటిసారిగా స్విట్జర్లాండులో జరిగిన జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది. టాటా మోటార్స్ నిర్మించిన మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు కూడా ఇదే. టాటా ఆల్ట్రోజ్ పూర్తిగా స్థాయిలో విడుదలైతే దేశీయ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హోండా జాజ్ మరియు టయోటా ఇటీవల లాంచ్ చేసిన గ్లాంజా కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఆల్ట్రోజ్ కారు విడుదలతో టాటా మోటార్స్ దశ తిరగడం ఖాయం

టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ కారును కేవలం ఒక్క డీజల్ ఇంజన్‌తోనే విడుదల చేస్తుందనే వార్తలున్నాయి. 2020 నుండి అమల్లోకి రానున్న బిఎస్-VI ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. వీలైనంత వరకు టాటా నెక్సాన్ ఎస్‌యూవీలోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌నే ఇందులో కూడా అందించే ఛాన్స్ ఉంది. కానీ ఈ ఇంజన్‌ను ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను అనుగుణంగా పలు మార్పులు చేర్పులు చేయవచ్చు.

"టాటా ఆల్ట్రోజ్ కారు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాతో పంచుకోండి!"

Most Read Articles

English summary
Tata Motors officially launched the website. Tata announced that the Tata Altroz official website would go live after it received 1,00,000 site visits, and managed to achieve that number within 23 hours of a reveal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X