జులై 14న హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ విడుదల - వివరాలు

కొరియన్ కార్ బ్రాండ్, హ్యుందాయ్ ఇండియా భారత మార్కెట్లో మరో సరికొత్త ప్రీమియం కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ అందిస్తున్న టక్సన్ ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ నెల 14న మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ తమ సరికొత్త 2020 'హ్యుందాయ్ టక్సన్'కు సంబంధించి ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది.

జులై 14న హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ విడుదల - వివరాలు

ఈ టీజర్ వీడియోలో కొత్త 2020 హ్యుందాయ్ టక్సన్ విడుదల తేదీని మరియు సమయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 సంక్షోభం కారణంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారానే ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నారు. వాస్తవానికి కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ కమ్యూనికేషన్ విభాగంలో ఓ సరికొత్త విప్లవమే ప్రారంభమైందని చెప్పాలి. చాలా మంది ఆటోమొబైల్ కంపెనీలు ఈ వేదికగా ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి.

టీజర్ వీడియో ప్రకారం, హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని జూలై 14, 2020 న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికే ఈ కొత్త మోడల్ డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంటోంది.

MOST READ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన కొత్త హెలికాఫ్టర్లు ఇవే

జులై 14న హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ విడుదల - వివరాలు

హ్యుందాయ్ తమ అప్‌డేటెడ్ టక్సన్ ఎస్‌యూవీని ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఈ కొత్త మోడల్‌‌లో రీడిడైన్ చేసిన హెడ్‌లైట్స్, టెయిల్-లైట్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, కొత్త క్యాస్కేడింగ్ గ్రిల్ వంటి డిజైన్ ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ టక్సన్ ఓవరాల్ సిల్హౌట్‌ను మాత్రం అలానే ఉంచారు. కొత్త మార్పులతో ఈ మోడల్ మునుపటి మోడల్ కన్నా మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

జులై 14న హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ విడుదల - వివరాలు

ఇంటీరియర్స్‌లో చేసిన మార్పుల విషయానికి వల్తే, ఇందులో 8 ఇంచ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన కొత్త డాష్‌బోర్డ్ డిజైన్‌ ఉంటుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ యొక్క ‘బ్లూలింక్' కనెక్ట్-కార్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది.

MOST READ: 2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

జులై 14న హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ విడుదల - వివరాలు

ఇందులో మరింత మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అసిస్టెడ్ వాయిస్ కమాండ్స్ ఉంటాయి. వైర్‌లెస్ ఛార్జర్‌, పానోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ ఫ్రంట్-ప్యాసింజర్ సీట్ అడ్జస్ట్‌మెంట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో ఎకో, స్మార్ట్, ప్రో అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు కూడా ఉంటాయి.

జులై 14న హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ విడుదల - వివరాలు

ఎస్‌యూవీలోని భద్రతా ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ డీసెంట్ కంట్రోల్, హిల్ అసిస్ట్, పడల్ లాంప్స్ , కార్నరింగ్ లాంప్స్, పవర్డ్ టెయిల్‌గేట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ స్థాయిని బట్టి ఫీచర్లు మారుతూ ఉంటాయి.

MOST READ: అకడమిక్ సిలబస్ లో చేరనున్న ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ; ఎక్కడో తెలుసా ?

జులై 14న హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ విడుదల - వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2020 హ్యుందాయ్ టక్సన్‌లో ఇదివరకటి ఇంజన్‌నే బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించనున్నారు. ఇది 2.0 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ ఇంజన్ 149 బిహెచ్‌పి మరియు 192 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

జులై 14న హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ విడుదల - వివరాలు

ఇకపోతే, 2.0 లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ 181 బిహెచ్‌పి శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇంజన్ నుంచి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయటంలో ఈ గేర్‌బాక్స్ సహకరిస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్నాయి, వీటిలో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉండబోదని సమాచారం.

MOST READ: మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

జులై 14న హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ విడుదల - వివరాలు

ధర విషయానికి వస్తే, ఇదివరకు మార్కెట్లో విక్రయించిన బిఎస్4 హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ ధరలు రూ.19.0 లక్షల నుండి రూ.27.0 లక్షల మధ్యలో ఉండేవి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కొత్త 2020 టక్సన్ బిఎస్6 మోడల్‌లో చేసిన మార్పుల చేర్పుల కారణంగా దీని ధర ఇదివరకటి కన్నా కాస్తంత ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

జులై 14న హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ విడుదల - వివరాలు

కోత్త 2020 హ్యుందాయ్ టక్సన్ టీజర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ బ్రాండ్‌కి టక్సన్ ప్రధానమైన మోడల్‌గా ఉంది, ఇది చాలా కాలంగా భారత మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఈ సెగ్మెంట్లోని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వటానికి హ్యుందాయ్ తమ టక్సన్ ఎస్‌యూవీకి చాలా అవసరమైన మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఈ సెగ్మెంట్లోని జీప్ కంపాస్, హోండా సిఆర్-వి, స్కోడా కరోక్, త్వరోలో రానున్న సిట్రాన్ సి 5 ఎయిర్‌క్రాస్ మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Hyundai India is gearing up to launch its flagship model for the market, the Tucson facelift SUV. Ahead of its arrival, the automaker has released a new teaser video which reveals the SUV to be next in line for the launch. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X