భారత మార్కెట్లోకి కొత్త సేఫ్టీ ఫీచర్లతో టాటా టిగోర్‌ కార్ విడుదల.

ఇటీవల టాటా మోటార్స్ నుంచి వచ్చిన హారియర్ కార్ ఎంతో ప్రజాధారణ పొందుతోంది ఎందుకంటే ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ చాల ప్రత్యేకమైనవి. అంతే కాకుండా దీని దృఢత్వం ముందు మిగతా వన్నీ బలాదూర్, అందువలన ఇది మార్కెట్లో విజయవంతంగా నిలిచింది. ఇదే తరుణంలో టాటా మోటార్స్ కొత్త కారును విడుదల చేసింది.

భారత మార్కెట్లోకి కొత్త సేఫ్టీ ఫీచర్లతో టాటా టిగోర్‌ కార్ విడుదల.

టాటా మోటార్స్‌ నుంచి ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ) వెర్షన్‌లో లో తమ కాంపాక్ట్‌ సెడాన్‌ టిగోర్‌ కార్ను భారత మార్కెట్లోకి విడుదల చేసారు. టాటా టిగోర్ ఏఎంటీ రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది అవి ఎక్స్‌ఎంఏ మరియు ఎక్స్‌ఎంఏ ప్లస్.

భారత మార్కెట్లోకి కొత్త సేఫ్టీ ఫీచర్లతో టాటా టిగోర్‌ కార్ విడుదల.

ఈ రెండు వేరియంట్ లు వరుసగా రూ. 6.39 లక్షలు మరియు రూ. 7.24 లక్షలు ప్రారంభ ధరతో అందిస్తున్నారు. రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం ఉన్నాయి. ఈ వాహనానికి ఇతర యాంత్రిక మార్పులు ఏవీ లేవు, ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇందులో ఉంది.

భారత మార్కెట్లోకి కొత్త సేఫ్టీ ఫీచర్లతో టాటా టిగోర్‌ కార్ విడుదల.

ఎస్ఎన్ బర్మాన్ (టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్, మార్కెటింగ్ & కస్టమర్ సపోర్ట్, ప్యాసింజర్ వేహికల్స్ బిజినెస్ యూనిట్) మాట్లాడుతూ,' మా ఎదుగుదల వేగం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నాం, మేము మా ఉత్పత్తుల్లో అత్యాధునిక టెక్నాలజీలను పరిచయం చేస్తున్నాం.

భారత మార్కెట్లోకి కొత్త సేఫ్టీ ఫీచర్లతో టాటా టిగోర్‌ కార్ విడుదల.

మా గ్రాహకుల యొక్క పెరుగుతున్న ఆకాంక్షలను తీర్చడం కొరకు అద్భుతమైన ప్రాడక్ట్ లను తయారు చేయడం మా ధ్యేయం. ఆటోమేటిక్‌ పోర్ట్‌ఫోలియోలో మా ఉత్పత్తులను నిరంతరం పెంచుకుంటూ పోవడంతో పాటు ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తాం.' అని ఆయన తెలిపారు.

భారత మార్కెట్లోకి కొత్త సేఫ్టీ ఫీచర్లతో టాటా టిగోర్‌ కార్ విడుదల.

సేఫ్టీ ఫీచర్స్

డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, యాంటీ-లాక్‌ బ్రేక్స్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌-ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌, కార్నర్‌ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌, స్పీడ్‌ డిపెండెంట్‌ ఆటోమేటిక్‌ డోర్‌ లాకింగ్‌, ఇంజిన్‌ ఇమ్మొలిలైజర్‌ వంటి భద్రతా ప్రమాణాలతో ఈ కార్లను రూపొందించినట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. వినియోగదారుల ఆకాంక్ష కోసం కంపెనీ ఈ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Most Read: ఆరు జిల్లాలలో డీజిల్ నిషేధం అంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ??

భారత మార్కెట్లోకి కొత్త సేఫ్టీ ఫీచర్లతో టాటా టిగోర్‌ కార్ విడుదల.

ప్రాక్టికల్‌గా, పర్ఫెక్ట్ కాంబినేషన్‌తో నూతన ఫీచర్లు చేర్చారు. టాటా మోటార్స్ టిగోర్ ఎక్స్జడ్ ప్లస్ మోడల్ కారులో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో తో పాటు 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ లైట్లతో పాటు ఆటో పోల్డ్ ఔట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ఓఆర్వీఎంఎస్) ఉంటాయి.

Most Read: సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

భారత మార్కెట్లోకి కొత్త సేఫ్టీ ఫీచర్లతో టాటా టిగోర్‌ కార్ విడుదల.

బ్లూటూత్ కనెక్టివిటీ, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, ఫోల్డబుల్ రేర్ ఆర్మ్ రెస్ట్, కప్ హోల్డర్ల్స్ వంటి ఫీచర్లు చేర్చారు. దీంతో పాటు సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ -ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, స్పీడ్ డిపెండెంట్ ఆటోమేటిక్ డోర్ లాకింగ్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, స్పీడ్ డిపెండెంట్ ఆటోమేటిక్ డోర్ లాకింగ్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ తదితర ఫీచర్లు చేర్చారు.

Most Read: జగనన్నపై ఎల్లలుదాటిన అభిమానం....చట్ట ఉల్లంఘనపై వివాదం ...!

భారత మార్కెట్లోకి కొత్త సేఫ్టీ ఫీచర్లతో టాటా టిగోర్‌ కార్ విడుదల.

ఇది 8 స్పీకర్ల సౌండ్ సిస్టంను హార్మన్ ద్వారా, 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మరియు ఆటో-ఫోల్డ్ వింగ్ అద్దాలను ఇంటిగ్రేటెడ్ అదనపు ఫీచర్లతో నడిపిస్తోంది. టాటా టిగోర్ 1.1 లీటర్-3 సిలిండర్ టర్బోఛార్జ్ డ్ డీజల్ ఇంజన్ తో పాటు 70బిహెచ్పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయును.

భారత మార్కెట్లోకి కొత్త సేఫ్టీ ఫీచర్లతో టాటా టిగోర్‌ కార్ విడుదల.

ఇందులోని ఇంజన్ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో జోడించారు. డీజల్ ఇంజన్ తో ఆటోమేటిక్ వేరియంట్ రాదని వాటికి బదులుగా, టిగోర్ జెటిపి అనే హై పెర్ఫార్మెన్స్ ట్రిమ్ తో దొరుకుతోంది అని టాటా మోటార్స్ తెలిపింది.

భారత మార్కెట్లోకి కొత్త సేఫ్టీ ఫీచర్లతో టాటా టిగోర్‌ కార్ విడుదల.

ఈ కారు 1.2 లీటర్ రివోట్రాన్ టర్బో పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది, ఇది 114బిహెచ్పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయును. టిగోర్ జెటిపి ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.

Most Read Articles

English summary
Tata Motors has launched the Tigor with an AMT transmission. The new Tata Tigor AMT is available on two variants: XMA and XZA Plus.
Story first published: Tuesday, June 18, 2019, 14:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X