సరికొత్త హ్యుందాయ్ వెర్నా మైలేజ్ ఎంత? - అన్ని వేరియంట్ల మైలేజ్ వివరాలు

'హ్యుందాయ్ ఇండియా' అందిస్తున్న వెర్నా సెడాన్‌లో కంపెనీ ఓ సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త 2020 'హ్యుందాయ్ వెర్నా' ఫేస్‌లిఫ్ట్ మోడల్ మొత్తం ఐదు వేరియంట్లలో (ఎస్, ఎస్+, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) మరియు ఎస్ఎక్స్ (ఓ) టర్బో) లభ్యం అవుతోంది. భారత మార్కెట్లో ఈ ప్రీమియం సెడాన్ ప్రారంభ వేరియంట్ ధర రూ .9.30 లక్షలుగా ఉండే, టాప్-ఎండ్ వేరియంట్ కోసం రూ. 13.99 లక్షలుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

సరికొత్త హ్యుందాయ్ వెర్నా మైలేజ్ ఎంత? - అన్ని వేరియంట్ల మైలేజ్ వివరాలు

ఈ బిఎస్6 వెర్షన్ హ్యుందాయ్ వెర్నా సెడాన్‌కి సంబంధించిన మైలేజ్ వివరాలను కంపెనీ వెల్లడి చేసింది. ఇంజన్ రకాన్ని బట్టి హ్యుందాయ్ వెర్నా అన్ని వేరియంట్ల మైలేజ్ వివరాలు ఇలా ఉన్నాయి.

సరికొత్త హ్యుందాయ్ వెర్నా మైలేజ్ ఎంత? - అన్ని వేరియంట్ల మైలేజ్ వివరాలు

ముందుగా పెట్రోల్ ఇంజన్‌లను గమనిస్తే, ఈ కారులో ఉపయోగించిన 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్ లీటరుకు 17.7 కి.మీ. మైలేజీని అందిస్తుంది. ఇకపోతే సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ లీటరుకు 18.45 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇకపోతే ఇందులోని 1.0 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డిసిటి)తో వస్తుంది, ఇది లీటరుకు 19.2 కి.మీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

MOST READ: కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

సరికొత్త హ్యుందాయ్ వెర్నా మైలేజ్ ఎంత? - అన్ని వేరియంట్ల మైలేజ్ వివరాలు

ఇక డీజిల్ ఇంజన్‌ల విషయానికి వస్తే, ఇందులోని 1.4-లీటర్, 4-సిలిండర్ ఇంజన్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 21.3 కి.మీ. మైలేజీని అందిస్తుంది. ఇకపోతే ఇందులోని మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ అత్యధికంగా లీటరుకు 25 కి.మీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

సరికొత్త హ్యుందాయ్ వెర్నా మైలేజ్ ఎంత? - అన్ని వేరియంట్ల మైలేజ్ వివరాలు

ఇంజన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 115bhp శక్తిని మరియు 144Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది, 1.4-లీటర్ డీజిల్ 115bhp శక్తిని మరియు 250Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇందులోని 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 120bhp శక్తిని మరియు 170Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: టాటా నెక్సాన్ ఆక్సిడెంట్ : ఎగిరి బయట పడ్డ ఇంజిన్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

సరికొత్త హ్యుందాయ్ వెర్నా మైలేజ్ ఎంత? - అన్ని వేరియంట్ల మైలేజ్ వివరాలు

హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఎక్స్‌టీరియర్‌ను గమనిస్తే, ముందు భాగంలో పెద్ద గ్రిల్, ఇరువైపులా సన్నటి ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్, బంపర్స్ మరియు బూట్ లిడ్‌లో మార్పులు ఉన్నాయి. ఈ కారు మొత్తం ఆరు రంగుల్లో లభిస్తుంది. అవి - ఫైరీ రెడ్, టైటాన్ గ్రే, స్టారీ నైట్, టైఫూన్ సిల్వర్, పోలార్ వైట్ మరియు ఫాంటమ్ బ్లాక్.

సరికొత్త హ్యుందాయ్ వెర్నా మైలేజ్ ఎంత? - అన్ని వేరియంట్ల మైలేజ్ వివరాలు

కారు ఇంటీరియర్‌లను గమనిస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు హ్యుందాయ్ బ్రాండ్ స్వంత కనెక్టింగ్ టెక్నాలజీ అయిన 'బ్లూ లింక్' టెక్నాలజీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్‌తో పాటుగా అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.

MOST READ: కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

సరికొత్త హ్యుందాయ్ వెర్నా మైలేజ్ ఎంత? - అన్ని వేరియంట్ల మైలేజ్ వివరాలు

కొత్త హ్యుందాయ్ వెర్నా మైలేజ్ సంఖ్యలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా ఖచ్చితంగా మునపటి వెర్షన్ల కన్నా మరింత అద్భుతంగా కనిపిస్తుంది మరియు ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో వస్తుంది. హ్యుందాయ్ ప్రకటించిన పెట్రోల్ వేరియంట్ మైలేజ్ ఈ సెగ్మెంట్లోనే బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. కొత్త వెర్నా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై హ్యుందాయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది.

Most Read Articles

English summary
Hyundai India launched the Verna facelift in the Indian market in a range of five variants - S, S+, SX, SX(O) and SX(O) Turbo. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X