ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి

ఇండియన్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ అంటే తెలియని వారుండరు. టయోటా కంపెనీకి ఇండియాలో సక్సెస్ తెచ్చిపెట్టిన మోడళ్లలో ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా కార్లదే పైచేయి. అయితే కస్టమర్లు అభిరుచి మరియు ఫ్యాన్స్ కోసం ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని మరో కొత్త వేరియంట్లో విడుదల చేసేందుకు సిద్దమైంది. సెప్టెంబర్ 12న పూర్తి స్థాయిలో లాంచ్ చేస్తున్నట్లు టయోటా ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి

అతి త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో టయోటా మోటార్స్ సరికొత్త ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టోవో వేరియంట్‌ను పలు షోరూముల్లో ప్రదర్శనకు ఉంచారు. టయోటా కంపెనీ యొక్క మార్పులు చేర్పులు మరియు అభివృద్ది పనులు చేసే విభాగం టీఆర్‌డి(టయోటా రేసింగ్ డెవలప్‌మెంట్) ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించింది.

ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి

టయోటా ఇండియా లైనప్‌లోని ఫార్చ్యూనర్ వేరియంట్లో హై-ఎండ్ వేరియంట్‌గా నిలవనుంది. ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో వేరియంట్ ఎక్ట్సీరియర్‌లో స్పోర్టివ్ ఫీలింగ్ కల్పించే పలురకాల మార్పులు చోటు చేసుకున్నాయి. రీడిజైన్ చేయబడిన బంపర్లు, సరికొత్త ఫ్రంట్ గ్రిల్ ముందు మరియు వెనుక వైపున ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి.

ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి

గుర్తించదగిన ఇతర మార్పుల్లో డ్యూయల్ టోన్ పెయింట్ ఫినిషింగ్, ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్‌లో టీఆర్‌డి బ్యాడ్జింగ్ మరియు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి ఒక కఠినమైన రూపాన్నిచ్చాయి.

ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి

ఇంటీరియర్ విషయానికి వస్తే, టిఆర్‌డి బ్యాడ్జింగ్ గల సీట్లు, బ్లాక్ అండ్ మెరూన్ కలర్ థీమ్ గల డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌ క్యాబిన్, ప్రకాశవంతమైన దారంతో కుట్టబడిన లెథర్ సీట్లుఎస్‌యూవీ లోపలివైపు లగ్జరీ ఫీలింగ్ తీసుకొచ్చాయి. టీఆర్‌డి డిజైన్ లాంగ్వేజ్ అనుసరిస్తూ డోర్ హ్యాండిల్స్ కూడా రెడ్ కలర్ ఫినిషింగ్‌లో వచ్చాయి.

ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి

క్యాబిన్‌లోని ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, 8-దిశలలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు, 11-స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్, కార్బన్-కెల్వర్ ట్రిమ్ గల గేర్‌ రాడ్ మరియు స్టీరింగ్ వీల్, టీఆర్‌డి బ్యాడ్జ్ గల ఎరుపు రంగులో ఉన్న ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్, రియర్ వ్యూవ్ కెమెరా మరియు పవర్ టెయిల్ గేట్ ఇంకా ఎన్నో చెప్పుకోదగిన ఫీచర్లు ఉన్నాయి..

Most Read: విపణిలోకి టీవీఎస్ స్టార్ సిటీ+ స్పెషల్ ఎడిషన్: పండుగ ప్రత్యేకం!

ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి

టయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో వేరియంట్ రెగ్యులర్ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీతో లభించే ఇంజన్‌లతోనే లభిస్తోంది. ఇందులోని 2.8-లీటర్ 4-సిలిండర్ల డీజల్ ఇంజన్ 174బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. అయితే, 4X4 డ్రైవ్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇందులో మిస్సయ్యాయి.

Most Read: టాటా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్ విడుదల: ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి

ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పోర్టివో వేరియంట్లో టిఆర్‌డి సస్పెన్షన్ సిస్టమ్, పెద్ద పరిమాణంలో ఉన్న డిస్క్ బ్రేకులు అంతర్జాతీయ విపణిలో లభించే వెర్షన్‌లో ఉన్నాయి. అయితే, సెప్టెంబర్ 12న విడుదలయ్యే ఇండియన్ వెర్షన్ ఎస్‌యూవీలో ఇవి ఉన్నాయో లేదో అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

Most Read: టయోటా యారిస్ ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో విడుదల: ఇవీ ప్రత్యేకతలు!

ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి

ప్రస్తుతం దేశీయ విపణిలో లభించే టయోటా ఫార్చ్యూనర్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 31.7 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఆధారంగా సరికొత్త టిఆర్‌డి స్పోర్టివో వేరియంట్ తీసుకొస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ ధర రూ. 33 లక్షలు వరకు ఉండవచ్చనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
Toyota is all set to launch a new variant of their flagship SUV, the Fortuner in the Indian market. Called the Toyota Fortuner TRD Sportivo, the SUV is scheduled to go on sale in India from 12th September.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X