Just In
- 1 hr ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 2 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- 3 hrs ago
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- 4 hrs ago
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
Don't Miss
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- News
షాకింగ్: క్షీణించిన శశికళ ఆరోగ్యం -విషమంగా వెంటిలేటర్‌పై చికిత్స -మణిపాల్‌కు తరలింపు
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Movies
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కోడా కరోక్, ఎలా ఉందో చూసారా
దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన స్కోడా ఆటో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తన కొత్త కరోక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త స్కోడా కరోక్ ఎస్యూవీ ధర రూ. 24.99 లక్షలు.

ఇటీవల కంపెనీ ఈ కొత్త స్కోడా కరోక్ ఎస్యూవీ కోసం బుకింగ్ కూడా ప్రారంభించింది. కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీని రూ. 50 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కొత్త స్కోడా కరోక్ ప్రారంభంలో (సిబియు) కంప్లీట్ బిల్ట్ యూనిట్‌గా లభిస్తుంది. కరోనా వైరస్ తగ్గినప్పుడు ఈ స్కోడా కరోక్ ఎస్యూవీ వినియోగదారులకు పంపిణీ చేయబడుతుంది.

కొత్త స్కోడా కరోక్ ఎస్యూవీ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్కోడా కరోక్ ఎస్యూవీ కంపెనీ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది.
MOST READ:బిఎమ్‌డబ్ల్యూ F 900 R & F 900 XR బైక్ టీసర్ వీడియో

ఈ ఎస్యూవీ లోపలి భాగంలో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్ మరియు లెదర్ అప్హోల్స్టరీ సీట్లను కలిగి ఉంది.

కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీలో అనేక ఆధునిక ఫీచర్లు ఉంటాయి. ఈ కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీలో ఎఎఫ్ఎస్ (అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్), సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్, స్క్వేర్ వీల్ ఆర్చ్, ఆర్ 17 అరోనియా డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్ మరియు సి-ఆకారపు ఎల్ఇడి టైల్ లాంప్‌తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంది.
MOST READ:రాళ్ళలో చిక్కుకున్న ఇన్నోవా కారును బయటకు తీసిన మహీంద్రా బొలెరో [వీడియో]

ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 150 బిహెచ్పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డిఎస్జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కి అమర్చబడి ఉంటుంది.

ఈ కొత్త కరోక్ ఎస్‌యూవీకి డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. సమీప భవిష్యత్తులో డీజిల్ వెర్షన్లకు డిమాండ్ పెరిగితే, భవిష్యత్ లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంటుంది.
MOST READ:ఒక రైతు కొడుకు ఇప్పుడు బిలీనియర్.. ఎలానో మీరే చూడండి

కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీలో భద్రత లక్షణాలను గమనించినట్లయితే ఇందులో 9 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇఎస్సి, హిల్-స్టార్ట్ అసిస్ట్ ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లతో ఇబిడి మరియు బ్రేక్ అసిస్ట్ మరియు వెనుక పార్కింగ్ కెమెరా వంటివి ఉంటాయి. కొత్త స్కోడా కరోక్ ఎస్యూవీ భారతీయ మార్కెట్లో ఎంజి హెక్టర్, జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీలకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.