ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

హోండాకి చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ అక్యురా ఓ కొత్త తరం ఎయిర్‌బ్యాగ్‌లను అభివృద్ధి చేసింది. కారు ప్రమాదాల్లో యాంగిల్డ్ ఫ్రంటర్ కొల్లైజన్ ద్వారా సంభవించే బ్రెయిన్ ట్రౌమా (మెదడు ఇంజురీ)ని తగ్గించేలా, ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి ఫ్రంట్ సీట్ ఎయిర్‌బ్యాగ్‌ను పరిశోధన చేసి, అభివృద్ధి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఎయిర్‌బ్యాగ్ 2021 టిఎల్‌ఎక్స్ స్పోర్ట్ సెడాన్‌లో ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

ఈ సందర్భంగా హోండా ఆర్ అండ్ డి అమెరికాస్ ఎల్.ఎల్.సి. ప్రెసిడెంట్ జిమ్ కెల్లెర్ మాట్లాడుతూ.. "ఈ కొత్త అక్యురా టిఎల్ఎక్స్ ఓహాయోలోని మా సేఫ్టీ ఇంజనీరింగ్ బృందం యొక్క అద్భుతమైన సృష్టి, సురక్షితమైన మరియు ప్రమాదాలు లేని సమాజమే లక్ష్యంగా ముందుకు సాగడానికి ముఖ్యమైన ఆవిష్కరణలను చేయటంలో ఇది తాజా ఉదాహరణ" అని అన్నారు.

ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

"ప్రమాదాల్లో మెదడు గాయానికి సంబంధించిన పరిశోధనను చేయటంలోను మరియు గడచిన దశాబ్దాలలో ఎయిర్‌బ్యాగ్ రూపకల్పనలో మునుపెన్నడూ లేనంత గణనీయమైన పురోగతిని సాధించడంలో మా ఇంజనీర్లు చేసిన కృషికి నాకెంతో గర్వంగా ఉందని" కెల్లర్ చెప్పారు.

ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

టిఎల్‌ఎక్స్ స్పోర్ట్ సెడాన్‌లో కనిపించనున్న ఈ కొత్త ఎయిర్‌బ్యాగ్‌లు మానవ మెదడుకు తీవ్ర నష్టం కలిగించే పార్శ్వ తాకిడి శక్తులను తగ్గించడానికి రూపొందించబడ్డాయి. అదే సాంప్రదాయ ఎయిర్‌బ్యాగ్స్ అయితే, అధిక వేగంతో ప్రయాణిస్తున్న వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణీకుల తల తిప్పడానికి లేదా ఎయిర్‌బ్యాగ్స్ జారిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా తల, మెదడు ప్రాంతంలో తీవ్రమైన గాయాలు సంభవించే ప్రమాదం ఉంది.

ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

అయితే, అక్యురా తయారు చేసిన ఈ కొత్త ఎయిర్‌బ్యాగ్స్‌తో ఈ ప్రమాదాలను నివారించవ్చు. మెదడు గాయాలపై ఓ మైలురాయి అధ్యయనం చేసిన తరువాత ఈ కొత్త ఎయిర్‌బ్యాగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. ఈ ప్రాజెక్టుకు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ శాస్త్రవేత్తలు నాయకత్వం వహించారు. ఫలితంగా వాహన ప్రమాదాల నుండి మెదడు గాయాలను కొలవడానికి బ్రిక్ (బ్రెయిన్ గాయం ప్రమాణం) అనే పద్దతి ఏర్పడింది.

ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

అక్యురా అభివృద్ధి చేసిన ఈ కొత్త ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థలో ఒక ఇన్‌ఫ్లేట్ చేయబడని ప్యానెల్ ఉండి, ప్రమాద సమయాల్లో అది ప్రయాణీకుల తలను పట్టి ఉంచేలా ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బ్యాగ్ విచ్చుకుని ప్రయాణికుడి తలను ఇరువైపుల నుండి ఎయిర్‌బ్యాగ్‌లో ఇమిడేలా చేసి తలకు తగిలే గాయాల నుండి రక్షణ కల్పిస్తుంది.

ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

ఈ కొత్త ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థలో నాలుగు అంశాలు ఉన్నాయి, అవి - ఒక సెంటర్ ఛాంబర్‌తో కూడిన మూడు ఇన్‌ఫ్లేటెడ్ కంపార్ట్‌మెంట్లు, విస్తృత స్థావరాన్ని సృష్టించే రెండు బాహ్య ప్రొజెక్టింగ్ సైడ్ ఛాంబర్లు మరియు రెండు సైడ్ ఛాంబర్‌లను అనుసంధానించడానికి విస్తరించి ఉన్న అన్-ఇన్‌ఫ్లేటెడ్ సెయిల్-ప్యానెల్.

ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

అక్యురా ప్రకటించిన కొత్త 2021 టిఎల్‌ఎక్స్ స్పోర్ట్ సెడాన్‌లో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం మోకాలి రక్షణ కోసం కూడా ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. మోకాలి ఎయిర్‌బ్యాగులు ప్రమాదంలో జరిగినప్పుడు ఫార్వర్డ్ మోషన్‌ను నియంత్రిస్తాయి ఇవి ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు సీట్ బెల్ట్‌లతో సింక్ చేయబడి ఉంటాయి.

ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

ఈ మోకాలి ఎయిర్‌బ్యాగ్‌లను డాష్‌బోర్డ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ క్రింది భాగంలోని ప్యానెల్ క్రింద దాగి ఉంటాయి. ఇవి మోకాళ్ల ఆకృతిలో నిర్మించబడి ఉంటాయి మరియు మంచి లెగ్‌రూమ్‌ని ఆఫర్ చేసేలా డిజైన్ చేయబడి ఉంటాయి.

ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

కొత్త 2021 అక్యురా టిఎల్‌ఎక్స్ స్పోర్ట్ సెడాన్‌లో మొత్తం ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లతో ఆల్-రౌండ్ రక్షణ లభిస్తుంది. వీటిలో ఫ్రంట్, సైడ్ మరియు మోకాలి (డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్) ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటుగా రోల్-ఓవర్ సెన్సార్‌ను కలిగి ఉన్న సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ కూడా ఉంటాయి.

ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

అక్యురా అభివృద్ధి చేసిన సరికొత్త ఎయిర్‌బ్యాగ్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భద్రత విభాగంలో ఇది అద్భుతమైన ఆవిష్కరణ. ప్రమాదాల్లో నష్టాన్ని నివారించడంలో ఎయిర్‌బ్యాగ్‌లు చక్కగా పనిచేస్తాయి. కానీ కొన్ని తీవ్రమైన ప్రమాదాల్లో ఎయిర్‌బ్యాగ్స్ విచ్చుకున్నప్పటికీ ప్రమాదపు తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రయాణీకులకు మరింత భద్రతను కల్పించేలా అక్యురా తయారు చేసిన ఈ ఎయిర్‌బ్యాగ్స్ ఆటోమొబైల్ టెక్నాలజీలో కొత్త పురోగతిగా చెప్పుకోవచ్చు. కుదోస్ అక్యురా!

Most Read Articles

English summary
Honda's luxury vehicle division, Acura, has researched, developed, and is ready to launch the world's first front seat airbag that is said to reduce brain trauma caused by angled frontal collisions. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X