టాటా సుమో ఇక కనిపించదు: 25 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు!

టాటా సుమో వెహికల్ గురించి తెలియనివారుండరు.. బాలయ్య బాబు సినిమాలో గాల్లో ఎగరడం నుండి ఫ్యాక్షన్ సినిమాల్లో హీరో, విలన్లు రయ్ రయ్‌మని నడిపేవరకు టాటా సుమో చాలా ఫేమస్. టాటా కంపెనీకి ఇంత గుర్తింపు రావడంలో కూడా సుమో పాత్ర ఎంతో కీలకం. కానీ టాటా సుమో గురించి కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట టాటా సుమో ఇండియన్ మార్కెట్లో ఉండదు.

టాటా సుమో ఇక కనిపించదు: 25 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు!

టాటా మోటార్స్ తమ ప్రొడక్షన్ ప్లాంట్లో సుమో వెహికల్ ప్రొడక్షన్ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. కానీ దేశవ్యాప్తంగా ఉన్న టాటా డీలర్ల వద్ద అక్కడక్కడ కొన్ని సుమో వాహనాలు పాత స్టాక్ ఉండవచ్చు. అయితే ఇకపై సుమో ప్రొడక్షన్ ఉండదని టాటా స్పష్టం చేసింది.

టాటా సుమో ఇక కనిపించదు: 25 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు!

టాటా సుమో తొలిసారిగా 1994లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. సరిగ్గా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సుమో ప్రొడక్షన్‌కు పుల్‌స్టాప్ పెట్టింది. కొత్తగా అమల్లోకి వచ్చిన నూతన క్రాష్ టెస్ట్ మరియు భద్రతా ప్రమాణాలను పాటించడంలో టాటా సుమో విఫలమవ్వడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

టాటా సుమో ఇక కనిపించదు: 25 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు!

ఇండియన్ మార్కెట్లో సుమో ఎస్‌యూవీ ఫ్యూచర్ గురించి టాటా మోటార్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. AIS 145 భద్రతా ప్రమాణాలు మరియు భారత్ న్యూ వెహికల్ సేఫ్టీ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (BNVSAP) రెండింటినీ టాటా సుమో అందుకోలేకపోయింది.

టాటా సుమో ఇక కనిపించదు: 25 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు!

టాటా సుమో ఇండియన్ మార్కెట్లో అనతి కాలంలో భారీ విజయం సాధించిన బ్రాండ్. ఇండియన్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కి పునాది రాయి వేసిన టాటా సుమో సేల్స్ పరంగా టాటా కంపెనీకి కాసుల వర్షం కురిపించింది. సుమో మోడల్‌కు కొనసాగింపుగా... చివరగా సుమో గోల్డ్ అనే లేటెస్ట్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చింది.

టాటా సుమో ఇక కనిపించదు: 25 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు!

టాటా సుమో గోల్డ్ ఎస్‌యూవీ ధరల శ్రేణి రూ. 7.39 లక్షల నుండి రూ. 8.77 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ టాటా సుమో గోల్డ్ ఎస్‌యూవీలో నూతన ఫీచర్లు, కొత్త టెక్నాలజీ మరియు సేఫ్టీ ఫీచర్లు రాలేదు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అమ్ముడవుతున్న కార్లలో ఈ ఫీచర్లు తప్పనిసరిగా లభిస్తున్నాయి.

టాటా సుమో ఇక కనిపించదు: 25 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు!

టాటా సుమో గోల్డ్ ఎస్‌యూవీలో సాంకేతికంగా బిఎస్-IV 3.0-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 85బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 7 మంది వరకు సౌకర్యంగా ప్రయాణించే సౌకర్యం ఉండటంతో సొంత కారుగా వాడుకునే యాజమానుల నుండి అద్దె కార్ల నిర్వాహకుల వరకు టాటా సుమో పాపులర్ మోడల్.

టాటా సుమో ఇక కనిపించదు: 25 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు!

టాటా సుమోలో అప్‌డేట్స్ చేయలేక మార్కెట్ నుండి తొలగించింది. ప్రయాణికుల భద్రత గురించి ఆలోచించి కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఒకింతకు మంచిదే. ఏదేమైనప్పటికీ టాటా మోటార్స్ ఈ విషయమై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

టాటా సుమో ఇక కనిపించదు: 25 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా సుమో గత 25 ఏళ్లుగా మార్కెట్లో ఉంది. టాటా సుమో జీవిత కాలంలో ఎన్నో అప్‌డేట్స్ జరిగాయి.. కంపెనీ సేల్స్ కూడా భారీగా తెచ్చిపెట్టింది. అయితే భారత ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన భద్రత ప్రమాణాలు దృష్ట్యా టాటా మోటార్స్ స్వచ్ఛందంగానే సుమో ఎస్‌యూవీని మార్కెట్ నుండి శాశ్వతంగా తొలగించింది.

టాటా సుమో గురించి మీ అభిప్రాయం మాతో పంచుకోండి..

Most Read Articles

English summary
Tata Sumo Discontinued In India: Company Stops Production Of SUV After 25 Years Of Sales. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X