టయోటా యారిస్ ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో విడుదల: ఇవీ ప్రత్యేకతలు!

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ ఇండియా విభాగం తమ యారిస్ సెడాన్ కారును ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో దేశీయ విపణిలోకి లాంచ్ చేసింది. టయోటా యారిస్ జి-ఆప్షనల్ అనే వేరియంట్‌ను రూ. 9.63 లక్షలు ఎక్స్-షోరూమ్‌(ఇండియా) ధరతో తీసుకొచ్చింది.

టయోటా యారిస్ సెడాన్ కారునే ఎంచుకోవాలని తెలిపే కారణాలేంటో ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి..

టయోటా యారిస్ ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో విడుదల: ఇవీ ప్రత్యేకతలు!

టయోటా సరిగ్గా కొన్ని రోజుల క్రితమే యారిస్ సెడాన్ కారును జె-ఆప్షనల్ మరియు వి-ఆప్షనల్ అనే రెండు విభిన్న వేరియంట్లలో లాంచ్ చేసింది. వీటికి కొనసాగింపుగా స్వల్ప వ్యవధిలోనే జి-ఆప్షనల్ అనే వేరియంట్‌ను తీసుకొచ్చింది. యారిస్ జి-ఆప్షనల్ వేరియంట్ ఇప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి జె మరియు జి వేరియంట్ల మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది.

టయోటా యారిస్ ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో విడుదల: ఇవీ ప్రత్యేకతలు!

టయోటా యారిస్ జి-ఆప్షనల్ వేరియంట్ విడుదలతో యారిస్ సెడాన్ లభించే అన్ని వేరియంట్లో ఒక్క విక్స్ వేరియంట్ మినహాయిస్తే మిగతా అన్ని వేరియంట్లు (జి, జె, వి) ఆప్షన్‌ల్ వేరియంట్లలో లభిస్తున్నాయి. ఇతర ఆప్షనల్ వేరియంట్ల మాదిరిగానే జి-ఆప్షనల్ యారిస్ వేరియంట్ పెట్రోల్ ఇంజన్, మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తోంది.

టయోటా యారిస్ ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో విడుదల: ఇవీ ప్రత్యేకతలు!

టయోటా యారిస్ జి-ఆప్షనల్ వేరియంట్ 1.5-లీటర్ పెట్రోల్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ ధర రూ. 9.63 లక్షలు మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ ధర రూ. 10.83 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

టయోటా యారిస్ ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో విడుదల: ఇవీ ప్రత్యేకతలు!

టయోటా యారిస్ జి-ఆప్షనల్ వేరియంట్లో జె మరియు జి వేరియంట్ల నుండి సేకరించిన ఎన్నో అత్యాధునిక ఫీచర్లను జోడించారు. ప్రొజెక్టర్ హెడ్‍ల్యాంప్స్, అత్యాధునిక క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు 15-అంగుళాల పరిమాణంలో ఉన్న సిల్వర్ అల్లాయ్ వీల్స్ వచ్చాయి.

టయోటా యారిస్ ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో విడుదల: ఇవీ ప్రత్యేకతలు!

ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యూయల్-టోన్ క్యాబిన్, వాటర్ ఫాల్ డిజైన్‌లో ఉన్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 4.2-అంగుళాల పరిమాణంలో ఉన్న టీఎఫ్‌‌టి కలర్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ల్పే, కోల్డ్ గ్లూవ్ బాక్స్, వెనుక ప్యాసింజర్ల కోసం రూఫ్ మౌంటెడ్ ఎయిర్ వెంట్స్, డ్రైవర్ సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే సౌలభ్యం, కీలెస్ ఎంట్రీ ఫంక్షన్, ఆంబియంట్ లైటింగ్, స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

టయోటా యారిస్ ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో విడుదల: ఇవీ ప్రత్యేకతలు!

ప్రయాణికుల భద్రత పరంగా టయోటా యారిస్ జి-ఆప్షనల్ సెడాన్ కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, మూడు ఎయిర్ బ్యాగులు, హై స్పీడ్ అలర్ట్ ఇంకా పలు రకాల సేఫ్టీ ఫీచర్లు వచ్చాయి.

టయోటా యారిస్ ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో విడుదల: ఇవీ ప్రత్యేకతలు!

సాంకేతికంగా టయోటా యారిస్ జి-ఆప్షనల్‌ వేరియంట్లో 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ సీవీటీ-ఐ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం ఈ ఇంజన్ గరిష్టంగా 108బిగహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టయోటా యారిస్ ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో విడుదల: ఇవీ ప్రత్యేకతలు!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా ఇండియా విభాగం గత ఏడాది తొలిసారిగా యారిస్ కారును దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభించే యారిస్ సెడాన్ ఓ మోస్తారు ఫలితాలు కనబరిచింది. అయితే, సేల్స్ పెంచుకునేందుకు ఇది వరకు లభించే వేరియంట్లలోనే కొన్ని అదనపు ఫీచర్లను జోడించి, కాస్త న్యూ లుక్‌తో ఆప్షనల్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. మరి ఈ ప్రయోగంతోనైనా టయోటా ఆశించిన సేల్స్ సాధిస్తుందో.. లేదో చూడాలి మరి!

Most Read Articles

English summary
New Toyota Yaris Variant (G-Optional) Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X