పండుగ సీజన్‌లో విడుదల కానున్న సరికొత్త 2020 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఫోర్స్ మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న గూర్ఖా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలో ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ఫోర్స్ మోటార్స్ ప్రదర్శించిన సరికొత్త 2020 మోడల్ ఫోర్స్ గుర్ఖాను కంపెనీ ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

పండుగ సీజన్‌లో విడుదల కానున్న సరికొత్త 2020 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

వాస్తవానికి ఇప్పటికే ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉండగా, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి మరియు లాక్‌డౌన్‌ల కారణంగా ఈ మోడల్ విడుదల ఆలస్యమైంది. కాగా, తాజాగా ఆటోకార్ ఇండియా నుండి వచ్చిన రిపోర్ట్ ప్రకారం, సరికొత్త ఫోర్స్ గూర్ఖా అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ఆరంభంలో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఫోర్స్ మోటార్స్ ఇప్పటికే తమ గుర్ఖా ఎస్‌యూవీని దేశీయ రోడ్లపై విస్తృతంగా టెస్ట్ చేస్తోంది.

పండుగ సీజన్‌లో విడుదల కానున్న సరికొత్త 2020 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో ఫోర్స్ మోటార్స్ ప్రదర్శించిన నెక్స్ట్-జెనరేషన్ ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీ మునుపటి తరం మోడల్‌తో పోల్చుకుంటే అనేక కొత్త మార్పులు చేర్పులతో తయారైంది. ఎక్స్‌టీరియర్‌లోని మార్పులను గమనిస్తే, ఆఫ్-రోడింగ్‌లో నీటి ప్రవాహాన్ని తట్టుకునేందుకు ముందు భాగంలో ఏర్పాటు చేసిన పెద్ద స్నార్కెల్ ఎయిర్ ఇన్‌టేక్, కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లు మరియు రెండు బంపర్లు, ఎస్‌యువి చుట్టూ చంకీ బాడీ క్లాడింగ్ మరియు స్కర్ట్‌లు, కొత్త 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, 245/70 టైర్ ప్రొఫైల్స్ వంటి మార్పులు ఉన్నాయి.

MOST READ: 2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

పండుగ సీజన్‌లో విడుదల కానున్న సరికొత్త 2020 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, మోడ్రన్ టెక్ ఫీచర్లతో ఈ ఆఫ్-రోడర్ భారీగా అప్‌గ్రేడ్ చేశారు. కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన అధునాతన డ్యాష్‌బోర్డ్ డిజైన్, ఎమ్ఐడి డిస్‌ప్లే, రెండవ వరుసలో వ్యక్తిగత సీట్లు, కొత్తగా రూపొందించిన గుండ్రటి ఎయిర్ వెంట్స్ ఉంటాయి. ఈ ఫీచర్లతో అప్‌డేట్ అయిన ఇంటీరియర్స్ ఇప్పుడు మరింత తాజాగా అనిపిస్తాయి మరియు ఆహ్లాదకరమైన క్యాబిన్ అనుభూతిని కలిగిస్తాయి.

పండుగ సీజన్‌లో విడుదల కానున్న సరికొత్త 2020 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

సరికొత్త తరం 2020 ఫోర్స్ గూర్ఖాలో భద్రతా ఫీచర్లను కూడా పెంచారు. మునుపటి తరం మోడల్‌తో పోలిస్తే ఇది ఇప్పుడు చాలా సురక్షితంగా ఉంటుంది. ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ ఇప్పుడు అక్టోబర్ 2019 నుండి అమల్లోకి వచ్చిన కొత్త భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. కొత్త గూర్ఖా యొక్క షాషీ మరియు బాడీషెల్ యజమానులకు మరింత రక్షణ కల్పించడానికి భారీగా అప్‌గ్రేడ్ చేయబడినట్లు తెలుస్తోంది.

MOST READ: మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

పండుగ సీజన్‌లో విడుదల కానున్న సరికొత్త 2020 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త గూర్ఖా బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన అదే 2.6-లీటర్ డీజిల్ ఇంజన్‌ను బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించారు. ఇందులోని 2.6 లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.

MOST READ: అకడమిక్ సిలబస్ లో చేరనున్న ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ; ఎక్కడో తెలుసా ?

పండుగ సీజన్‌లో విడుదల కానున్న సరికొత్త 2020 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ

కొత్త తరం 2020 ఫోర్స్ గుర్ఖాపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త తరం ఫోర్స్ గూర్ఖా మునపటి మోడళ్ల కన్నా ఖచ్చితంగా అద్భుతంగా ఉందని చెప్పాలి. కొత్త 2020 ఫోర్స్ గూర్ఖా మోడల్ భారత్ మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లో త్వరలో విడుదల కానున్న నెక్స్ట్ జనరేషన్ 2020 మహీంద్రా థార్‌కు ప్రత్యక్ష పోటీ ఇవ్వనుంది. ఈ రెండు మోడళ్లకు పోటీగా మారుతి సుజుకి కూడా తమ సరికొత్త జిమ్నీ ఆఫ్-రోడర్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

Most Read Articles

English summary
Force Motors is getting ready to introduce the new Gurkha off-road SUV in the Indian market. The company has also showcased the new upcoming SUV at the 2020 Auto Expo. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X