భారత్‌లో విడుదల కానున్న ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్: టీజర్, వివరాలు

ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త ఎంట్రీ లెవల్ మోడల్ క్యూ2 ని విడుదల చేసిన జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి ఇండియా ఇప్పుడు తాజాగా మరో కొత్త మోడల్‌ను పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. కొత్త ఆడి క్యూ2 ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీని కంపెనీ వర్చువల్ ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసినదే.

భారత్‌లో విడుదల కానున్న ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్: టీజర్, వివరాలు

ఈ ఆన్‌లైన్ లాంచ్ ఈవెంట్ ముగింపు సమయంలో ఆడి ఇండియా ఓ కీలక ప్రకటన చేసింది. అంతేకాకుండా, భారత్‌లో విడుదల చేయబోయే తమ తదుపరి మోడల్ టీజర్‌ను కూడా విడుదల చేసింది. అప్పట్లో కంపెనీ ఈ టీజర్ యొక్క ఖచ్చితమైన మోడల్‌ను వెల్లడించకుండా, అదొక ఫోర్-డోర్ సెడాన్ అని నిర్ధారించింది.

భారత్‌లో విడుదల కానున్న ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్: టీజర్, వివరాలు

కాగా, ఇందుకు సంబంధించిన మరో టీజర్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ టీజర్‌లోని కొన్ని అంశాలను నిశితంగా పరిశీలించగా, ఆడి ఇండియా నుండి రాబోయే తదుపరి మోడల్ ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ అని తెలుస్తోంది. ఈ టీజర్ ఫొటోలో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఇరువైపులా ఉన్న పెద్ద హనీకోంబ్ మెష్ గ్రిల్ వంటి అంశాలను చూసి ఈ మోడల్‌ను ధృవీకరించవచ్చు. ఇందులోని పెద్ద 19-అంగుళాల అల్లాయ్ వీల్ డిజైన్ ఈ విషయాన్ని ధృడపరిచే మరో అంశంగా చెప్పుకోవచ్చు.

MOST READ:ప్రైవేట్ బస్సుకు రూ. 5 లక్షలకుపైగా జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

భారత్‌లో విడుదల కానున్న ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్: టీజర్, వివరాలు

ఈ టీజర్‌ను ప్రదర్శిస్తున్న సమయంలో ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ డిల్లాన్ కూడా ఈ ఏడాదిలోనే ఓ కొత్త మోడల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీపావళి పండుగ సీజన్‌లో వచ్చే నెలలో కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ భారతదేశంలో విడుదల కావచ్చని సమాచారం.

భారత్‌లో విడుదల కానున్న ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్: టీజర్, వివరాలు

ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ విషయానికి వస్తే, 2019లో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఆడి తమ లేటెస్ట్ వెర్షన్ ఎస్5 మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే ఆకర్షణీయమైన డిజైన్ మరియు బెటర్ ఫీచర్లను కలిగి ఉంది.

MOST READ:కారు బోనెట్ మీద పడిన పోలీస్.. పట్టించుకోకుండా కార్ డ్రైవింగ్, చివరికి ఏమైందంటే ?

భారత్‌లో విడుదల కానున్న ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్: టీజర్, వివరాలు

ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ పేరుకు తగినట్లుగా స్పోర్టియర్ లుక్‌ని కలిగి ఉండి, అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ కొత్త 2020 ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌లో కొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ యూనిట్లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ మొదలైన అప్‌డేట్స్ ఉన్నాయి.

భారత్‌లో విడుదల కానున్న ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్: టీజర్, వివరాలు

స్పోర్టీ అండ్ అగ్రెసివ్ డిజైన్ లాంగ్వేజ్‌ను ఆడి తమ ఎస్5 స్పోర్ట్‌బ్యాక్స్ ఇంటీరియర్స్‌లో కూడా క్యారీ చేసింది. ఇది క్యాబిన్ లోపల వర్చువల్ కాక్‌పిట్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఇతర పరికరాలతో సహా ప్రీమియం మరియు స్పోర్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

MOST READ:తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల భీభత్సం ; భారీ సంఖ్యలో కొట్టుకుపోయిన వాహనాలు

భారత్‌లో విడుదల కానున్న ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్: టీజర్, వివరాలు

గ్లోబల్ మార్కెట్లలో లభిస్తున్న ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ కారులో రెండు రకాల ఇంజన్ ఆప్షన్లను అందుబాటులో ఉన్నాయి. అవి: 3.0-లీటర్ పెట్రోల్ లేదా 3.0-లీటర్ డీజిల్ ఇంజన్. అయితే, ఆడి ఇండియా కంపెనీ కేవలం 3.0-లీటర్ టిఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌ను మాత్రమే భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

భారత్‌లో విడుదల కానున్న ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్: టీజర్, వివరాలు

ఇందులోని 3.0-లీటర్ టిఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 330 బిహెచ్‌పి పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఆడి యొక్క సిగ్నేచర్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ అయిన ‘క్వాట్రో' టెక్నాలజీని స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది.

MOST READ:సైక్లిస్టులు ఇలా చేస్తే భారీ జరిమానా తప్పదు.. ఎలాగో తెలుసా ?

భారత్‌లో విడుదల కానున్న ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్: టీజర్, వివరాలు

భారత్‌లో ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఆడి ఇండియా ఈ ఏడాది (2020లో) ఇప్పటి వరకూ భారత మార్కెట్లో ఐదు సరికొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా, ఆడి నుండి రానున్న కొత్త ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ కంపెనీకి భారత్‌లో ఈ ఏడాది ఆరవ మోడల్ అవుతుంది. కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్ మార్కెట్లో ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి సి43 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi India recently introduced their all-new entry-level offering, the Q2 in the Indian market. The new Audi Q2 was launched via a virtual online event and is the newest addition to the brand's portfolio in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X