మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

ఇండియన్ మార్కెట్లో ఒకప్పుడు చాలా ప్రసిద్ధి పొందిన ఆటో కంపెనీలలో ఒకటి హిందుస్థాన్ మోటార్స్. సాధారణంగా హిందూస్తాన్ మోటార్స్ అనే పేరు వినగానే అంబాసిడర్, కాంటెస్సా వంటి కార్లు గుర్తుకు వస్తాయి. హిందూస్తాన్ మోటార్స్ యొక్క వాహనానికి ఇప్పుడు కొత్త లుక్ కల్పించారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొత్త లుక్ లో కనిపిస్తున్న మాడిఫైడ్ హిందుస్థాన్ అంబాసిడర్ ని 'ట్రెక్కర్' అని పిలుస్తారు. ఈ ట్రెక్కర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

మాడిఫైడ్ చేయబడిన ఈ ట్రెక్కర్ వీడియోను డాజీష్ పి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో హిందుస్తాన్ ట్రెక్కర్ యొక్క నిర్వహణను మనం చూడవచ్చు. ఈ వీడియో కార్ యొక్క వెలుపలి భాగం చూపించడంతో ప్రారంభమవుతుంది.

మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

ఈ అంబాసిడర్ కారులో హెడ్లైట్లు, పైలట్ లాంప్స్ లాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్స్ అన్నీ అంబాసిడర్ నుండి అరువుగా తీసుకుంటారు. ఈ మాడిఫైడ్ కారు చూడటానికి జీప్ లాగా ఉంటుంది.

MOST READ:టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]

మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

ఇక్కడ మాడిఫైడ్ చేయబడిన ట్రెక్కర్ 2000 వ సంవత్సరానికి చెందిన మోడల్. ఇందులో రెయిన్ ఫోర్స్డ్ రూఫ్, న్యూ ఫ్రంట్ బంపర్, కొత్త టెయిల్ లైట్ మరియు వంటి చిన్న మార్పులు చేశారు. హెచ్‌ఎం ట్రెక్కర్ లో డోర్స్ ఉండవు. ఇవి సాఫ్ట్ టాప్ వెర్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనికి 15 అంగుళాల చక్రాలు ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఉన్న సస్పెన్షన్ కూడా అంబాసిడర్ నుండి తీసుకోబడింది.

ఈ వాహనం యొక్క యజమాని ఇప్పటివరకు వాహనం ఎటువంటి సమస్యకి గురి కాలేదని తెలిపాడు. ఒక వేళ ఏదైనా సమస్య ఉంటే లేదా ఏదైనా విడి వస్తువులు కావాల్సి వస్తే సెకండ్ హ్యాండ్ మార్కెట్‌పై ఆధారపడతానని చెప్పాడు. కారు లోపలి పెద్దగా ఎటువంటి మార్పు చేయలేదని కార్ యజమాని తెలిపాడు.

MOST READ:15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తిరగటం నిషేధించిన NGT ; ఎందుకంటే ?

మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

హెచ్ ఎమ్ ట్రెక్కర్ యొక్క ఇంజిన్ అంబాసిడర్ నుండి తీసుకోబడింది. ఇది 1.5 లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 34 బిహెచ్‌పి శక్తిని మరియు 80 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ ఇసుజు గేర్‌బాక్స్‌ కలిగి ఉంటుంది.

మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

ఇటీవల కాలంలో మోడిఫైడ్ వాహనాలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే వాహన ప్రేమికులు వారికీ నచ్చిన వాహనాలకు మరింత సొగసులు చేర్చడానికి చాలా ఖర్చు చేస్తుంటారు. ఈ విధంగానే అంబాసిడర్ కార్ యజమాని తన కారుని చాలా అందంగా తయారు చేసుకున్నాడు. ఇది భారతదేశంలో అరుదైన అందమైన ట్రెక్కర్లలో ఒకటిగా నిలిచింది.

Image Coutesy: Dajish P/YouTube

MOST READ:మార్చి 31 తర్వాత అమ్మిన బిఎస్ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

Most Read Articles

English summary
Rare, beautifully kept Hindustan Trekker on video. Read in Telugu.
Story first published: Friday, July 10, 2020, 18:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X