కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ స్టేటస్ ఏంటి? వెయిటింగ్ పీరియడ్ ఎంత?

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త 2020 హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఈ మోడల్ కోసం ఇప్పటికే భారీ సంఖ్యలో బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితంగా దీని వెయిటింగ్ పీరియడ్ కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ స్టేటస్ ఏంటి? వెయిటింగ్ పీరియడ్ ఎంత?

సరికొత్త 2020 హ్యుందాయ్ ఐ20 కోసం అక్టోబర్ 28, 2020వ తేదీ నుండి అధికారికంగా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ మోడల్ విడుదల సమయం నాటికే 10,000కి పైగా ప్రీ-బుకింగ్స్ వచ్చాయి. నవంబర్ 5, 2020వ తేదీన కంపెనీ ఈ మోడల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మోడల్‌కి 25,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ స్టేటస్ ఏంటి? వెయిటింగ్ పీరియడ్ ఎంత?

మూడవ తరానికి చెందిన హ్యుందాయ్ ఐ20 కారుని కంపెనీ పూర్తిగా సరికొత్త స్టైలింగ్‌తో దాని సరికొత్త గ్లోబల్ డిజైన్ ఫిలాసఫీకి అనుగుణంగా డిజైన్ చేసింది. ఇది మునుపటి కన్నా మరింత స్టైలిష్‌గా, ప్రీమియంగా మరియు స్పోర్టీగా కనిపిస్తుంది. ఇందులోని విశిష్టమైన ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

MOST READ:నవంబర్ అమ్మకాల నివేదికను రిలీజ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్, చూసారా !

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ స్టేటస్ ఏంటి? వెయిటింగ్ పీరియడ్ ఎంత?

కొత్త హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా మరియు ఆస్టా (ఓ) అనే నాలుగు వేరియంట్లలో విడుదల చేశారు. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.6.79 లక్షల నుండి రూ.11.17 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి. ఇటీవలి పండుగ సీజన్‌లో హ్యుందాయ్ ఐ20 అమ్మకాలు జోరుగా సాగాయి. గత నెల వరకు 4000 యూనిట్లను డెలివరీ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ స్టేటస్ ఏంటి? వెయిటింగ్ పీరియడ్ ఎంత?

హ్యుందాయ్ ఐ20 కారుని కొనుగోలు చేసే కస్టమర్లలో ఎక్కువగా హై-ఎండ్ వేరియంట్లను ఎంచుకుంటున్నారని, 45 శాతం మంది కస్టమర్లు బ్లూలింక్ కనెక్టివిటీ టెక్నాలజీతో వేరియంట్‌లను ఎంచుకుంటున్నారని కంపెనీ తెలిపింది. కొత్తగా ఈ కారును బుక్ చేసుకోవాలనుకునే వారు రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు.

MOST READ:గ్రీన్ ఎన్‌సిఎపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ : వివరాలు

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ స్టేటస్ ఏంటి? వెయిటింగ్ పీరియడ్ ఎంత?

కొత్త హ్యుందాయ్ ఐ20 రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ ఇంజన్లలో 1.2-లీటర్ యూనిట్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో 83 బిహెచ్‌పి పవర్‌ను మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 88 బిహెచ్‌పి పవర్‌ను మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి పవర్‌ను మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ స్టేటస్ ఏంటి? వెయిటింగ్ పీరియడ్ ఎంత?

ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ సివిటి ఆప్షన్‌తో లభిస్తుంది. అదేవిధంగా, ఇందులోని 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి లేదా 6-స్పీడ్ ఐఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇకపోతే, కొత్త హ్యుందాయ్ ఐ20 డీజిల్ వెర్షన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:టీవీఎస్ కంపెనీ అమ్మకాల హవా.. భారీగా పెరిగిన నవంబర్ సేల్స్, ఎంతో తెలుసా ?

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ స్టేటస్ ఏంటి? వెయిటింగ్ పీరియడ్ ఎంత?

కొత్త 2020 హ్యుందాయ్ ఐ20ని ఎక్స్‌టీరియర్స్ మరియు ఇంటీరియర్స్‌లో పూర్తిగా రీడిజైన్ చేశారు. ఈ కారు ముందు భాగంలో పెద్ద క్యాస్కేడింగ్ గ్రిల్, షార్ప్‌గా కనిపించే ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, జెడ్ ఆకారంలో ఉండే ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఫ్రంట్ బంపర్‌పై త్రిభుజాకార ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ డిజైన్ మరియు డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ స్టేటస్ ఏంటి? వెయిటింగ్ పీరియడ్ ఎంత?

ఇంటీరియర్స్‌లో కూడా అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పూర్తిగా సరికొత్త డిజైన్‌తో కూడిన డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ లేఅవుట్ కనిపిస్తుంది. ఇందులో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్పోర్టి స్టీరింగ్ వీల్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ యొక్క బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ స్పీకర్లు, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:ఫోక్స్‌వ్యాగన్ కస్టమర్ టచ్ పాయింట్ ఇప్పుడు మన హైదరాబాద్‌లో కూడా.. ఎక్కడో తెలుసా?

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ స్టేటస్ ఏంటి? వెయిటింగ్ పీరియడ్ ఎంత?

కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ మైలురాయిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే కొత్త హ్యుందాయ్ ఐ20 రాకతో కంపెనీ అమ్మకాలు జోరందుకున్నాయి. గత నెలలో హ్యుందాయ్ మొత్తం 59,200 యూనిట్లను విక్రయించగా ఇందులో 48,000 యూనిట్లను దేశీయ మార్కెట్లో మరియు 10,400 యూనిట్లను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించారు. కాగా, కొత్త తరం హ్యుందాయ్ ఐ20 మార్కెట్లో ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి ప్రీమియం మోడళ్లకు పోటీగా ఉంటుంది.

Most Read Articles

English summary
South Korean carmaker Hyundai has announced that its all-new 2020 i20 premium hatchback received more than 25,000 since its launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X