Just In
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Movies
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారో భారీ ఫైన్ కట్టాల్సిందే...ఇవే కొత్త రూల్స్
1988 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేటాయింపులను ఆమోదించిన మోటారు వాహన సవరణ బిల్లు 2019 బుధవారం రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును అంతకుముందు జూలై 23 వ తేదీన లోక్ సభ ఆమోదించిన సమయంలో రాజ్యసభలో కొంత సవరణలతో ఆమోదించింది. అది ఇప్పుడు తిరిగి లోక్ సభకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.

ఈ కొత్త 2019 బిల్లును కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, రోడ్డు ట్రాఫిక్ ఉల్లంఘనులకు కఠినంగా జరిమానాలు ఉండే విధంగా ఇందులో ఉన్నది. ఈ సవరణలు రహదారి భద్రతను మెరుగుపర్చడానికి, కచ్చితమైన ట్రాఫిక్ రూల్స్ ను పాటించే పౌరులకు సులభతరం మరియు గ్రామీణ రవాణా సౌకర్యాలను బలోపేతం చేయవలసిన అవసరం ఉన్నాయి.

ఆటోమేషన్, కంప్యూటరీకరణ మరియు ఆన్ లైన్ సేవల ద్వారా ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందడమే కాకుండా దేశ అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది. ఈ బిల్లు దేశవ్యాప్తంగా సమర్థవంతమైన, సురక్షితమైన, అవినీతి రహిత రవాణా వ్యవస్థను అందజేయాలని ప్రయత్నిస్తుంది.

ఇది వాహన చట్టం మాత్రమే కాదు, రోడ్డు భద్రతా బిల్లు కూడా అని గడ్కారీ పేర్కొన్నారు. ఇది ప్రమాదాల బాగా తగ్గించడానికి కారణం అవుతుందని నేను విశ్వసిస్తున్నాను, ఈ బిల్లును ఆమోదం పొందితే వల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇది అంకితం.

ఈ చట్టం ట్రాఫిక్ సంబంధిత నేరాలు మరియు అధిక జరిమానాలుతో కఠినంగా శిక్షను అమలు చేస్తుంది. ఇందులో రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారికీ రూ.5 లక్షల పరిహారం మరియు ప్రమాద ఘటనలో ఎక్కువ గాయాలకు రూ.2.5 లక్షల ప్రమాద బీమా ఉంటుందని తెలియచేసారు.

అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా (అంబులెన్స్) వెళ్లేవారికి రూ.10,000 జరిమానా, రూ.1000 నుండి రూ.2,000 అలాగే ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు రూ.2,000 జరిమానా విధించాలని బిల్లులో ప్రవేశపెట్టింది.

హెల్మెట్ లేకుండా ప్రయాణిం చేస్తే రూ.1,000 జరిమానా, లైసెన్స్ పై 3 నెలల సస్పెన్షన్ ను పొందవలసి ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ లో పట్టుబడిన వారి విషయంలో, వేహికల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది, దీనికి పూర్తి బాధ్యత వేహికల్ యొక్క యజమాని జవాబుదారీగా ఉంటాడు.

ప్రమాదకరమైన డ్రైవింగ్ పెనాల్టీని ఇంతకు ముందు రూ.1,000 నుంచి రూ.5,000కు పెంచారు, మాధ్యమం తాగి డ్రైవింగ్ చేసే వారికి పెనాల్టీ ఇప్పుడు రూ.2,000కు పెరిగింది. చిన్న పిల్లల డ్రైవింగ్ చేస్తే వారి తల్లితండ్రులకు జైలు శిక్ష పడుతుంది. మిగతా వివరాలు క్రింది చిత్రంలో చూడవచ్చు.

డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ కాతరు చేయకపోవడం మరియు రోడ్డుపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వంటి అన్ని సాధారణ నేరాలు అన్ని కూడా 'ప్రమాదకరమైన డ్రైవింగ్' కేటగిరీ కింద చేర్చారు, డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ ఇందులో ఉంటుందని గడ్కారీ పేర్కొన్నారు.

అందులో కంప్యూటరైజ్డ్ చేసి ఆన్ లైన్ పరీక్షలు పాస్ చేయకుండా ఎవరికీ లైసెన్సు జారీ చేయరు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించే వ్యక్తులు సివిల్ మరియు క్రిమినల్ కేసుల నుంచి సంరక్షించబడతారు మరియు ఇందులో వారు తమ వివరాల గురించి పోలీస్ లేదా వైద్య సిబ్బందికి వెల్లడించనవసరం లేదు.

ఈ కొత్త బిల్లు, సరైన పద్ధతిలో అమలు చేస్తే, ట్రాఫిక్ నిబంధనలకు పాటించడంతో పాటు, భద్రత పరంగా మన రహదారులపై అద్భుతమైన మార్పును తెస్తుంది. ట్రాఫిక్ నియమాలను ఉల్ల౦ఘి౦చే వారి మనస్సుల్లో భయాన్ని పుట్టించడానికి ఈ బిల్లు సరి అయినది.