టయోటా గ్లాంజా గ్రాండ్ సక్సెస్... ఎందుకంత పాపులర్?

టయోటా ఇండియా ఈ ఏడాది జూన్ 6న సరికొత్త గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును విపణిలోకి ప్రవేశపెట్టింది. పలుమార్పులు చేర్పులతో రీబ్యాడ్జ్ వెర్షన్‌లో వచ్చిన మారుతి బాలెనో కారు టయోటా గ్లాంజా. విడుదలైన అనతి కాలంలోనే భారీ సక్సెస్ అందుకుంది. చూడటానికి అచ్చం బాలెనో కారునే పోలి ఉండే టయోటా గ్లాంజా కాస్తంత కాస్ట్లీ కూడా అయితే, ధర ఏ మాత్రం లెక్కచేయకుండా టయోటా గ్లాంజా కారును ఎంచుకోవడానికి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ ప్రియులు ఎగబడుతున్నారు.

టయోటా గ్లాంజా గ్రాండ్ సక్సెస్... ఎందుకంత పాపులర్?

టయోటా గ్లాంజా రూ. 7.21 లక్షల ప్రారంభ ధరతో కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతోంది. విడుదలైన వెంటనే టయోటా తమ గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు సేల్స్ ప్రారంభించింది. మొదటి రోజు నుండే ఆరంభం అదరహో అనేలా ఫలితాలు సాధించింది ఈ మోడల్.

టయోటా గ్లాంజా గ్రాండ్ సక్సెస్... ఎందుకంత పాపులర్?

టయోటా మోటార్స్ ఇప్పటి వరకు 2,142 యూనిట్ల కార్లను విక్రయించింది. దీంతో గ్లాంజా మోడల్ టయోటా ఇండియా యొక్క రెండవ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. అత్యధిక విక్రయాలతో మొదటి స్థానంలో ఇన్నోవా క్రిస్టా ఎంపీవీ నిలిచింది.

టయోటా గ్లాంజా గ్రాండ్ సక్సెస్... ఎందుకంత పాపులర్?

ఇండియన్ మార్కెట్ కోసం సుజుకి మరియు టయోటా మధ్య ఒప్పందంలో భాగంగా మారుతి సుజుకి సంస్థకు చెందిన బాలెనో కారును గ్లాంజా పేరుతో టయోటా మోటార్స్ దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టింది. జపాన్ దిగ్గజాలు ఈ పరస్పర భాగస్వామ్య ఒప్పందం క్రింద ఇంకా ఎన్నో మోడళ్లను ఇచ్చిపుచ్చుకొని కొత్త పేర్లతో, పలు మార్పులు చేర్పులతో రీలాంచ్ చేసి విక్రయించనున్నాయి.

టయోటా గ్లాంజా గ్రాండ్ సక్సెస్... ఎందుకంత పాపులర్?

డిజైన్ పరంగా టయోటా గ్లాంజా కారులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గ్లాంజా అనే పేరు గల బ్యాడ్జింగ్ మరియు ఫ్రంట్ గ్రిల్ స్టైల్ మినహాయిస్తే ఎక్ట్సీరియర్ డిజైన్‌ అచ్చం బాలెనో కారు తరహాలోనే ఉంటుంది. ఇంటీరియర్‌‍లో కూడా స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు దాదాపుగా బాలెనో కారుని పోలి ఉంది.

టయోటా గ్లాంజా గ్రాండ్ సక్సెస్... ఎందుకంత పాపులర్?

సాంకేతికంగా మారుతి సుజుకి బాలెనో కారులో లభించే అదే ఇంజన్‌ను యథావిధిగా అందించింది. బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేస్తుంది. అవి, 88.4బిహెచ్‌పి మరియు 81.7బిహెచ్‌పి. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ స్టాండర్డ్ మ్యాన్యువల్ లేదా ఆప్షనల్ సీవీటీ (ఆటోమేటిక్) గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

టయోటా గ్లాంజా గ్రాండ్ సక్సెస్... ఎందుకంత పాపులర్?

టయోటా అందిస్తున్న గ్లాంజా ప్రీమియం కారులో అత్యాధునిక టెక్నాలజీ గల ఎన్నో సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. బాలెనో టాప్ ఎండ్ వేరియంట్లో లభించే దాదాపు అన్ని ఫీచర్లతో పాటు కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరిన్ని అదనపు ఫీచర్లను అందించి దేశీయంగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్ రూపురేఖలను మార్చేస్తోంది.

టయోటా గ్లాంజా గ్రాండ్ సక్సెస్... ఎందుకంత పాపులర్?

తప్పనిసరి ఫీచర్లుగా లభించే వాటిలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (AC), ఇంజన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్ గల స్మార్ట్ ఎంట్రీ, ఇన్నర్ రియర్ వ్యూ మిర్రర్ మీద ఎలక్ట్రో క్రోమిక్ లైనింగ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు రియర్ వ్యూ కెమెరాతో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి.

టయోటా గ్లాంజా గ్రాండ్ సక్సెస్... ఎందుకంత పాపులర్?

టయోటా మోటార్స్ ఇప్పటికే 2000 యూనిట్ల గ్లాంజా కార్లను విక్రయించి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో తనదైన ముద్ర వేసుకుంది. అయితే, మార్కెట్లో ఉన్న మారుతి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హోండా జాజ్ మరియు వోక్స్‌వ్యాగన్ పోలో వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల నుండి ఎదురయ్యే పోటీని ధీటుగా ముందుకు ఎలా సాగుతుందనేది ఆసక్తికి గురిచేస్తోంది.

Most Read Articles

Read more on: #toyota #టయోటా
English summary
Toyota Glanza Sales — Glanza Off To A Good Start In The Indian Market. Read in Telugu.
Story first published: Saturday, June 22, 2019, 18:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X