భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

ఆలస్యంగా ఎంపివి రంగం కూడా భారతీయ కొనుగోలుదారులను ఆకర్షించింది. అంతే కాకుండా ఇవి మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. ప్రజలు ఇప్పుడు పెద్ద వాహనాలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు, ఎందుకంటే కేవలం 5 కంటే ఎక్కువ సీటును కలిగి ఉండి, లగేజీని కూడా సులభంగా పెట్టుకోవడానికి ఈ 7 సీటర్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కొత్త 7 సీటర్ ఎస్యువి లేదా ఎంపివి కొనుగోలు చేయడం కొరకు మీరు వేచి చూస్తున్నారా.. అయితే రాబోయే కొత్త 7 సీటర్ వాహనాల గురించి ఇందులో వివరంగా ఉంది తెలుసుకోండి...

భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

రెనాల్ట్ ట్రైబర్

రెనాల్ట్ ఈ నెలలో ట్రైబర్ ను విడుదల చేయడానికి సిద్ధం చేస్తోంది అయితే ఇది మార్కెట్లో సబ్ 4 మీటర్ విభాగంలో ఈ కారు 7 సీటర్ గా ఉంటుంది. ఇందులో ఇంకా డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ కన్సోల్ తో పాటుగా సెంటర్ కన్సోల్ ని, టచ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో కారు యొక్క ఇంటీరియర్స్ కూడా చాలా ఆధునికంగా ఉంటాయి.

భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

ట్రైబర్ 1.0-లీటర్ పెట్రోల్ మోటార్ ద్వారా పవర్ అందించబడుతుంది, ఇది 72 బిహెచ్పి మరియు 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లేదా 5-స్పీడ్ ఏఎంటి తో ఉంటుంది.

విడుదల అంచనా: ఈ నెల చివరి నాటికీ

భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

హ్యుందాయ్ క్రెటా 7-సీటర్

హ్యుందాయ్ వచ్చే ఏడాది క్రెటా కొత్త జనరేషన్ మోడల్ ను విడుదల చేయనుంది మరియు ఈ కారును ఇప్పటికే చైనాలో ఆవిష్కరించారు. తరువాత హ్యుందాయ్ కూడా ఈ ఎస్యువి 7-సీటర్ వెర్షన్ ను ఇండియాలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

ఈ కారు ముందు వైపున టూ టైర్ హెడ్ ల్యాంప్ డిజైన్ తో కూడిన కొత్త డిజైన్ ను కలిగి ఉంటుంది మరియు వెనుక టెయిల్ ల్యాంప్స్ ను కలిగి ఉండనుంది. ఇతర ఫీచర్లలో ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ లు ఇతర అప్డేట్ లతో రానుంది. ఇంజిన్ల విషయానికి వస్తే, హ్యుందాయ్ క్రెటా 7-సీటర్ లో, 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బో-డీజల్ ఇంజన్ ను కలిగి ఉండనుంది.

విడుదల అంచనా: 2020 తరువాత

భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

ఎంజి హెక్టర్ 7-సీటర్

ఎంజి తన మొదటి వాహనాన్ని హెక్టర్ రూపంలో మా తీరంలో ప్రారంభించింది మరియు ఎస్యూవి ఇప్పటికే విజయాన్ని పొందింది. తరువాత సంవత్సరం, ఎంజి భారతదేశంలో హెక్టర్ యొక్క 7 సీట్ల వెర్షన్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది, ఇది టాటా బజార్డ్ కు పోటీగా ఉంది.

భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

7-సీట్ల హెక్టర్ దాని యొక్క 5-సీట్ల వలె దాదాపుగా ఒకే విధంగా ఉంటుందని భావిస్తున్నారు. హెక్టర్ ఇప్పటికే చైనాలో

7-సీటర్ వెర్షన్ అమ్మకానికి ఉంది. అలాగే దీనిని దేశీయ మార్కెట్కు తీసుకురావడం కంపెనీకి సన్నాహాలు మొదలు పెట్టింది. హెక్టర్ యొక్క 7-సీటర్ వెర్షన్ పై అదే ఇంజిన్, గేర్ బాక్స్ మరియు ఎక్విప్ మెంట్ లెవల్స్ ని ఆశించవచ్చు.

విడుదల అంచనా: 2020 మొదటి ఆర్థిక సంవత్సరంలో

Most Read: ' డ్రైవర్ లెస్ ' కారు లో సచిన్ టెండూల్కర్.. వీడియో సంచలనం

భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

టాటా బజార్డ్

ఈ ఏడాది జెనీవా మోటార్ షో సందర్భంగా బజార్డ్ ను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఈ ఏడు సీట్ల వెర్షన్ ను భారత మార్కెట్లో 2020 తొలి త్రైమాసికంలో విడుదల చేయనుంది. ఇది హార్రియర్ కంటే పొడవుగా మరియు ఎత్తుగా ఉంటుంది.

Most Read:ట్యూబ్లెస్ టైర్ల కథ ముగిసింది వాటి స్థానంలో ఎయిర్ లెస్ టైర్ల వచ్చేస్తున్నాయ్ !

భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

ల్పంగా డిజైన్ లో మార్పు ఉంటుంది. అయితే ఫీచర్స్, ఎక్విప్ మెంట్ విషయంలో మాత్రం బజార్డ్ పై ఒకేలా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో 2.0-లీటర్ క్రయోటెక్ డీజల్ ఇంజన్ కూడా ఇదే విధంగా ఉంటుంది. అయితే, ఈ ఇంజన్ సుమారుగా 170బిహెచ్పి ఉత్పత్తి చేస్తుంది, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కూడా లాంచ్ చేయనుంది.

విడుదల అంచనా: 2020 మొదటి ఆర్థిక సంవత్సరంలో

Most Read:జగనన్నపై ఎల్లలుదాటిన అభిమానం....చట్ట ఉల్లంఘనపై వివాదం ...!

భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఆల్ స్పేస్

వోక్స్ వ్యాగన్ ఈ ఏడాది చివరికల్లా టిగువాన్ లోని లాంగ్ వీల్ బేస్ వేరియంట్ ను పరిచయం చేయనుంది. ఇది ఒక అదనపు వరుస సీటు తో వస్తుంది, ఇది స్కోడా కొడియాక్ ను పోలి ఉంటుంది. ఈ కొత్త కారును లాంఛ్ చేయడం ద్వారా, వోక్స్ వ్యాగన్ రెగ్యులర్ టిగువాన్ ను మార్కెట్ లో మరింత సరసమైన ధరకు అమ్మవచ్చు.

భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

వోక్స్ వ్యాగన్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న టిగువాన్ లో 2.0 లీటర్ డీజల్ ఇంజన్ ను ఉపయోగిస్తుంది. ఇది గరిష్టంగా 148 బిహెచ్పి మరియు 340 ఎన్ఎమ్ ల గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయును. 4డబ్ల్యూబి ఎస్యువి ఏడు-స్పీడ్ డిఎస్జి ట్రాన్స్ మిషన్ ను పొందుతుంది. త్వరలో జరగబోయే టిగువాన్ ఆల్ స్పేస్ లోనూ ఇదే సెట్ ను ఆశించొచ్చు.

విడుదల అంచనా: 2020 లో

భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

కియా కార్నివల్

2020 న్యూ ఢిల్లీ ఆటో ఎక్స్ పోలో సందర్భంగా కార్నివాల్ ఎంపివి విడుదలకి చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ కార్నివాల్ భారతదేశంలోని దక్షిణ కొరియా తయారీదారుల నుంచి వస్తున్న రెండో మోడల్ గా ఉంటుంది మరియు టొయోటా ఇన్నోవా క్రిస్టా లతో పోటీ పడనుంది, ఇది క్రిస్టా కంటే చాలా పెద్దది, కొత్త ఫీచర్ మరియు ఖరీదైనదిగా ఉంటుంది. ఈ కార్నివాల్ లో 2.2-లీటర్ డీజల్ ఇంజన్ తో పాటు 3,800 ఆర్పిఎమ్ వద్ద 199 బిహెచ్పి మరియు 1750 - 2750 ఆర్పిఎమ్ వద్ద 441 ఎన్ఎమ్ ల టార్క్ ను ఉత్పత్తి చేసి సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది.

విడుదల అంచనా: మొదటి ఆర్థిక సంవత్సరంలో

భారత మార్కెట్లో రాబోయే 7 సీటర్ కారులు ఏవో తెలుసా..!

జీప్ కంపాస్ 7-సీటర్

ఈ కంపాస్ భారతదేశంలో అత్యంత విజయవంతమైనది. ఈ అమెరికా కంపెనీ భారత మార్కెట్లో కొన్ని కొత్త మోడళ్లను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు, కంపాస్ 7-సీట్ల ఎస్యువి వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని తెలిపారు. జీప్ ద్వారా ఇప్పటి వరకు ఈ ఎస్యువి యొక్క డిజైన్, ఇంటీరియర్స్ లేదా ఇంజన్ల గురించి ఎటువంటి సమాచారం లేదు. 7-సీటర్ కంపాస్ లో రెండు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ లతో వస్తుంది.

విడుదల అంచనా: 2020 లో

Most Read Articles

English summary
Upcoming 7-seater cars in India: Renault Triber to Tata Buzzard- Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X