Just In
- 21 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 24 hrs ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రపంచవ్యాప్తంగా ఈ కారు 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది ; అది ఏ కారో తెలుసా ?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి అంతర్జాతీయంగా 2021 ఆర్8 పాంథర్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. కొత్త (2021) ఆడి ఆర్ 8 పాంథర్ ఎడిషన్ మంచి డిజైన్ అప్డేట్స్, అదనపు ఫీచర్లు మరియు ఎక్స్‌క్లూజివ్ పెయింట్ స్కీమ్‌తో వస్తుంది. కొత్త స్పెషల్ ఎడిషన్ ఆడి ఆర్ 8 స్పోర్ట్స్ కారును కేవలం 30 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడుతుంది.

కొత్త స్పెషల్ ఎడిషన్ ఆడి ఆర్ 8 యొక్క డిజైన్ అప్డేట్స్ గమనించినట్లయితే, ఈ స్పోర్ట్స్ కారు స్పెషల్ బ్లాక్ పెయింట్‌తో వస్తుంది, దీనిని కార్‌మేకర్ ‘పాంథర్ బ్లాక్ క్రిస్టల్ ఎఫెక్ట్ పెయింట్' అని పిలుస్తారు. కొత్త పెయింట్ స్కీమ్‌తో పాటు, ఆడి ఆర్ 8 పాంథర్ ఎడిషన్ యొక్క వెలుపలి భాగాలు కూడా రెడ్ ఆక్సెంట్స్ తో బ్లాక్-అవుట్ 20 ఇంచెస్ వీల్స్ తో వస్తాయి.

ఇక ఈ కొత్త ఆడి ఆర్ 8 కారులోని ఇంటీరియర్ విషయానికి వస్తే ఈ స్పెషల్ ఎడిషన్ ఆర్ 8 స్పోర్ట్స్ కారు క్రిమ్సన్ రెడ్ మరియు బ్లాక్ కలర్ థీమ్‌తో వస్తుంది. డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్ మరియు సైడ్ డోర్ ప్యానెల్స్ అన్నీ రెడ్ కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ తో బ్లాక్ కలర్ లో పూర్తయ్యాయి. సీట్లు క్రిమ్సన్ రెడ్ నాప్ప లెదర్ అప్హోల్స్టరీలో చుట్టబడి ఉంటాయి. ఆడి ఆర్ 8 పాంథర్ ఎడిషన్ యొక్క మొత్తం క్యాబిన్ కార్బన్-ఫైబర్ మరియు గ్లోస్ బ్లాక్ ఎలిమెంట్ల మిశ్రమంలో పూర్తయింది.
MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే

పాంథర్ ఎడిషన్ స్టాండర్డ్ ఆర్ 8 వి 10 మోడల్లో అందించే అన్ని ఇతర ఫీచర్స్ తో ముందుకు వెళ్తుంది. ఇందులో ప్రకాశవంతమైన డోర్ సిల్స్, పూర్తి కార్బన్-ఫైబర్ ప్యాకేజీ, వెలుపలి చుట్టూ ఎల్ఈడీ లైటింగ్, 13-స్పీకర్ బ్యాంగ్ & ఓలుఫ్సేన్ సౌండ్ సిస్టమ్ తో పాటు మరెన్నో ఉన్నాయి.

కొత్త 2021 ఆడి ఆర్ 8 పాంథర్ ఎడిషన్‌లో యాంత్రిక మార్పులు లేవు. ఇది స్టాండర్డ్ మోడళ్ల మాదిరిగానే అదే ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 5.2-లీటర్ నాచురల్లీ సహజంగా ఆస్పిరేటెడ్ వి 10 పెట్రోల్ ఇంజన్ తో వస్తునఃది. ఇది 525 బిహెచ్పి మరియు 540 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది. ఇది పవర్ వెనుక చక్రాలకు మాత్రమే పంపుతుంది.
MOST READ:కుండపోత వర్షంలో నిలబడి 4 గంటలు డ్యూటీ చేసిన పోలీస్.. ఎక్కడో తెలుసా ?

ఇక ఈ కొత్త ఆడి ఆర్ 8 యొక్క పనితీరు విషయానికొస్తే, ఇది కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 323 కిలోమీటర్లు.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం :
ఆడి ఆర్ 8 ఎడిషన్ మోడల్ కావడంతో భారత మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం చాలా తక్కువ. ఆడి ఆర్ 8 అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన స్పోర్ట్స్ కార్ ఆఫర్. ఇది కొంతకాలంగా అమ్మకానికి ఉంది, ఇది ఇప్పటికే అనేక కొత్త అప్డేట్స్ కలిగి మునుపటి వెర్షన్లకంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
MOST READ:పబ్జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !