Just In
- 1 hr ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 2 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- 2 hrs ago
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- 4 hrs ago
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
Don't Miss
- News
కడప జిల్లాలో దారుణం: ప్రేమ పేరుతో ఉన్మాదం: యువతిపై ఘాతుకం: ప్రాణాపాయ స్థితిలో
- Sports
టైగర్ పటౌడీని గుర్తుచేశాడు.. రహానేకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలి!! కోహ్లీ ఇక వద్దు!
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- Movies
బోయపాటికి మరో స్టార్ హీరో దొరికేశాడు.. ఒకేసారి రెండు భాషల్లో బిగ్ బడ్జెట్ మూవీ
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్
ఇండియన్ మార్కెట్లో ఒకప్పుడు చాలా ప్రసిద్ధి పొందిన ఆటో కంపెనీలలో ఒకటి హిందుస్థాన్ మోటార్స్. సాధారణంగా హిందూస్తాన్ మోటార్స్ అనే పేరు వినగానే అంబాసిడర్, కాంటెస్సా వంటి కార్లు గుర్తుకు వస్తాయి. హిందూస్తాన్ మోటార్స్ యొక్క వాహనానికి ఇప్పుడు కొత్త లుక్ కల్పించారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొత్త లుక్ లో కనిపిస్తున్న మాడిఫైడ్ హిందుస్థాన్ అంబాసిడర్ ని 'ట్రెక్కర్' అని పిలుస్తారు. ఈ ట్రెక్కర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మాడిఫైడ్ చేయబడిన ఈ ట్రెక్కర్ వీడియోను డాజీష్ పి తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో హిందుస్తాన్ ట్రెక్కర్ యొక్క నిర్వహణను మనం చూడవచ్చు. ఈ వీడియో కార్ యొక్క వెలుపలి భాగం చూపించడంతో ప్రారంభమవుతుంది.

ఈ అంబాసిడర్ కారులో హెడ్లైట్లు, పైలట్ లాంప్స్ లాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్స్ అన్నీ అంబాసిడర్ నుండి అరువుగా తీసుకుంటారు. ఈ మాడిఫైడ్ కారు చూడటానికి జీప్ లాగా ఉంటుంది.
MOST READ:టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]

ఇక్కడ మాడిఫైడ్ చేయబడిన ట్రెక్కర్ 2000 వ సంవత్సరానికి చెందిన మోడల్. ఇందులో రెయిన్ ఫోర్స్డ్ రూఫ్, న్యూ ఫ్రంట్ బంపర్, కొత్త టెయిల్ లైట్ మరియు వంటి చిన్న మార్పులు చేశారు. హెచ్ఎం ట్రెక్కర్ లో డోర్స్ ఉండవు. ఇవి సాఫ్ట్ టాప్ వెర్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనికి 15 అంగుళాల చక్రాలు ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఉన్న సస్పెన్షన్ కూడా అంబాసిడర్ నుండి తీసుకోబడింది.
ఈ వాహనం యొక్క యజమాని ఇప్పటివరకు వాహనం ఎటువంటి సమస్యకి గురి కాలేదని తెలిపాడు. ఒక వేళ ఏదైనా సమస్య ఉంటే లేదా ఏదైనా విడి వస్తువులు కావాల్సి వస్తే సెకండ్ హ్యాండ్ మార్కెట్‌పై ఆధారపడతానని చెప్పాడు. కారు లోపలి పెద్దగా ఎటువంటి మార్పు చేయలేదని కార్ యజమాని తెలిపాడు.
MOST READ:15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తిరగటం నిషేధించిన NGT ; ఎందుకంటే ?

హెచ్ ఎమ్ ట్రెక్కర్ యొక్క ఇంజిన్ అంబాసిడర్ నుండి తీసుకోబడింది. ఇది 1.5 లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 34 బిహెచ్పి శక్తిని మరియు 80 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ ఇసుజు గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది.

ఇటీవల కాలంలో మోడిఫైడ్ వాహనాలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే వాహన ప్రేమికులు వారికీ నచ్చిన వాహనాలకు మరింత సొగసులు చేర్చడానికి చాలా ఖర్చు చేస్తుంటారు. ఈ విధంగానే అంబాసిడర్ కార్ యజమాని తన కారుని చాలా అందంగా తయారు చేసుకున్నాడు. ఇది భారతదేశంలో అరుదైన అందమైన ట్రెక్కర్లలో ఒకటిగా నిలిచింది.
Image Coutesy: Dajish P/YouTube
MOST READ:మార్చి 31 తర్వాత అమ్మిన బిఎస్ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?