సరికొత్త 2020 మారుతి సుజుకి సెలెరియో రాబోతుందా? - ఇది అదేనా?

దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ కార్లలో ఒకటైన 'సెలెరియో' మోడల్‌లో కంపెనీ ఓ సరికొత్త 2020 వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సరికొత్త 2020 మారుతి సుజుకి సెలెరియో రాబోతుందా? - ఇది అదేనా?

మారుతి సుజుకి 2015లో తొలిసారిగా సెలెరియో కారును భారత్‌లో విడుదల చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ప్రీమియం స్టైల్, ఫీచర్లతో ఇది ఆల్టో కస్టమర్లకు మంచి అప్‌గ్రేడ్ ఆప్షన్‌గా నిలిచింది.

సరికొత్త 2020 మారుతి సుజుకి సెలెరియో రాబోతుందా? - ఇది అదేనా?

మారుతి సుజుకి సెలెరియో కారులో డిజైన్ పరంగా గడచిన ఐదేళ్లుగా ఇందులో ఎలాంటి మేజర్ అప్‌గ్రేడ్ రాలేదు. ఇందులో ఓ కొత్త తరం మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నామని కంపెనీ గతేడాది ఓ సందర్భంలో ప్రకటించింది. ఈ వార్తను నిజం చేస్తూ, తాజాగా కొత్త తరం సెలెరియో టెస్టింగ్ చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

సరికొత్త 2020 మారుతి సుజుకి సెలెరియో రాబోతుందా? - ఇది అదేనా?

మోటర్‌ఆక్టేన్ విడుదల చేసిన చిత్రాల ప్రకారం, హర్యానా టెస్టింగ్ నెంబర్ ప్లేట్‌తో కొత్త తరం మారుతి సెలెరియోను భారత రోడ్లపై పరీక్షిస్తుండటాన్ని మనం గమనించవచ్చు. కొత్త 2020 సెలెరియో కారును భారీగా క్యామోఫ్లేజ్ చేసి టెస్టింగ్ చేస్తుండటాన్ని ఈ స్పై చిత్రాల్లో చూడొచ్చు, వీటిలో కారు డిజైన్ కొంచమే తెలుస్తోంది.

సరికొత్త 2020 మారుతి సుజుకి సెలెరియో రాబోతుందా? - ఇది అదేనా?

నెక్స్ట్ జనరేషన్ మారుతి సెలెరియో కారులో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, కొత్త గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్స్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మునుపటి తరం మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త కారు కొంచెం ఎత్తుగా కనిపిస్తోంది.

సరికొత్త 2020 మారుతి సుజుకి సెలెరియో రాబోతుందా? - ఇది అదేనా?

ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్ మరియు బాలెనో వంటి కార్లలో ఉపయోగిస్తున్న ఫ్రేమ్‌ను కొత్త తరం సెలెరియోలో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. టాప్ స్పెక్ వేరియంట్లలో ఎల్ఈడి లైట్స్ మిడ్ వేరియంట్లలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, బేస్ వేరియంట్లలో ట్రెడిషనల్ హ్యాలోజెన్ ల్యాంప్స్ ఉండొచ్చని అంచనా.

సరికొత్త 2020 మారుతి సుజుకి సెలెరియో రాబోతుందా? - ఇది అదేనా?

ఇంటీరియర్స్‌లో కూడా మేజర్ చేంజెస్ ఉండే అవకాశం ఉంది. ఇందులో వ్యాగన్ఆర్ కారులో ఆఫర్ చేస్తున్న విధంగా ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను సపోర్ట్ చేసే ప్రీమియం ఆడియో సిస్టమ్, కొత్త డిజైన్‌తో కూడిన ఫాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ, ఆటోమేటిక్ ఏసి, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి కంఫర్ట్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

సరికొత్త 2020 మారుతి సుజుకి సెలెరియో రాబోతుందా? - ఇది అదేనా?

సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, స్పీడ్ సెన్సార్, ఏబిఎస్, ఈబిడి వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కొత్త సెలెరియో ఇంజన్ ఆప్షన్స్ గురించి ఎటువంటి సమాచారం లేదు.

సరికొత్త 2020 మారుతి సుజుకి సెలెరియో రాబోతుందా? - ఇది అదేనా?

అయితే, ప్రస్తుత తరం సెలెరియోలో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ బిఎస్6 ఇంజన్‌నే కొత్త తరం సెలెరియోలోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఈ బిఎస్6 ఇంజన్ 66 బిహెచ్‌పి శక్తిని మరియు 90 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

సరికొత్త 2020 మారుతి సుజుకి సెలెరియో రాబోతుందా? - ఇది అదేనా?

మారుతి సుజుకి ఇండియాకు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ తమ కొత్త '2020 ఎస్-క్రాస్'ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కారు డీలర్‌షిప్ కేంద్రాలను చేరుకుంటోంది. ఆగస్ట్ 5న ఈ కారు మార్కెట్లో విడుదల కానుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

సరికొత్త 2020 మారుతి సుజుకి సెలెరియో రాబోతుందా? - ఇది అదేనా?

సరికొత్త తరం మారుతి సుజుకి సెలెరియోపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19 వ్యాప్తి తర్వాత కస్టమర్లు వ్యక్తిగత రవాణా కోసం కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం చిన్న కార్లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి సరైన సమయంలోనే సరికొత్త తరం సెలెరియోను విడుదల చేస్తోందనేది మా అభిప్రాయం. కొత్త సెలెరియో ధర రూ.4.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లోని టాటా టియాగో, రెనాల్ట్ క్విడ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source:Motoroctane

Most Read Articles

English summary
As seen in the images captured by Motoroctane, the Maruti Celerio has been spotted testing for the first time on the Indian road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X