టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్.. సింగల్ ఛార్జింగ్‌తో 300కిమీ మైలేజ్‌: ధర ఎంతంటే?

టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా టాటా మోటార్స్ విక్రయిస్తున్న అన్ని ప్యాసింజర్ కార్లను కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ అందుకు కావాల్సిన సరికొత్త "జిప్‌ట్రాన్ ఇవి టెక్నాలజీ"ని అభివృద్ది చేసింది.

టాటా జిప్‌ట్రాన్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో తొలి ఉత్పత్తిగా నెక్సాన్ ఎస్‌యూవీని ఖరారు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సుమారు జనవరి-మార్చిలోపు పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించారు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్.. సింగల్ ఛార్జింగ్‌తో 300కిమీ మైలేజ్‌: ధర ఎంతంటే?

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 300వోల్ట్ కెపాసిటీ గల ఎలక్ట్రిక్ మోటార్ యూనిట్ అందించారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌తో ఏకంగా 300కిమీల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం కూడా కలదు, అంతే కాకుండా టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని బ్యాటరీ సిస్టమ్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ మీద 8 ఏళ్ల వారంటీ అందిస్తున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్.. సింగల్ ఛార్జింగ్‌తో 300కిమీ మైలేజ్‌: ధర ఎంతంటే?

వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల కానున్న నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ తరహాలోనే నెక్సాన్ ఎలక్ట్రిక్ ఉండవచ్చు. నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర సుమారుగా రూ. 15 లక్షల నుండి 17 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉండవచ్చని టాటా ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతం పెట్రోల్/డీజల్ ఇంజన్‌తో లభించే నెక్సాన్ ఎస్‌యూవీ ధరల శ్రేణి రూ. 6.58 లక్షల నుండి రూ. 11.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్.. సింగల్ ఛార్జింగ్‌తో 300కిమీ మైలేజ్‌: ధర ఎంతంటే?

టాటా మోటార్స్ మార్కెట్లోకి తీసుకురానున్న ఎలక్ట్రిక్ కార్ల కోసం దేశవ్యాప్తంగా సుమారుగా 300 వరకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. అంతే కాకుండా 2020 డిసెంబర్ నాటికల్లా నాలుగు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని భావించింది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్.. సింగల్ ఛార్జింగ్‌తో 300కిమీ మైలేజ్‌: ధర ఎంతంటే?

టాటా నెక్సాన్ ఇవి (ఎలక్ట్రిక్ వెహికల్) మినహాయిస్తే, ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్, టిగోర్ ఎలక్ట్రిక్ కార్లతో పాటు ALFA-ARC లేదా OMEGA-ARC ఫ్లాట్‍ఫామ్ క్రింద మరో కొత్త మోడల్‌ను అభివృద్ది చేసి ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్.. సింగల్ ఛార్జింగ్‌తో 300కిమీ మైలేజ్‌: ధర ఎంతంటే?

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, 2020 మధ్య భాగంలో ఇండియన్ మార్కెట్లోకి మహీంద్రా లాంచ్ చేయనున్న ఎక్స్‌యూవీ300 ఎలక్ట్రిక్ వెహికల్‌కు సరాసరి పోటీనివ్వనుంది. వీటికి పోటీగా మారుతి సుజుకి మరియు ఎంజీ మోటార్స్ కూడా వచ్చే ఏడాదిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్.. సింగల్ ఛార్జింగ్‌తో 300కిమీ మైలేజ్‌: ధర ఎంతంటే?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ ప్యాసింజర్ కార్ల కంపెనీలు బెటర్, ఫాస్టర్ మరియు పర్ఫామెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూనే ఉన్నాయి. కానీ టాటా మోటార్స్ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన అందరినీ ఆశ్చర్యపరిచింది. అతి తక్కువ ధరలో, ప్రతి కస్టమర్ ఎంచుకునే విధంగా సాధారణ పెట్రోల్/డీజల్ ఇంజన్‌తో లభించే అవే మోడళ్లనే అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జిప్‌ట్రాన్ అనే ఎలక్ట్రిక్ వెరహికల్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి, ఆవిష్కరించింది అతి త్వరలోనే సరసమైన ఎలక్ట్రిక్ కార్లను భారతీయులకు చేరువ చేయనుంది.

Most Read Articles

English summary
Tata Nexon EV Launch Confirmed For Early 2020: Prices To Start At Rs 15 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X