త్వరపడండి.. 2020 ఆడి ఎ 8 ఎల్ కారు మార్కెట్లోకి వచ్చేసింది

భారతదేశంలో లగ్జరీ కార్ల తయారీ విభాగంలో ఆడి ఒకటి. ఆడి సంస్థ నుండి వచ్చిన వాహనాలు ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2020 ఆడి ఎ 8 ఎల్ వాహనాన్ని విపణిలోకి విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

త్వరపడండి.. 2020 ఆడి ఎ 8 ఎల్ కారు మార్కెట్లోకి వచ్చేసింది

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి కంపెనీ ఇప్పుడు 2020 ఆడి ఎ 8 ఎల్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఇది ఆడి కంపెనీ యొక్క మూడవ బిఎస్ 6-కంప్లైంట్ వాహనం.

త్వరపడండి.. 2020 ఆడి ఎ 8 ఎల్ కారు మార్కెట్లోకి వచ్చేసింది

ఆడి ఎ 8 ఎల్‌ రూ. 1.56 కోట్ల (ఎక్స్‌షోరూమ్, ఇండియా) ధరతో విడుదల చేసింది. ఆడి ఎ 8 ఎల్‌ మునుపటి వాహనాలకంటే కొంత మెరుగైనదిగా ఉంటుంది. విలాసవంతమైన లక్షణాలతోపాటు, అనుకూలీకరించిన ఎపికలను కలిగి ఉంటుంది. ఇవి వాహనదారునికి అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా కలిగిస్తుంది.

త్వరపడండి.. 2020 ఆడి ఎ 8 ఎల్ కారు మార్కెట్లోకి వచ్చేసింది

2020 ఆడి ఎ 8 ఎల్‌లో 48 వి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన వి 6, 3.0 లీటర్ టిఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. మోటారు 340 హెచ్‌పి మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అంటే కాకుండా ఇది 8 దశల టిప్ట్రోనిక్ ట్రాన్స్మిషన్ మరియు ప్రామాణిక క్వాట్రో శాశ్వత AWD వ్యవస్థతో అందించబడుతుంది. ఆడి ఎ 8 ఎల్‌ 0 నుంచి 100 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5.7 సెకన్లలో చేరుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

త్వరపడండి.. 2020 ఆడి ఎ 8 ఎల్ కారు మార్కెట్లోకి వచ్చేసింది

ఆడి ఎ 8 ఎల్‌ మునుపటి మోడల్ వాహనాలకంటే దృడంగా ఉంటుంది, ఎందుకంటే ఇది 58 శాతం అల్యూమినియం భాగాలను కలిగి ఉంటుంది. ఇందులో లేజర్ లైట్‌తో సహా హెచ్‌డి మ్యాట్రిక్స్ ఎల్‌ఇడి హెడ్‌లైట్లు ఉన్నాయి. టైల్లైట్స్ ఓఎల్ఇడి టెక్నాలజీని ఉపయోగించుకుంటాయి. ఆడి ఎ 8 ఎల్‌ కారు యొక్క కొలతను గమనించినట్లయితే ఇది 5.3 మీటర్ల పొడవు, 1.95 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది.

త్వరపడండి.. 2020 ఆడి ఎ 8 ఎల్ కారు మార్కెట్లోకి వచ్చేసింది

2020 ఆడి ఎ 8 ఎల్ లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. చాలా విశాలంగా ఉండే క్యాబిన్, ఐదు టచ్ టచ్‌స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, సెంటర్ కన్సోల్‌లో టచ్‌స్క్రీన్ డిస్ప్లే వంటి వాటితో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం వెనుక సీట్లలో రెండు ట్యాబ్లేట్లను కూడా అమర్చడం జరిగింది.

త్వరపడండి.. 2020 ఆడి ఎ 8 ఎల్ కారు మార్కెట్లోకి వచ్చేసింది

ఇవే కాకుండా మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్, రియర్ మ్యాట్రిక్స్ ఎల్ఈడి రీడింగ్ లైట్స్, ఎలక్ట్రికల్లీ హైట్ అడ్జస్టబుల్ కంఫర్ట్ హెడ్ రెస్ట్రైన్ట్ వంటివి ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి. కొత్త ఆడి ఎ 8 ఎల్ ఆడి ప్రీ-సెన్స్ బేసిక్, ఎనిమిది స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగులు, యాక్టివ్ హెడ్ కంట్రోరైన్స్ మరియు సరౌండ్ కెమెరాలు వంటి భద్రతా లక్షణాలతో వస్తుంది.

త్వరపడండి.. 2020 ఆడి ఎ 8 ఎల్ కారు మార్కెట్లోకి వచ్చేసింది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆడి సంస్థ ఇండియన్ మార్కెట్లో కంప్లైంట్ బిఎస్-6 మోడల్ ఆడి ఎ 8 ఎల్ ని రూ. 1.56 కోట్ల ధరతో పరిచయం చేసింది. ఇది మునుపటి వాహనాలకంటే కొంత అప్డేట్ ఫీచర్స్ ని కలిగి ఉంటుంది. భద్రతా లక్షణాలు కూడా వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
New Audi A8 L launched in India, price starts at Rs 1.56 crore. Read in Telugu.
Story first published: Tuesday, February 4, 2020, 10:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X