జనవరి నుండి భారీగా పెరగుతున్న టాటా కార్ల ధరలు

టాటా తమ అన్ని ప్యాసింజర్ కార్ల ధరలను జనవరి 2020 నుండి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2020 నుండి అమల్లోకి రానున్న బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తమ అన్ని ప్యాసింజర్ కార్లను అప్‌గ్రేడ్ చేస్తోంది, ఇందులో ప్రక్రియలో భాగంగా అయ్యే ఖర్చులకు అనుగుణంగా ధరలు తప్పనిసరని ఓ ప్రకటనలో పేర్కొంది.

జనవరి నుండి భారీగా పెరగుతున్న టాటా కార్ల ధరలు

టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల లైనప్‌లో టాటా టియాగో నుండి టాటా హెక్సా వరకు రకరకాల మోడళ్లను విక్రయిస్తోంది. మార్కెట్లో టాటా కార్ల ధరల శ్రేణి రూ. 4.39 లక్షల నుండి రూ. 16.85 లక్షల వరకు, ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

జనవరి నుండి భారీగా పెరగుతున్న టాటా కార్ల ధరలు

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ప్రెసిడెంట్ మయాంక్ ప్రతీక్ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "అన్ని కార్లలో బిఎస్-6 ఇంజన్‌లను అప్‍గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలోనే ధరలను పెంచుతున్నట్లు తెలిపారు. అయితే ధరల పెంపు ఎంత మేరకు ఉంటుందన్న ప్రశ్నకు సమాధానమివ్వలేదు.

జనవరి నుండి భారీగా పెరగుతున్న టాటా కార్ల ధరలు

సాధారణంగా ప్యాసింజర్ కార్ల ధర పెంపు రూ. 10,000 నుండి రూ. 15,000 మధ్య ఉంటాయి మరియు కార్ల ధరలను బట్టి ఒక్కోసారి రూ. 50,000 వరకు పెరిగే అవకాశం ఉంది. బిఎస్-6 అప్‌గ్రేడ్ కారణంగా కార్ల ధరలు మాత్రమే కాదు టూ వీలర్ల ధరలు కూడా పెరుగుతున్నాయి.

జనవరి నుండి భారీగా పెరగుతున్న టాటా కార్ల ధరలు

బిఎస్-6 ప్రమాణాల అమలుతో ధర పెరగడానికి ప్రధానం కార్లు/బైకుల్లో ఉపయోగించే ఇంజన్‌ను డిజైన్‌ను అంతర్గతంగా మార్చాల్సి ఉంటుంది. కార్లు మరియు బైకుల నుండి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈ బిఎస్-6 ప్రమాణాలను అమల్లోకి తెచ్చారు.

జనవరి నుండి భారీగా పెరగుతున్న టాటా కార్ల ధరలు

నిజానికి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వాడితే ఇంజన్‌ లోపల ఇంధన నష్టం జరగదు (పొగలో పెట్రోల్/డీజల్ వెళ్లిపోవడం). కాబట్టి బిఎస్-6 ప్రమాణాలను పాటించాలంటే దాదాపు అన్ని ఇంజన్‌లను రీడిజైన్ చేయడంతో పాటు అతి తక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న బైకుల్లో ఫ్యూయల్ ఇంజెక్షన్(FI) అందివాల్సి వస్తోంది. దీంతోనే బిఎస్-6 మోడళ్ల ధరలు పెరుగుతున్నాయి.

Most Read: యమహా ఎన్‌మ్యాక్స్ 155 రివీల్.. ఇండియాలో విడుదల ఎప్పుడంటే?

జనవరి నుండి భారీగా పెరగుతున్న టాటా కార్ల ధరలు

టాటా లైనప్‌లో ఉన్న టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్, నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, హ్యారీయర్ 5-సీటర్ ఎస్‌యూవీ, హెక్సా 7-సీటర్ మోడళ్లు ఉన్నాయి. వీటికి కొనసాగింపుగా టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం సెడాన్ మరియు టాటా గ్రావిటాస్ 7-సీటర్ ఎస్‌యూవీలు అతి త్వరలో మార్కెట్లో విడుదల కానున్నాయి.

Most Read: హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం...

జనవరి నుండి భారీగా పెరగుతున్న టాటా కార్ల ధరలు

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, టాటా కార్ల మీద 7 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. టాటా మాత్రమే కాదు భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ అన్ని కార్ల మీద జనవరి 01, 2020 నుండి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Most Read Articles

English summary
Tata Motors Will Hike Passenger Vehicle Prices from January
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X