సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియో లాంచ్; ఆగస్ట్ 15న విడుదల

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా తమ సరికొత్త ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ 2020 థార్‌ను ఆగస్ట్ 15న భారత మార్కెట్లో ఆవిష్కరించనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కంపెనీ సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియోను విడుదల చేసింది. సరికొత్త టెక్నాలజీ, కంఫర్ట్ మరియు సేఫ్టీ ఫీచర్లలో ఫుల్లీ లోడెడ్ ఆఫ్-రోడర్‌గా ఇది మార్కెట్లోకి రాబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియో లాంచ్; ఆగస్ట్ 15న విడుదల

పూర్తిగా సరికొత్తగా పునర్జన్మ ఎత్తనున్న మహీంద్రా థార్ దాని సాటిలేని ఆఫ్-రోడ్ సామర్ధ్యం మరియు ఐకానిక్ జీప్ డిజైన్ వంటి ప్రధాన సామర్థ్యాలపై ఏ విషయంలోనూ రాజీపడదని కంపెనీ పేర్కొంది. కొత్త తరం థార్ ఔత్సాహికులను ఆకర్షించడమే కాకుండా, సమకాలీన ఎస్‌యూవీ కోసం వెతుకుతున్న కొనుగోలుదారులను కూడా ఆకర్షిస్తుందని మహీంద్రా తెలిపింది.

సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియో లాంచ్; ఆగస్ట్ 15న విడుదల

కొత్త తరం మహీంద్రా థార్‌ను కేవలం ఆఫ్-రోడింగ్ కోసమే కాకుండా, ప్రతిరోజూ ఉపయోగించుకునేలా అన్ని ఫీచర్లతో వస్తుందని వివరించింది. కొత్త 2020 థార్ ఏడు దశాబ్దాలుగా విస్తరించి ఉన్న బ్రాండ్ యొక్క ‘మహీంద్రా క్లాసిక్స్’ జీప్ వారసత్వాన్ని కూడా కలిగి ఉంటుంది.

ఆఫ్-రోడ్ అనుభవాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఈ కొత్త-తరం ఎస్‌యూవీ సిద్ధంగా ఉందని మహీంద్రా తెలిపింది. మహీంద్రా థార్‌ను తొలిసారిగా భారతదేశంలో 2010 లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ మోడల్‌లో ఇప్పుడు తాజాగా సరికొత్త అప్‌డేట్‌లతో, అధునాతన ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది.

సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియో లాంచ్; ఆగస్ట్ 15న విడుదల

కొత్త తరం మహీంద్రా థార్‌ను ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్‌లో ఆవిష్కరించనున్నారు. అయితే, ఈ ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా నిర్వహించనున్నారు. దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి విజృంభన దృష్ట్యా సామాజిక దూరాన్ని పాటించాలనే ఉద్యేశ్యంతో మహీంద్రా ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియో లాంచ్; ఆగస్ట్ 15న విడుదల

కాగా, విడుదలకు ముందే కొత్త 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీలోని కొన్ని కీలక ఫీచర్లు వెల్లడయ్యాయి. ఇందులో పెద్ద వెర్టికల్ స్లాట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు మరియు రెండు చివర్లలో రీడిజైన్ చేసిన బంపర్‌లతో కూడిన సరికొత్త ఫ్రంట్ ఫాసియా కలిగి ఉండనుంది. ఇంకా ఇందులో ఆప్షనల్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండొచ్చని సమాచారం.

సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియో లాంచ్; ఆగస్ట్ 15న విడుదల

గతంలో వెల్లడైన స్పై చిత్రాల ప్రకారం, ఈ సరికొత్త మోడల్‌లో 255/65 ఆర్18 ప్రొఫైల్‌తో తయారు చేసిన కొత్త సియట్ ఆల్-టెర్రైన్ టైర్లను ఉపయోగించారు. ఈ టైర్లను 18 ఇంచ్, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై అమర్చారు. స్పేర్ వీల్‌ను పూర్తి అల్లాయ్ వీల్‌తోనే ఆఫర్ చేయనున్నారు. ఈ స్పేర్ వీల్‌ను బూట్ డోర్‌కు అమర్చబడి ఉండనుంది.

సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియో లాంచ్; ఆగస్ట్ 15న విడుదల

కొత్త థార్ ఇంటీరియర్‌లో లోపలి వైపు కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఇందులో ప్రధానంగా ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను సపోర్ట్ చేసే కొత్త ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎమ్‌ఐడికి ఇరువైపులా అనలాగ్ డయల్‌లతో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా.

సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియో లాంచ్; ఆగస్ట్ 15న విడుదల

ఇంకా ఇందులో మెరుగైన కంఫర్ట్ కోసం స్టీరింగ్ వీల్‌పై క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆడియో కంట్రోల్స్ ఉండే అవకాశం ఉంది. ఫార్వర్డ్ ఫేసింగ్ రియర్ సీట్స్, ఫోల్డబిల్ కీ ఫాబ్, మెరుగైన క్రాష్ ప్రొటెక్షన్ మరియు పాదచారుల భద్రత వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం. ఏబిఎస్, సీట్-బెల్ట్ రిమైండర్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లను ఇందులో స్టాండర్డ్‌గా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియో లాంచ్; ఆగస్ట్ 15న విడుదల

కొత్త తరం 2020 మహీంద్రా థార్ డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో సరికొత్త 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే కొత్త 2.0-లీటర్ 'టిజిడిఐ ఎమ్‌స్టాలియన్' టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 180 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియో లాంచ్; ఆగస్ట్ 15న విడుదల

ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్నాయి. కొత్త తరం ఆఫ్-రోడర్‌ను ఆప్షనల్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ ఇదివరకే ధృవీకరించిన సంగతి తెలిసినదే.

సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియో లాంచ్; ఆగస్ట్ 15న విడుదల

కొత్త తరం మహీంద్రా థార్ ఆవిష్కరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైన నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా థార్ ఆవిష్కరణ, ఇప్పుడు అనుకున్న షెడ్యూల్ కన్నా ముందే జరగనుంది. కొత్త 2020 థార్ మునుపటి తరం మోడల్ కంటే మరింత డిజైన్, ఫీచర్స్, టెక్నాలజీ పరంగా మరింత మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ పవర్ట్రెయిన్ ఆప్షన్లను కూడా కలిగి ఉంటుంది కాబట్టి అన్ని వర్గాల కస్టమర్లను ఇది ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
The 2020 Mahindra Thar SUV will be unveiled on the Indian Independence Day. Ahead of its unveiling, the company has launched a new teaser video confirming the news of the off-roader's arrival in the market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X