Just In
- 29 min ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్‌లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
భార్యకు రోల్స్ రాయిస్ కారు గిఫ్ట్ గా ఇచ్చిన భర్త
సాధారణంగా మన ప్రియమైనవారు మనకు ఇచ్చే గిఫ్ట్స్ మన హృదయానికి చాలా దగ్గరగా ఉంటాయి. అంతే కాకుండా అవి చాలా ఆనందాన్ని కూడా అందిస్తాయి. చాలామంది తమ బంధువులకు, స్నేహితులకు గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్న వారి పేరు అన్నీ ఫిలిప్.
అన్నీ ఫిలిప్ కు తన భర్త ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు. ఆమె భర్త ఇచ్చిన కారు అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కలినన్. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్ల విభాగంలో ఒకటి.
అన్నీ ఫిలిప్ మరియు ఆమె భర్త కేరళకు చెందినవారు. వారు ప్రస్తుతం కెనడాలోని వాంకోవర్లో నివసిస్తున్నాడు. అన్నీ ఫిలిప్‌కు తెల్ల రోల్స్ రాయిస్ కలినన్ కారు బహుమతిగా ఇచ్చారు. ఈ కారు లోపలి భాగం రెడ్ లెదర్ తో అనుకూలీకరించబడి ఉంటుంది. ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
వారి 25 వ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా అన్నీ ఫిలిప్‌కు ఈ కారు బహుమతిగా ఇవ్వబడింది. ఇతడు ఉత్తర అమెరికాలో రోల్స్ రాయిస్ కలినన్ కలిగి ఉన్న మొదటి భారతీయుడిగా నిలిచారు.
అన్నీ ఫిలిప్ మరియు ఆమె భర్త తమ 25 వ వివాహ వార్షికోత్సవాన్ని గత ఏడాది మార్చి 30 న జరుపుకున్నారు. రోల్స్ రాయిస్ కలినన్ కారు ఆ రోజు దంపతులకు పంపిణీ చేయబడింది. అన్నీ ఫిలిప్ మరియు ఆమె భర్తకు కార్లంటే చాలా ఇష్టం. వారి వద్ద విలాసవంతమైన మరియు ఖరీదైన చాలా కార్లను కలిగి ఉన్నారు.
రోల్స్ రాయిస్ కలినన్ అన్నీ ఫిలిప్ మరియు ఆమె భర్త కలిగి ఉన్న లగ్జరీ కార్లలో ఇది మొదటిది కాదు. కానీ ఇది వారి మొదటి రోల్స్ రాయిస్ కారు. భారతదేశం మరియు కెనడాలో వారికి లగ్జరీ కార్లు పుష్కలంగా ఉన్నాయి.
వారు ఇప్పటికే విలాసవంతమైన 2005 హమ్మర్ హెచ్ 2 కారును కూడా కలిగి ఉన్నారు. అంతే కాకుండా 2016 పోర్స్చే కయెన్ 2019 లెక్సస్ ఎన్ఎక్స్ (ఎఫ్-స్పోర్ట్) కార్లను కలిగి కూడా కలిగి ఉన్నారు.
భారతదేశంలో వీరికి మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 350 ఎస్‌యూవీని కలిగి ఉన్నారు. వారు భారతదేశానికి వచ్చినప్పుడల్లా ఈ కారును ఉపయోగిస్తారు. రోల్స్ రాయిస్ కలినన్ కారులో 6.5-లీటర్ వి 12 ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 560 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
రోల్స్ రాయిస్ కలినన్ కారు ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 6.95 కోట్లు. రోల్స్ రాయిస్ కలినన్ కారు ప్రపంచంలో ఎక్కువగా ధనవంతులు మాత్రమే కలిగి ఉన్నారు.
Image Courtesy: Roshan Philip/Facebook