ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్ ఎంపీవీ కార్లు

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7-సీటర్ ప్యాసింజర్ కార్లు గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌లకు ఎంతగానో ఉపయోగపడే 7-సీటర్ ఎంపీవీ కార్లు ఇండియన్ మార్కెట్లో ఎన్ని ఉన్నాయో తెలుసా? ఆగష్టు 2019 కార్ సేల్స్ రిపోర్ట్ చూస్తే నమ్మశక్యంగానీ ఫలితాలు నమోదయ్యాయి. ఇవాళ్టి స్టోరీలో భారతదేశపు టాప్-5 బెస్ట్ సెల్లింగ్ కార్లు ఏవో చూద్దాం రండి...

ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్ ఎంపీవీ కార్లు

మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ ఎన్నడూలేని విధంగా 139 శాతం సేల్స్ వృద్దిని సాధించింది. గత ఏడాది ఆగష్టు నెలలో అమ్ముడైన 3,515 యూనిట్ల ఎర్టిగా సేల్స్‌తో పోల్చుకుంటే 2019 ఆగష్టులో ఏకంగా 8,391 ఎర్టిగా కార్లు అమ్ముడయ్యి 139% వృద్దిని నమోదు చేసుకుంది. భారీ మార్పులు చేర్పులతో ఎర్టిగా ఎంపీవీ రీలాంచ్ కావడంతో సేల్స్ విపరీతంగా పుంజుకున్నాయి. దీంతో భారతదేశపు నెం.1 ఎంపీగా కారుగా తన స్థానాన్ని పధిలం చేసుకుంది.

ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్ ఎంపీవీ కార్లు

బెస్ట్ సెల్లింగ్ ఎంపీవీ కార్ల జాబితాలో టయోటా ఇన్నోవా క్రిస్టా రెండవ స్థానంలో నిలిచింది, గడిచిన ఆగష్టు 2019లో 4,796 ఇన్నోవా క్రిస్టా కార్లు అమ్ముడయ్యాయి. 2018 ఆగష్టు నెల సేల్స్‌తో పోల్చుకుంటే ఈ ఏడాది అదే నెలలో 29 శాతం నష్టపోయింది. జపాన్ దిగ్గజం టయోటా సంస్థకు ఇండియన్ మార్కెట్లో గత పదేళ్ల నుండి బెస్ట్ సెల్లింగ్ కారుగా ఇన్నోవా వాహనం మొదటి స్థానంలో నిలిచి రికార్డు స్థాయి సేల్స్ సాధిస్తూ వచ్చింది.

ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్ ఎంపీవీ కార్లు

ఈ జాబితాలో మహీంద్రా బొలెరో మూడవ స్థానంలో నిలిచింది. ఎలాంటి రోడ్ల మీదనైనా గుర్రంలా పరుగెత్తే వాహనం మహీంద్రా బొలెరో. ఇది ఎంతో కాలంగా ఇండియన్ మార్కెట్లో ఉంది. మహీంద్రా సంస్థ బొలెరో వాహనాన్ని రిలీజ్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు నిలకడగా నిర్ధిష్టమైన సేల్స్ సాధిస్తూనే ఉంది. మహీంద్రా ఆగష్టు 2019లో 3,993 బొలెరో యూనిట్లు విక్రయించి 34 శాతం వృద్దిని కోల్పోయింది. కొత్తగా వచ్చిన రెనో ట్రైబర్ మరియు మారుతి సుజుకి ఎక్స్ఎల్6 మోడళ్లు బొలెరో సేల్స్ తినేశాయి.

ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్ ఎంపీవీ కార్లు

రెనో సంస్థ లాంచ్ చేసిన రెనో ట్రైబర్ తొలి నెలలోనే రికార్డ్ స్థాయి సేల్స్ సాధించింది. ఆగష్టు 2019లో 2,490 యూనిట్ల ట్రైబర్ కార్లను విక్రయించి బెస్ట్ సెల్లింగ్ ఎంపీవీ కార్ల జాబితాలో నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీని తర్వాత మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎంపీవీ 2,356 యూనిట్లతో ఐదవ స్థానంలో నిలిచింది.

Rank Model Units Sold
1 మారుతి సుజుకి ఎర్టిగా 8,391
2 ఇన్నోవా క్రిస్టా 4,796
3 మహీంద్రా బొలెరో 3,993
4 రెనో ట్రైబర్ 2,490
5 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 2,356
6 మహీంద్రా మరాజొ 697
7 మహీంద్రా జైలో 356
8 హోండా బిఆర్-వి 175
9 డాట్సన్ గో+ 169
10 టాటా హెక్సా 136
ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్ ఎంపీవీ కార్లు

చివరి ఐదు స్థానాల్లో మహీంద్రా మరాజొ, మహీంద్రా జైలో, హోండా బిఆర్-వి, డాట్సన్ గో+ మరియు టాటా హెక్సా వాహనాలు ఉన్నాయి. ఈ ఐదు కార్లు కూడా ఆగష్టు 2019 నెలలో కేవలం మూడంకెల సంఖ్యలోపే సేల్స్ నమోదు చేసుకున్నాయి.

ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్ ఎంపీవీ కార్లు

మహీంద్రా మరాజొ 697 యూనిట్ల, మహీంద్రా జైలో 356 యూనిట్లు అమ్ముడయ్యాయి. హోండా బిఆర్-వి 175 యూనిట్లతో 8వ స్థానంలో నిలవగా.. చివరి రెండు ఎంపీవీలైన డాట్సన్ గో+ మరియు టాటా హెక్సా వరుసగా 169 మరియు 136 యూనిట్లతో 9 మరియు 10 స్థానాల్లో నిలిచాయి.

ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్ ఎంపీవీ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఏడాది ఆటోమొబైల్ కంపెనీలకు అంత బాగా కలిసిరాలేదు. స్కూటర్ల నుండి కార్ల వరకు దాదాపు అన్ని కంపెనీలు నేలచూపులు చూశాయి. గత ఏడాది గణాంకాలతో పోల్చితే దాదాపు అన్ని మోడళ్లు కూడా ఈ యేడు చాలా వరకు నష్టాన్ని నమోదు చేశాయి. కానీ కొత్తగా విడుదలైన కార్లు మంచి ఫలితాలే సాధించాయి. రెనో ట్రైబర్ మరియు మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎంపీవీలు టాప్-10 బెస్ట్ సెల్లింగ్ ఎంపీవీ కార్ల జాబితాలో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. మారుతి సుజుకి ఎర్టిగా మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా మోడళ్లు ఆయా కంపెనీలకు ఆశించిన ఫలితాలు తీసుకొచ్చాయి.

Most Read Articles

English summary
Top-Selling MPVs In India For August 2019: Renault Triber Enters Top-5 While Maruti Ertiga Leads. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X