భారత్‌లో ఆడి క్యూ 8 సెలబ్రేషన్ మోడల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆడి తన క్యూ 8 సెలబ్రేషన్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేశారు. దీని ధర రూ. 98.98 లక్షలు. ఈ ఫెస్టివల్ సీజన్లో ఆడి క్యూ 8 సెలబ్రేషన్ కొత్త ఎంపికగా ప్రవేశపెట్టబడింది, దాని బుకింగ్ కూడా ప్రారంభించబడ్డాయి. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త ఆడి క్యూ 8 కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో ఆడి క్యూ 8 సెలబ్రేషన్ మోడల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఆడి క్యూ 8 యొక్క ఈ స్పెషల్ మోడల్ చాలా ఫీచర్లు మరియు పరికరాలతో లాంచ్ చేయబడింది. ఈ కంపెనీ జనవరిలో స్టాండర్డ్ మోడల్‌ను విడుదల చేసింది. దీనికి భారత మార్కెట్లో మంచి స్పందన లభించింది, కాబట్టి మరింత ప్రత్యామ్నాయాన్ని అందించడానికి కంపెనీ దీనిని ప్రారంభించింది. ఆడి క్యూ 8 సెలబ్రేషన్ ధర కూడా స్టాండర్డ్ వేరియంట్ కన్నా తక్కువగా ఉంటుంది.

భారత్‌లో ఆడి క్యూ 8 సెలబ్రేషన్ మోడల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ప్రస్తుతం ఆడి క్యూ 8 రూ. 1.33 కోట్లకు, ఆడి ఆర్‌ఎస్ క్యూ 8 రూ. 2.07 కోట్ల రూపాయలకు మార్కెట్లో అమ్ముడవుతోంది. కస్టమర్లు ఆడి క్యూ 8 సెలబ్రేషన్ మోడల్‌ను దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లతో కంపెనీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

MOST READ:ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

భారత్‌లో ఆడి క్యూ 8 సెలబ్రేషన్ మోడల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఆడి క్యూ 8 సెలబ్రేషన్‌లో బిఎస్ 6 కంప్లైంట్ 3.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 340 బిహెచ్‌పి పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ కారు మరియు 8 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.

భారత్‌లో ఆడి క్యూ 8 సెలబ్రేషన్ మోడల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఈ ఎస్‌యూవీ కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 - 100 కిమీ వేగవంతం అవుతుంది. అంతే కాకుండా దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ. ఆఫర్ పరంగా తగినంత ఫీచర్లు మరియు పరికరాలు కూడా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !

భారత్‌లో ఆడి క్యూ 8 సెలబ్రేషన్ మోడల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఇక ఇందులోని ఫీచర్స్ విషయానికొస్తే, ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, మసాజ్ మరియు వెంటిలేషన్ ఫంక్షన్‌తో అనుకూలీకరించిన సీట్లు, వాయిస్ కంట్రోల్ వంటివి ఉంటాయి. దీనితో పాటు, పనోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ ఆడి క్యూ 8 లో ఇవ్వబడింది.

భారత్‌లో ఆడి క్యూ 8 సెలబ్రేషన్ మోడల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఇందులో సేఫ్టీ విషయానికి విషయానికొస్తే, ఇందులో 8 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ రూమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

MOST READ:20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

భారత్‌లో ఆడి క్యూ 8 సెలబ్రేషన్ మోడల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఈ కారుకి ఇరువైపులా ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇందులో 21-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పెద్ద వీల్ ఆర్క్స్‌తో చూడవచ్చు, ఆడి క్యూ 8 వెనుక భాగంలో కనెక్ట్ చేయబడిన ఎల్‌ఇడి టైలాంప్ మరియు రెండు ఎగ్జాస్ట్ టిప్స్ ఉన్నాయి. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. అంతే కాకుండా ఇది వాహనదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi Q8 Celebration Launched. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X