సంచలన వార్త: భారత్‌లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు

టెస్లా.. సరిగ్గా ఓ నాలుగేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అలజడి సృష్టించిన పేరు. ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది మరియు తయారీ సంస్థగా పేరుగాంచిన టెస్లా అతి తక్కువ కాలంలో అత్యద్బుతమైన మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసి, అనతి కాలంలోనే దిగ్గజ సంస్థగా రాణించింది. అయితే ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించే విషయమై కీలక ప్రకటన చేశారు.

అవును.. మీరు విన్నది నిజమే.. సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ భారత్‌లో తమ కార్యకలాపాల గురించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు నేటి కథనంలో...

సంచలన వార్త: భారత్‌లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు

అమెరికాకు చెందిన హైపర్‌లూప్ టెక్నాలజీని అభివృద్ది చేసే సంస్థ నిర్వహించిన SpaceX Hyperloop Pod Competition 2019 పోటీల్లో ఇండియన్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మద్రాస్ విద్యార్థుల బృందం పాల్గొంది.

సంచలన వార్త: భారత్‌లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌ను టెస్లా ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందని ఐఐఎమ్ మద్రాసుకు చెందిన ఆవిష్కార్ హైపర్‌లూప్ అనే విద్యార్థుల బృందం ప్రశ్నించింది.

సంచలన వార్త: భారత్‌లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ స్పందిస్తూ.. గత రెండేళ్ల నుండి ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వీలుకావడం లేదు. అయితే 2020 నాటికి ఖచ్చితంగా భారత మార్కెట్లోకి ప్రవేశిస్తామని వెల్లడించారు.

సంచలన వార్త: భారత్‌లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు

భారత మార్కెట్లో తమ ఎంట్రీ విషయంలో గతంలో కూడా పలుమార్లు స్పందించిన ఎలన్ మస్క్.. ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమకు సంబంధించి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు సరిగా లేవని తెలిపారు.

సంచలన వార్త: భారత్‌లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

అమెరికన్ మార్కెట్లో బాగా పేరు గడించిన టెస్లా ఇండియన్ మార్కెట్లోకి తమ తొలి ఉత్పత్తిగా టెస్లా మోడల్3 కారును విడుదల చేయనుంది. దీని ధర సుమారుగా 35,000 డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో అయితే దీని ధర రూ. 25 లక్షల వరకు ఉండవచ్చు.

సంచలన వార్త: భారత్‌లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు

ఈ ఏడాది మే నెలలో కమర్షియల్ వెహికల్స్ తయారీ సంస్థ అశోక్ లేలాండ్, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు సేల్స్ కోసం టెస్లాతో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించింది.

సంచలన వార్త: భారత్‌లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు

ఇండియాలో ఎలక్ట్రిక్ కారును ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలనే కల ఒకటి రెండు సంస్థలతో సులభంగా తీరిపోదు. పలు రకాల కంపెనీ ఉమ్మడి భాగస్వామ్యంతో ఇది సాధ్యం అవుతుంది. టెస్లాతో చేతులు కలపడం అదృష్టంగా భావిస్తున్నామని అశోక్ లేలాడ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ మరియు ఛీఫ్ డిజిటల్ ఆఫీసర్ వెంకటేష్ నటరాజన్ పేర్కొన్నారు.

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Tesla Coming To India in 2020 Says Elon Musk — Electric Car Revolution Coming Our Way. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X