మారుతి బ్రిజాకు పోటీగా టయోటా రైజ్ ఎస్‌యూవీ

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో చిన్న కార్ల కంటే పెద్ద కార్ల మార్కెట్లో బాగా రాణిస్తోంది. ఇటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ మరియు ఇటియోస్ సెడాన్ కార్లు ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి టయోటా రైజ్ అనే ఎస్‌యూవీని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

మార్కెట్లో ఉన్న మారుతి వితారా బ్రిజా, టాటా నెక్సాన్ మరియు హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీలకు సరాసరి పోటీనిచ్చే టయోటా రైజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

టయోటా నుండి తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ

టయోటా కంపెనీ రైజ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని వచ్చే నెలలో అధికారికంగా అంతర్జాతీయ ఆవిష్కరణను ఖరారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా టయోటా సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్న ఎన్నో దేశాల్లో టయోటా రైజ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. టయోటా రైజ్ ఎస్‌యూవీలోని బాడీ ప్యానల్స్, ఇంజన్ మరియు ఇంటీరియర్ వంటి భాగాలను టోక్యో మోటార్ షో 2019లో దైహాట్సు ఆవిష్కరించిన రాకి కాంపాక్ట్ ఎస్‌యూవీతో పంచుకుంది.

డిజైన్ పరంగా పరిశీలిస్తే టయోటా రైజ్ మరియు దైహాట్సు రాకి ఎస్‌యూవీల మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయి. కానీ టయోటా రైజ్ మార్కెట్లో ఉన్న ఇతర ఎస్‌యూవీలతో పోల్చితే ఎంతో విభిన్నంగా ఉంది. రైజ్ ఎస్‌యూవీలో టయోటా వారి అత్యంత కఠినమైన ఫ్రంట్ నోస్, విశాలమైన ధీర్ఘచతుర్భుజాకారపు ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్ మరియు డే టైం రన్నింగ్ ఎల్ఈడీ లైట్ల కోసం యాంగులర్ హౌసింగ్స్ మరియు గ్రిల్‌కు పై భాగంలో టయోటా లోగో చక్కగా ఇమిడిపోయింది.

టోక్యో మోటార్ షో 2019లో దైహాట్సు ఆవిష్కరించిన రాకీ కాంపాక్ట్ ఎస్‌యూవీ తరహాలో టయోటా రైజ్ ఎస్‌యూవీలో కఠినమైన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కాస్త విభిన్న శైలిలో వచ్చాయి. స్పోర్టివ్ స్టైలింగ్ అందించే టీఆర్‌డీ ప్యాకేజీలో ప్రత్యేకమైన బాడీ కిట్స్ మరియు అల్లాయ్ వీల్ డిజైనింగ్స్ లభించే అవకాశం ఉంది.

టయోటా నుండి తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ

టయోటా రైజ్ రియర్ డిజైన్‌లో ఎల్ఈడీ సొబగులున్న సమాంతరపు టెయిల్ ల్యాంప్స్, రెండు టెయిల్ లైట్లను కలుపుతూ మధ్యలో మందమైన క్రోమ్ మెటల్ బార్ వచ్చింది. దైహాట్సు రాకి ఎస్‌యూవీలో కూడా ఇదే తరహా రియర్ డిజైన్ కలదు. వాలుగా ఉన్న డి-పిల్లర్, ఎత్తైన బంపర్ మరియు క్రిందివైపుకు ఏటవాలుగా ఉన్న విభిన్నమైన క్లాడింగ్ బంపర్ కలదు.

టయోటా రైజ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఫాక్స్ బ్రషింగ్ చేయబడిన అల్యూమినియం ఎలిమెంట్స్ గల ఏసీ వెంట్స్, స్టీరింగ్ వీల్ ప్రధాన హైలెట్‌గా చెప్పుకోవచ్చు. 8-అంగుళాల ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్‌‌మెంట్ స్క్రీన్ మరియు సెంటర్ కన్సోల్‌ డ్రైవర్‌కు అత్యంత సౌలభ్యమైన డ్రైవింగ్ ఫీల్ కలిగిస్తాయి. ఇందులో 3-స్పోక్ స్టీరింగ్ వీల్ కలదు.

కొలతల పరంగా చూసుకుంటే టయోటా రైజ్ మరియు దైహాట్సు రెండు ఎస్‌యూవీలు కూడా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ క్రిందకు వస్తాయి. టయోటాకు చెందిన TNGA మోడ్యూలర్ ఆర్కిటెక్చర్ యొక్క లో-కాస్ట్ వెర్షన్ ఫ్రెక్సిబుల్ DNGA ఫ్లాట్‌ఫామ్ మీద వీటిని నిర్మించారు.

టయోటా నుండి తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ

టయోటా రైజ్ ఎస్‌యూవీని ఫ్రంట్ వీల్ డ్రైవ్ వెర్షన్‌తో 4-వీల్-డ్రైవ్ వేరియంట్లో కూడా విక్రయించనుంది. సాంకేతికంగా ఇందులో 1.0-లీటర్ కెపాసిటీ గల మూడు సిలిండర్ల 12-వాల్వ్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ కలదు. 98బిహెచ్‌పి పవర్ మరియు 140.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఈ ఇంజన్ తొలుత ఆటోమేటిక్ ఆ తర్వాత కాస్త ఆలస్యంగా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించనుంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota Raize compact SUV first images revealed. Read in Telugu.
Story first published: Thursday, October 31, 2019, 11:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X