కొత్త తరం హ్యుందాయ్ ఐ20 లాంచ్ ఖరారు: బాలెనోకు సరైన పోటీ!

హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలోకి కొత్త తరం ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ20 విడుదలను ఖాయం చేస్తూ, ఇటీవల కొత్త టీజర్ రిలీజ్ చేసింది.

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 లాంచ్ ఖరారు: బాలెనోకు సరైన పోటీ!

హ్యుందాయ్ ఇండియా విభాగం ఢిల్లీలో జరుగుతున్న 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆవిష్కరించింది, మరో నెల రోజుల్లో దీనిని పూర్తి స్థాయిలో మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆరా కాంపాక్ట్ సెడాన్ కారును కూడా విడుదల చేసింది. అయితే, దేశీయ రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ అతి త్వరలో కొత్త తరం ఐ20 మరియు టుసాన్ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 లాంచ్ ఖరారు: బాలెనోకు సరైన పోటీ!

హ్యుందాయ్ మోటార్స్ కొత్త తరం ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును మారుతి బాలెనో మరియు టయోటా గ్లాంజా కార్లకు గట్టి పోటీనిచ్చేలా సరికొత్త హంగులతో ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది మధ్య భాగానికల్లా విపణిలోకి రానుంది. ఈ నేపథ్యంలో కొత్త తరం హ్యుందాయ్ ఐ20 కారుకు సంభందించిన టీజర్ రిలీజ్ చేసింది.

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 లాంచ్ ఖరారు: బాలెనోకు సరైన పోటీ!

లేటెస్ట్ వెర్షన్ హ్యుందాయ్ ఐ20 కారును మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న 2020 జెనీవా మోటార్ షోలో అంతర్జాతీయంగా ఆవిష్కరించనుంది. ఏదేమైనప్పటికీ ఇండియన్ వెర్షన్ ఐ20 ఇంటర్నేషనల్ మోడల్‌తో పోల్చుకుంటే ఇండియన్ రోడ్ కండీషన్స్ మరియు కస్టమర్ల డిమాండుకు అనుగుణంగా కాస్త విభిన్నంగా ఉంటుంది.

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 లాంచ్ ఖరారు: బాలెనోకు సరైన పోటీ!

ఆల్-న్యూ ఎలైట్ ఐ20 కారును ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా అన్ని పరీక్షలు పూర్తి చేసుకుంది. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే, మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, టాటా ఆల్ట్రోజ్ మరియు హోండా జాజ్ ప్రీమియం కార్లకు సరాసరి పోటీనిస్తుంది.

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 లాంచ్ ఖరారు: బాలెనోకు సరైన పోటీ!

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20తో పోల్చుకుంటే, కొత్త తరం ఎలైట్ ఐ20 అత్యంత పదునైన డిజైన్ లక్షణాలు మరియు స్పోర్టివ్ శైలిలో రానుంది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న న్యూ జనరేషన్ ఐ20 స్కెచ్ ఫోటోలను గమనిస్తే, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో కూడిన పలుచటి హెడ్ ల్యాంప్స్ మరియు వెన్యూ, ఆరా కార్లలో ఉన్నటువంటి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ వచ్చే అవకాశం ఉంది.

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 లాంచ్ ఖరారు: బాలెనోకు సరైన పోటీ!

న్యూ-జనరేషన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 రియర్ డిజైన్‌లో స్టైలిష్ టెయిల్ ల్యాంప్ యూనిట్, రెండు టెయిల్ లైట్లను కలుపుతూ మధ్యలో దప్పంగా ఉండే ఎల్ఈడీ స్ట్రిప్ వచ్చింది. స్పోర్టివ్ శైలిని కల్పించే వాలుగా ఉన్న రూఫ్ టాప్, సి-పిల్లర్‌తో పాటు సైడ్ డిజైన్‌లో చివరి డోర్లకు పైభాగంలో పదునైన గ్లాస్ మిర్రర్ సెటప్ వచ్చింది.

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 లాంచ్ ఖరారు: బాలెనోకు సరైన పోటీ!

కొత్త డిజైన్ ద్వారా సరికొత్త హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఇంటీరియర్‌లో విశాలమైన క్యాబిన్ వచ్చింది. ఇంటీరియర్ మొత్తం లగ్జరీ ఫీలింగ్ ఇచ్చే ప్రీమియం ఫినిషింగ్స్ వచ్చాయి. హ్యుందాయ్ క్రెటాలో ఉన్నటువంటి అతి పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌ సిస్టమ్ ఇందులో వస్తోంది.

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 లాంచ్ ఖరారు: బాలెనోకు సరైన పోటీ!

న్యూ జనరేషన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 సాంకేతికంగా నాలుగు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభించనుంది. అందులో, 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ అదే విధంగా 1.0-లీటర్ టుర్భో-ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్. వీటిని మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఛాయిస్‌లో ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
2020 Hyundai i20 Next Gen launch in June – First official teasers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X