దేశీయ మార్కెట్లో ఆడి క్యూ2 ఎస్‌యూవీ లాంచ్ : ధర & ఇతర వివరాలు

వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రముఖ ఆడి క్యూ 2 ఎస్‌యూవీ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ కొత్త ఆడి క్యూ 2 ధర రూ. 34.99 లక్షలు. ఆడి క్యూ 2 సంస్థ యొక్క అత్యంత సరసమైన ఎస్‌యూవీ. అయితే దీనికి చాలా కొత్త ఫీచర్లు, పరికరాలు మొదలైనవి ఉన్నాయి. ఆడి క్యూ 2 ఎస్‌యూవీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైంది.

దేశీయ మార్కెట్లో ఆడి క్యూ 2 ఎస్‌యూవీ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఆడి క్యూ 2 ఎస్‌యూవీని కంపెనీ వెబ్‌సైట్ లేదా దేశవ్యాప్తంగా ఏదైనా డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా రూ. 2 లక్షల ముందస్తు మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఆడి క్యూ 2 ఎస్‌యూవీని పూర్తి బిల్ట్ యూనిట్‌గా భారతదేశంలో ప్రవేశపెట్టారు. డెలివరీ రాబోయే రోజుల్లో ప్రారంభమవుతాయి.

దేశీయ మార్కెట్లో ఆడి క్యూ 2 ఎస్‌యూవీ లాంచ్ : ధర & ఇతర వివరాలు

అడ్వాన్స్ లైన్ మరియు డిజైన్ లైన్ ట్రిమ్ కింద మొత్తం ఐదు వేరియంట్లలో ఆడి క్యూ 2 అందుబాటులో ఉంది. దీని అడ్వాన్స్డ్ లైన్‌లో స్టాండర్డ్, ప్రీమియం మరియు ప్రీమియం ప్లస్ 1 మరియు డిజైన్ లైన్‌లో ప్రీమియం ప్లస్ 2 మరియు టెక్నాలజీ ఉన్నాయి.

Audi Q2 Price
Standard ₹34,99,000
Premium ₹40,89,000
Premium Plus I ₹44,64,000
Premium Plus II ₹45,14,000
Technology ₹48,89,000

MOST READ:తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల భీభత్సం ; భారీ సంఖ్యలో కొట్టుకుపోయిన వాహనాలు

దేశీయ మార్కెట్లో ఆడి క్యూ 2 ఎస్‌యూవీ లాంచ్ : ధర & ఇతర వివరాలు

కొత్త ఆడి క్యూ 2 లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించబడింది. ఈ ఇంజన్ 190 బిహెచ్‌పి శక్తిని, 320 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 6.5 సెకన్లలో గంటకు 0 - 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అంతే కాకుండా ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 228 కిమీ.

దేశీయ మార్కెట్లో ఆడి క్యూ 2 ఎస్‌యూవీ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఆడి క్యూ 2 ఎస్‌యూవీ డిజైన్ గమనించినట్లయితే ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, సపరేట్ డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, డైనమిక్ టర్న్ ఇండికేటర్, మాట్టే ఫినిష్ గ్రిల్, ఆడి లోగో, బ్లాక్ అండ్ డ్యూయల్ టోన్ ఓఆర్‌విఎం, 5 స్పోక్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా ట్రిమ్ ప్రకారం స్టైలింగ్ ప్యాకేజీలను ఎంచుకోవచ్చు.

MOST READ:సైక్లిస్టులు ఇలా చేస్తే భారీ జరిమానా తప్పదు.. ఎలాగో తెలుసా ?

దేశీయ మార్కెట్లో ఆడి క్యూ 2 ఎస్‌యూవీ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఆడి క్యూ 2 ఎస్‌యూవీలో ఆడి వర్చువల్ కాక్‌పిట్, స్మార్ట్ ఇంటర్‌ఫేస్, స్పోర్ట్ సీట్, వైర్‌లెస్ ఛార్జింగ్, పార్కింగ్ యాడ్, రియర్ వ్యూ కెమెరా, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

అంతే కాకుండా ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌విఎం, 10 స్పీకర్ ఆడియో సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ వంటి అధునాత ఫీచర్స్ కూడా ఉన్నాయి. కానీముందు సీటు కోసం వెనుక ఎసి వెంట్స్ మరియు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సౌకర్యం లేదు.

దేశీయ మార్కెట్లో ఆడి క్యూ 2 ఎస్‌యూవీ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఆడి క్యూ 2 ఎస్‌యూవీ సంస్థకు చెందిన చిన్న ఎస్‌యూవీ. ఇది 5 వేరియంట్ల ఎంపికలో ప్రవేశపెట్టబడింది. భారతీయ మార్కెట్లో ఈ చిన్న ఎస్‌యూవీ మెర్సిడెస్ జిఎల్‌ఎ, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1, వోల్వో ఎక్స్‌సి 40 మరియు మినీ కంట్రీమన్‌ వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:ఇది చూసారా.. మొబైల్ లైబ్రరీగా మహీంద్రా బొలెరో పిక్-అప్ ట్రక్

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi Q2 Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X