ఆడి క్యూ4 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణ - ఇండియాకు వస్తుందా?

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి గడచిన 2019 జెనీవా మోటార్ షో వేదికగా తమ సరికొత్త 'ఆడి క్యూ4 ఇ-ట్రాన్' కాన్సెప్ట్‌ను తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది ఆడి బ్రాండ్ నుండి రానున్న మొట్టమొదటి కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. కాగా, కంపెనీ ఇప్పుడు క్యూ4 ఇ-ట్రాన్ యొక్క స్పోర్ట్‌బ్యాక్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఆడి క్యూ4 స్పోర్ట్‌బ్యాక్ ఇ-ట్రాన్ 2021లో కూప్ ఎస్‌యూవీగా ఉత్పత్తి దశకు చేరుకుంటుందని ఆడి ప్రకటించింది.

ఆడి క్యూ4 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణ - ఇండియాకు వస్తుందా?

ఆకారం పరంగా చూస్తే ఆడి అందిస్తున్న పాపులర్ క్యూ4 ఎస్‌యూవీ మరియు ఈ కొత్త క్యూ4 స్పోర్ట్‌బ్యాక్ ఇ-ట్రాన్ రెండు కార్లు కూడా చూడటానికి ఒకేలా కనిపిస్తాయి, కానీ వీటిలో ప్రతి మోడల్ కూడా దాని విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 4600 ఎంఎం పొడవు, 1600 ఎంఎం ఎత్తు, 1900 ఎంఎం వెడల్పు మరియు 2770 ఎంఎం వీల్‌బేస్‌ను కలిగి ఉంది.

ఆడి క్యూ4 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణ - ఇండియాకు వస్తుందా?

ఆడి క్యూ4 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ మాడ్యులర్ ఎలక్ట్రిఫికేషన్ ప్లాట్‌ఫామ్ (ఎమ్‌ఈబి)ని ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు. ఇది 50 క్వాట్రో మరియు 55 క్వాట్రో అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. యాంత్రికంగా, ఈ రెండు వేరియంట్లు ఒకే 82 కిలోవాట్ల గంటల బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతాయి మరియు దాదాపు ఒకే రకమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఎమ్ఈబి ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయటం వలన ఈ ఎస్‌యూవీకి విస్తృత శ్రేణి డ్రైవ్ వేరియంట్లు మరియు పవర్ లెవల్స్‌ను జోడించేందుకు కంపెనీకి అవకాశం ఉంటుంది.

MOST READ: ఒకే రోజు 11 జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

ఆడి క్యూ4 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణ - ఇండియాకు వస్తుందా?

ఈ కారులో వెనుక చక్రాలను నడిపే మోటార్ 201 బిహెచ్‌పి శక్తి మరియు 310 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే ముందు చక్రనాలను నడిపే మోటార్ 100 బిహెచ్‌పి శక్తిని మరియు 150 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు మోటార్లు కలిపి, సంయుక్తంగా 302 బిహెచ్‌పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు కేవలం 6.3 సెకన్లలోనే గంటకు 0-100 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 180 కి.మీకు పరిమితం చేశారు.

ఆడి క్యూ4 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణ - ఇండియాకు వస్తుందా?

ఈ కారులోని 82 కిలోవాట్ల అవర్స్ బ్యాటరీ ప్యాక్‌ని వాహన ఫ్లాట్‌ఫామ్‌లో అమర్చబడి ఉంటుంది. పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 450 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు బ్యాటరీ మొత్తం సామర్థ్యంలో 80 శాతానికి చేరుకోవడానికి 30 నిమిషాల కన్నా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. బ్యాటరీ వ్యవస్థ బరువు 510 కిలోగ్రాములు ఉంటుంది మరియు దీనిని ఖచ్చితమైన 50:50 నిష్పత్తిలో బరువు పంపిణీని చేసేలా అమర్చారు.

MOST READ: త్వరలో అందుబాటులోకి రానున్న ఎగిరే కార్లు, చూసారా !

ఆడి క్యూ4 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణ - ఇండియాకు వస్తుందా?

ఆడి క్యూ4 స్పోర్ట్‌బ్యాక్ ఇ-ట్రాన్ మొత్తం సిల్హౌట్ సూక్ష్మ మరియు డైనమిక్ వక్రంలో వెనుక వైపుకు క్రిందికి వాలుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే, కారు పైభాగం (రూఫ్) క్రిందికి వాలుగా ఉండి స్పాయిలర్‌లో విలీనం అయినట్లు కనిపిస్తుంది. ఫలితంగా క్యూ4 ఇ-ట్రాన్ కాన్సెప్ట్ కన్నా ఆడి క్యూ4 స్పోర్ట్‌బ్యాక్‌ మరింత పొడవుగా కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీలో పూర్తి ఎల్‌ఈడి హెడ్‌లైట్ సెటప్, ముందు మరియు వెనుక భాగంలో ట్వీక్ చేయబడిన బంపర్స్ వంటి మార్పులను చూడొచ్చు.

ఆడి క్యూ4 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణ - ఇండియాకు వస్తుందా?

ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్‌లతో పాటుగా సీట్లు మొత్తాన్ని అల్కాంటారాతో లెథర్‌తో డిజైన్ చేశారు. ఆడి క్యూ4 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్‌లో ఆడి వర్చువల్ కాక్‌పిట్, పెద్ద-ఫార్మాట్ హెడ్-అప్ డిస్‌ప్లే, 12.3 ఇంచ్‌ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుందని సమాచారం.

MOST READ: సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

ఆడి క్యూ4 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్ కాన్సెప్ట్ ఆవిష్కరణ - ఇండియాకు వస్తుందా?

ఆడి క్యూ4 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ మధ్య కాలంలో భారత మార్కెట్లో అనేక మంది తయారీదారులు తమ పెట్రోల్/డీజిల్ వెర్షన్ కార్లతో పాటుగా కొత్తగా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడి కూడా తమ కొత్త క్యూ4 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ కారును భారత్‌లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 2022 నాటికి దేశంలో ఆడి క్యూ4 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ విడుదల కావచ్చని అంచనా.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi had showcased the Q4 e-tron concept at the 2019 Geneva Motor Show, giving us a glimpse of the company's first compact electric SUV. However, the company has unveiled the Sportback version of the Q4 e-tron. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X