టయోటా ఇన్నోవా క్రిస్టా మూడు పల్టీలు కొట్టినా తెరుచుకోని ఎయిర్ బ్యాగులు

టయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్ రోడ్డు ప్రమాదంలో మూడు పల్టీలు కొట్టింది. సుమారుగా 7 నుండి 8 మంది వరకు ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ వాహనం సేఫ్టీలో దిట్ట అని సంస్థ చెబుతోంది. కానీ ఇటీవల జరిగిన ఓ యాక్సిడెంట్‌లో ఏకంగా మూడు పల్టీలు కొట్టినా ఎయిర్ బ్యాగులు తెరుచుకోలేదు. దీంతో ఈ వాహనాలు కొన్న కస్టమర్ల పరిస్థితి గాల్లో దీపంలా మారిపోయింది.

మీరు కూడా ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా కొనాలనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ప్రమాదానికి గురైన ఇన్నోవా క్రిస్టా ఫోటోలు, ప్రమాద స్థాయి, ప్రమాద తీవ్రత మరియు ఇది ఎంత వరకు సురక్షితమైనదో తెలుసుకుందాం రండి..

టయోటా ఇన్నోవా క్రిస్టా మూడు పల్టీలు కొట్టినా తెరుచుకోని ఎయిర్ బ్యాగులు

ఇన్నోవా క్రిస్టా వాహనంలో లూథియానాకు వెళుతున్నపుడు మరో కారును ఢీకొనడంతో పల్టీలు కొట్టింది. ఫోటోలను పరిశీలిస్తే హైస్పీడులో ఉన్నపుడే యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ఇన్నోవా క్రిస్టా వెహికల్‌ను చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

టయోటా ఇన్నోవా క్రిస్టా మూడు పల్టీలు కొట్టినా తెరుచుకోని ఎయిర్ బ్యాగులు

దారుణంగా ఛిధ్రమైన ఇన్నోవా క్రిస్టా ఫోటోలను టీమ్-బీహెచ్పీ వెబ్‌సైట్లో పోస్ట్ చేశారు. రోడ్డు ప్రక్కన అచేతనంగా పడివున్న ఇన్నోవా క్రిస్టా యాక్సిడెంట్ ఫోటోలను దీని యాజమానే పోస్ట్ చేశాడు. అంతే కాకుండా.. ప్రమాదానికి గల కారణమేంటో కూడా వివరించాడు.

టయోటా ఇన్నోవా క్రిస్టా మూడు పల్టీలు కొట్టినా తెరుచుకోని ఎయిర్ బ్యాగులు

మేము ఇన్నోవా క్రిస్టాలో ప్రయాణిస్తున్నపుడు ఓ హ్యుందాయ్ క్రెటా కారు హైవే మీద వచ్చే వాహనాలను గమనించకుండా ఓ చిన్న కనెక్టింగ్‌ రోడ్డు ద్వారా జాతీయ రహదారి మీదకు వచ్చేశాడు. దాంతోనే ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు చెప్పుకొచ్చాడు.

టయోటా ఇన్నోవా క్రిస్టా మూడు పల్టీలు కొట్టినా తెరుచుకోని ఎయిర్ బ్యాగులు

ఇన్నోవా క్రిస్టాకు ఎడమవైపున హ్యుందాయ్ క్రెటా అడ్డురావడంతో డ్రైవర్ సడెన్‌గా కుడివైపుకు మళ్లించినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతను చూస్తే అప్పటికే చాలా ఆలస్యం అయినట్లుంది. క్రిస్టా ముందు ఎడమవైపున నుజ్జునుజ్జు అయ్యింది. టైర్ పూర్తిగా పేలిపోయి రిమ్ము కూడా డ్యామేజ్ అయ్యింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా మూడు పల్టీలు కొట్టినా తెరుచుకోని ఎయిర్ బ్యాగులు

వెహికల్ ప్రమాదానికి గురైనపుడు ఎడమవైపు పడిపోయి కొద్ది దూరం పాటు జారుతూ వెళ్లి ఆగిపోయింది. ప్రమాదం జరిగినపుడు డ్రైవర్ ఇద్దరు పిల్లలం ఉన్నాం, చిన్న చిన్న గాయాలు మినహా పెద్ద గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాం. ప్రమాదంలో ఇన్నోవా క్రిస్టా మూడు సార్లు పల్టీలుకొట్టినా ఏ ఒక్క ఎయిర్ బ్యాగ్ కూడా తెరుచుకోకపోవడం కొసమెరుపు.

టయోటా ఇన్నోవా క్రిస్టా మూడు పల్టీలు కొట్టినా తెరుచుకోని ఎయిర్ బ్యాగులు

ఏడు ఎయిర్ బ్యాగులతో వచ్చిన ఇన్నోవా క్రిస్టా టాప్ ఎండ్ వేరియంట్ ఇంత ఘోర ప్రమాదంలో కూడా తెరుచుకోకపోవడంతో కస్టమర్లు నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఈ వాహనాలు కొన్న యజమానుల భద్రతకు ఇదొక పెద్ద ప్రశ్నార్థకం. ఇందులో ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులను వినియోగించారు. రోడ్డు ప్రమాదాన్ని గుర్తించే సెన్సార్లు వాహనంలో ఉంటాయి, ఈ స్థాయి ప్రమాదం జరిగితే సెన్సార్లు వెంటనే ఎయిర్ బ్యాగులను అలర్ట్ చేస్తాయి. ఈ సందర్భంలో సెన్సార్లు ఫెయిల్ అయినట్లుగా తెలుస్తోంది. సెన్సార్లు పనిచేసినా... ఎయిర్ బ్యాగులు విచ్చుకోలేదా అనే ప్రశ్న కూడా ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా మూడు పల్టీలు కొట్టినా తెరుచుకోని ఎయిర్ బ్యాగులు

ఇన్నోవా క్రిస్టా ముందువైపున బంపర్, హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ గ్రిల్ వంటివన్నీ రోడ్డు రాపిడిలో దాదాపుగా అరిగిపోయాయి. వెహికల్ ఫ్రేమ్ కూడా మరో ఆకారంలోకి మారిపోయింది. అయినప్పటికీ సెన్సార్లు గుర్తించకపోవడం పెద్ద తప్పిందమనే కథనాలు వినిపిస్తున్నాయి. వాహనం పల్టీలు కొట్టినపుడు వెనుక కూర్చున్న పిల్లలకు కాకుండా.. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ తప్పనిసరిగా ఓపెన్ అవ్వాల్సింది. ఏదేమైనప్పటికీ ఈ ఘోర ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.

టయోటా ఇన్నోవా క్రిస్టా మూడు పల్టీలు కొట్టినా తెరుచుకోని ఎయిర్ బ్యాగులు

అత్యుత్తమ నిర్మాణ విలువలతో తయారవుతున్న ప్యాసింజర్ వాహనాల్లో టయోటా ఇన్నోవా క్రిస్టా ఒకటి. కానీ, కొన్నిసార్లు సెన్సార్లలో కూడా లోపాలు తలెత్తుతూ ఉంటాయి. సెన్సార్లు పనిచేయకపోయినా... ఎయిర్ బ్యాగులు విచ్చుకోకపోయినా... ఇంత ఘోర ప్రమాదంలో కూడా ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారంటే.. ఇన్నోవా క్రిస్టా నిర్మాణ నాణ్యతకు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. సాంకేతికంగా విఫలం కావడంతో టయోటా సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా యాక్సిడెంట్ కథనంపై మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి

Most Read Articles

English summary
Toyota Innova Rolls Over Thrice In Crash; Airbags Fail To Deploy. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X